లోకేష్ ప్రగల్భాలు ఇంతింత కాదయా!

రాజకీయ నాయకులు ఏ రోటి కాడ ఆ పాట పాడడం చాలా సహజం. ఏ ఊరు వెళ్తే ఆ ఊరును అద్భుతంగా తీర్చిదిద్దేస్తామని అక్కడి ప్రజలకు ప్రమాణాలు చేయడం కూడా సహజం! ఏ ప్రాంతపు…

రాజకీయ నాయకులు ఏ రోటి కాడ ఆ పాట పాడడం చాలా సహజం. ఏ ఊరు వెళ్తే ఆ ఊరును అద్భుతంగా తీర్చిదిద్దేస్తామని అక్కడి ప్రజలకు ప్రమాణాలు చేయడం కూడా సహజం! ఏ ప్రాంతపు లేదా ఏ కులపు నాయకులు తమ వద్దకు వస్తే.. వారి ప్రాంతాన్ని వారి కులాన్ని ఉద్ధరించడానికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పడం కూడా మనకు తెలుసు! అయితే ఆ హామీలకు ఒక ర్యాంకింగ్ సిస్టం పెట్టి నెంబర్ వన్, నెంబర్ టు, లేదా నెంబర్ ఫైవ్ లాగా మిమ్మల్ని తయారు చేసేస్తాను అని చెప్పడం కాస్త అతిశయోక్తి అనిపిస్తుంది.

విశాఖపట్నం నగరానికి టీసీఎస్ డెవలప్‌మెంట్ జోన్ వస్తున్న సంగతి గొప్ప విషయమే! కానీ కార్యరూపం దాలుస్తున్న ఈ ఒక్క మాటను పట్టుకుని విశాఖపట్నాన్ని దేశంలోనే టాప్ ఐదు నగరాలలో ఒకటిగా తయారు చేస్తానని నారా లోకేష్ ప్రకటించడం ప్రగల్భాలు కాక మరేమిటి?

జగన్మోహన్ రెడ్డి విశాఖపట్టణం ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అభివృద్ధి చేస్తాననే మాట ఇచ్చారు. ఆ మేరకు విశాఖ వాసుల్లో కొందరికి ఆశలున్నాయి. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. అమరావతి ఒక్కటే రాజధాని అనే పాత కాన్సెప్టుతో వెళ్లడం వలన.. విశాఖవాసుల ఆశలు భంగపడ్డాయి. వారిని దువ్వడానికి తెలుగుదేశం నానా కష్టాలు పడుతోంది.

టీసీఎస్ డెవలప్మెంట్ జోన్ వంటివి ప్రకటించడం ఆ ప్రయత్నాల్లో భాగమే. ఆ రకంగా ప్రభుత్వం ఒక రకంగా ప్రయత్నాల్లో ఉంటే.. విశాఖకు చాలా చాలా మేలు చేసేసినట్టుగా ప్రభుత్వాన్ని భజన చేయడానికి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లు తయారవుతున్నారు.

ఇటీవలి ఎన్నికల తర్వాత మంత్రి పదవిని ఆశించి భంగపడిన వారిలో గంటా కూడా ఉన్నారు. మంత్రి పదవి ఎటూ దక్కేలా లేదు. కనీసం తత్సమానమైన మరో మంచి పదవి దక్కించుకోవడం ఆయన అవసరం. కానీ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న అయిదేళ్లూ మొహం చాటేసి బతికిన గంటాకు ఒక్కసారిగా చంద్రబాబు గొప్ప పదవులు ఇస్తారనుకోవడం భ్రమ. కానీ, ఆయన కనీసం లోకేష్ ను కాకా పట్టడం ద్వారా అయినా ఏదైనా లాభం ఉంటుందేమో అనుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

విశాఖకు టీసీఎస్ ను తీసుకువచ్చినందుకు ప్రత్యేకంగా నారా లోకేష్ ను కలిసి విశాఖ వాసుల తరఫున ధన్యవాదాలు చెప్పారు ఈ భీమిలి ఎమ్మెల్యే. ప్రాజెక్టు రాక ముందే గంటా ధన్యవాదాలు ఎక్స్‌ట్రా అనుకుంటే.. అంతకంటే ఎక్స్‌ట్రా గా ఉంది లోకేష్ ధోరణి.

