సమంత ఇష్యూ- భిన్న ధృవాలు

ఇప్పుడు గట్టిగా ట్వీట్ లు వేసిన వారందరికీ భవిష్యత్ లో ప్రభుత్వం కచ్చితంగా సినిమా చూపించేస్తుంది.

అక్కినేని కుటుంబం మీద మరక పడగానే ఇండస్ట్రీ అంతా దాదాపుగా ట్వీట్ ల వర్షం కురిపించారు. తెలుగు నాట పుట్టి, తెలుగు సినిమాలు చేస్తూ, ఇంగ్లీష్ పాండిత్యం అంతా వొలకబోసారు. ఓ పనైపోయింది. కానీ నిజంగా సినిమా ఇండస్ట్రీలో అంత ఐక్యత వుందా? అఖిల్ అంటే గుడ్డలు చించేసుకుంటాం.. చైతూ అంటే వెర్రెత్తిపోతాం అనే ఫ్యాన్స్ ఒక్కరంటే ఒక్కరు రోడ్డెక్కలేదు. నిరసన తెలియచేయలేదు. ఇండస్ట్రీ జ‌నాలు, పవన్, బాలకృష్ణ మినహా మిగిలిన వారంతా ఖండించారు.

పవన్ సనాతన ధర్మ పరిరక్షణలో బిజీగా వున్నారు. హిందూత్వకు ఏమైనా ముప్పు వస్తోందన్న బ్రాడ్ అందోళన వుంటే వుండొచ్చు కానీ, ఈ సనాతన ధర్మానికి ఏమైంది అన్నది కామన్ మాన్ కు అంతు పట్టదు. అది వేరే సంగతి. బాలకృష్ణకు అక్కినేని ఫ్యామిలీతో పొసగదు. గతంలోనే అక్కినేని.. తొక్కనేని అనే టైపులో ఓ మాట విసిరారు. అందువల్ల ఇప్పుడు అయన మాట్లాడలేదు.

చాలా మంది కమ్మ సామాజిక వర్గానికి, తెలుగు దేశం అనుకూల వర్గానికి మాత్రం వేరే వైపు వున్నారు. రేవంత్ కు బాసటగా నిలుస్తున్నారు. ముందు ముందు సినిమా జ‌నాల సంగతి చూడాలి అన్నట్లు సోషల్ మీడియాలో గర్జిస్తున్నారు. మొదటి రోజు కేవలం సినిమా జ‌నాల ట్వీట్ లు మహా అయితే డజ‌నో, డజ‌నున్నరో కనిపిస్తే, మర్నాటి నుంచి సినిమా జ‌నాల మీద పడిన ట్వీట్ లు లెక్కకు అందవు.

మంత్రి కొండా సురేఖ తప్పు మాట్లాడారు. అందులో అణుమాత్రం సందేహం లేదు. కానీ సినిమా జ‌నాలకు మద్దుతు ఎందుకు రావడం లేదు అంటే.. వాళ్ల స్పందన ఎప్పుడూ అచి తూచి వుంటుంది. పార్టీల లెక్కలు, మొహమాటాలు, తమ వ్యాపారాలు ఇలా చాలా వుంటాయి. కులాల లెక్కలు వుంటాయి. ఇంకా చాలా చాలా వుంటాయి. అంతే తప్ప ప్రతి విషయంలోనూ చటుక్కున స్పందించడం అన్నది అరుదుగా వుంటుంది. అందుకే జ‌నాలకు సినిమా జ‌నాల మీద అభిమానం ఎంత వుంటుందో, ఓవరాల్ గా ఇండస్ట్రీ మీద అంత నెగిటివ్ వుంటుంది.

మొదటి రోజు తన స్టేట్ మెంట్ ను దాదాపు వెనక్కు తీసుకున్న మంత్రి కొండా సురేఖ మళ్లీ మరోసారి గట్టిగా గొంతు విప్పారు ఎందుకని? సినిమా వాళ్ల బలహీనతలు లెక్కలు తెలుసు కనుక. తెల్లవారి లేస్తే సినిమా వాళ్ల పంచాయతీలు సవాలక్ష వుంటాయి. అక్రమ సంబంధాలు, పేకాటలు, డ్రగ్స్, పార్టీలు, హవాలా, నల్లధనం ఇలా ఒకటి కాదు రెండు కాదు. సవా లక్ష అవలక్షణాలు ఇక్కడే వున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఈ మాత్రం గొంతు విప్పారు. అదే జ‌గన్ లేదా చంద్రబాబు వుంటే అస్సలు పెదవి కదిలేది కాదు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి కూడా అదే విధమైన రియాక్షన్ వుంటుందనే వార్తలు ఇండస్ట్రీలో గుప్పు మంటున్నాయి. టికెట్ రేట్లు కావాలి, అదనపు షో లు కావాలి, మొన్న ఓ హీరో యాంటీ డ్రగ్స్ వీడియో ఇవ్వకపోయే సరికి టికెట్ రేట్ల విషయంలో కన్నం పడింది. మర్నాడు ఉరకలు పరుగులు మీద వీడియో ఇచ్చి రేట్లు తెచ్చుకున్నారు. అందువల్ల ఇప్పుడు గట్టిగా ట్వీట్ లు వేసిన వారందరికీ భవిష్యత్ లో ప్రభుత్వం కచ్చితంగా సినిమా చూపించేస్తుంది.

అందుకే మంత్రి మరోసారి చేసిన వ్యాఖ్యల మీద మరెవరు మాట్లాడలేదు. కోర్టు కేసు అన్నది ఎప్పుడు అయిన విత్ డ్రా కావడం లేదా నీరసించడం పెద్ద విషయం కాదు.

22 Replies to “సమంత ఇష్యూ- భిన్న ధృవాలు”

    1. జగన్ రెడ్డి పీకలదాకా వచ్చింది..

      బాబాయ్ హత్య లో సిబిఐ దర్యాప్తు వద్దంటాడు… అది మా ఫామిలీ పర్సనల్ అంటాడు..

      లడ్డు కల్తీ విషయం లో.. సిట్ దర్యాప్తు వద్దంటాడు.. వాడికి వాడే క్లీన్ చిట్ ఇచ్చేసుకొంటాడు..

      వాడో రకం జంతువు.. మనిషి రూపం లో బతుకుతుంటాడు..

  1. Buvaneswari గురించి మాట్లాడింది మన వైసిపి వాడే అప్డు ఈ అక్కినేని కి ఏమయింది రెస్పాండ్ కలేదు అసలు

  2. జగన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు ? వాడి కులం కాదు అనుకున్నాడా ? మరి చీకటి వ్యాపారం చేసినప్పుడు ఆ కులం అడ్డు రాలేదా నీచ జగన్ రెడ్డి ??

  3. ఫాన్స్ రోడ్డు ఎక్కలేదు అని రాసారు, గత ఐదేళ్ల లో ఎవరికైనా మద్దతు గా జనాలు రోడ్డు కి ఎక్కిన దాఖలా లు ఉన్నాయా?

  4. venkati listen this, it’s not samantha issue, it’s nagarjuna issue!! by this issue samantha came out clean and made it very clear how painful & pathetic her divorce indeed was!!

  5. నాగార్జున గారు అంటే ఏమిటో నీకు మున్ముందు తెలుస్తుంది. నీలాంటి పిచ్చోళ్లకు అర్ధం కాదురా వె.. పువ్వు 

Comments are closed.