బాలయ్య.. అఖండ.. తాండవం

బాలయ్య- బోయపాటి అఖండ సినిమా ఒక ఎమోషనల్ స్పిరిట్యువల్ జ‌ర్నీ. అ సినిమా మంచి హిట్ కొట్టిన దగ్గర నుంచి సీక్వెల్ మాట వినిపిస్తూనే వుంది. ఇప్పటికి టైమ్ వచ్చింది. 14 రీల్స్ బ్యానర్…

బాలయ్య- బోయపాటి అఖండ సినిమా ఒక ఎమోషనల్ స్పిరిట్యువల్ జ‌ర్నీ. అ సినిమా మంచి హిట్ కొట్టిన దగ్గర నుంచి సీక్వెల్ మాట వినిపిస్తూనే వుంది. ఇప్పటికి టైమ్ వచ్చింది. 14 రీల్స్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈ సినిమాకు 16న శ్రీకారం చుడుతున్నారు. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

ఈ సినిమాకు అఖండ 2 అన్నదే టైటిల్, అయితే ట్యాగ్ లైన్ మాత్రం దానికి అనుబంధంగా ఫిక్స్ చేసారు. తాండవం అన్నది ట్యాగ్ లైన్. అంటే 2 అన్నది పక్కన పెడితే అఖండ తాండవం అన్నది టైటిల్ గా అనిపిస్తుంది. అఖండ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించారు. అదే పాత్ర కొనసాగుతుంది. శివుడి తాండవం, శివ తాండవం మాదిరిగా అఖండ తాండవం అనుకోవాలి.

అఖండ సినిమా ఎక్కడ ముగిసిందో, అదే పాప పెద్ద అయిన దగ్గర నుంచి రెండో భాగం మొదలు అవుతుందని తెలుస్తోంది. బోయపాటి అఖండ 2 స్క్రిప్ట్ మీదే గత ఆరేడు నెలలుగా వర్క్ చేస్తున్నారు. అది రెడీ కావడంతో ఇప్పుడు పూజ నిర్వహిస్తున్నారు.

అయితే షూట్ మాత్రం ఇప్పుడే కాదు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా షూట్ ఇంకా వుంది. అది డిసెంబర్ సగం వరకు వుండొచ్చు. అందువల్ల అది అయ్యాకే అఖండ 2 షూట్ స్టార్ట్ అవుతుంది.

10 Replies to “బాలయ్య.. అఖండ.. తాండవం”

    1. మరే, మహానుభావులు అందరూ శ్రీ రెడ్డి, ఆర్జీవి సినిమాలు చూస్తారు..

  1. Naa valla kaadu swamy. E boyapati balayya movies choodatam. Trailer varaku choosi happy ga feel avuta. Simha, legend, akhanda kuda choodaledu. Kondaru fans ki tappa maa lanti story based movies choodali anukune vallaku assalu avvadu

Comments are closed.