విశాఖను దేశంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా తయారుచేసేస్తానని లోకేష్ ఆయనకు ప్రామిస్ చేసేశారు. అంటే ఏమిటన్న మాట కనీసం ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు నగరాలను తలదన్నేలాగా విశాఖను తయారుచేస్తారన్నమాట. ‘ఎప్పటికి?’ అనేది మాత్రం లోకేష్ చెప్పలేదు. మధ్యలో అమరావతి అనే ప్రపంచస్థాయి నగరాన్ని ఈ దేశంలో ఏ ర్యాంకులో పెట్టదలచుకున్నారో నారా వారు.. ఆ సంగతి కూడా తెలియదు. అయినా వినేవాళ్లు వెర్రి వెంగళాయిలు అయితే చెప్పేవాళ్లు చేట భారతమంత చెప్తారు.. వారికి పోయేదేముంది.

15 Replies to “లోకేష్ ప్రగల్భాలు ఇంతింత కాదయా!”

  1. మరి నువ్వు మన కాసాయి రెడ్డి విశాకలొ ఎదొ ప్రవెటు యూనివెర్సిటి పెడుతున్నాడు. అది ప్రపంచంలొనె టాప్ యూనివర్సిటి కాబొతుంది అని రాసావ్!

    .

  2. వైజాగ్ వాళ్ళు మొహం మీద ఉమ్మేసినా అవే పనికిమాలిన రాతలు..

    వైజాగ్/ ఆంధ్ర డెవలప్ అవ్వాలి అంటే వైసీపీ పూర్తిగా బూస్థాపితం అవ్వాలి

      1. కొంచెం మీరే అర్థం అయ్యేలా చెప్పండి ప్లీజ్, ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, MOU ఎప్పుడు చేశారు, కొంచెం ప్రూఫ్స్ ఉంటే చెప్పండి అప్పుడే కదా జగన్ నీ నమ్మేది…

  3. పాపం పిచ్చి ముదిరినట్లు ఉంది …..వీకెండ్ రెస్ట్ తీసుకో బయ్యా. ంఒందయ్ ఫ్రెష్ గ రాసుకోవచ్చు సొల్లు

  4. Emi ra GA ni valla use siggu sheram emi undayara miku emi arhata undi ra miku vizag gurinchi matladataniki okka seat ina gelichara 2024 even in 2019 where ysr sweeped elections chi chi

  5. రాజధాని పేరు చెప్పి భూములు కొట్టేసిన, వున్న కంపెనీలని వెళ్లగొట్టినందుకు విశాఖ జిల్లా వాసులు ycp కి గట్టిగా బుద్ది చెప్పారు ఇక్కడ రాజధానిని ఎవరూ కోరుకోవటం లేదు ఇంకా అర్ధం కాలేదా బ్రదర్

  6. పని చేసినట్టు చెప్పుకోవడానికి చాలా ప్రూవ్స్ ఉన్నాయి, (కియా, శ్రీ సిటీ లో ఉన్న మరి కొన్ని కంపెనీలు )

    మన గత ప్రభువుల పైత్యం తో వెళ్లిపోయిన కంపెనీలు ( JPMC, HSBC, AMARARAJA, LULU,) ఇవి సరే, చెప్పుకోవడానికి ఒక MNC, లేదా ఒక పెద్ద ఇండస్ట్రీ పేరు కూడా చెప్పలేరు.ఒక పాలసీ లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, G18 సమ్మిట్ లో హంగామా చేశారు, ఒక్కటి కూడా గుడ్డు పగల్లేదు

  7.  పని చేసినట్టు చెప్పుకోవడానికి చాలా ప్రూవ్స్ ఉన్నాయి, (కియా, శ్రీ సిటీ లో ఉన్న మరి కొన్ని కంపెనీలు )

    మన గత ప్రభువుల పైత్యం తో వెళ్లిపోయిన కంపెనీలు ( JPMC, HSBC, AMARARAJA, LULU,) ఇవి సరే, చెప్పుకోవడానికి ఒక MNC, లేదా ఒక పెద్ద ఇండస్ట్రీ పేరు కూడా చెప్పలేరు.ఒక పాలసీ లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, G18 సమ్మిట్ లో హంగామా చేశారు, ఒక్కటి కూడా గుడ్డు పగల్లేదు

Comments are closed.