నిన్ను న‌మ్మేదెట్టా జ‌గ‌న్‌?

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌, ఆయ‌న కోట‌రీ వ్య‌వ‌హార తీరు మిగిల్చిన చేదు జ్ఞాప‌కాలు… సొంత వాళ్ల‌ను ఇంకా వెంటాడుతూ వున్నాయి

చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు అని సుమ‌తీ శ‌త‌కంలో చెప్పిన‌ట్టుగా వైసీపీ ప‌రిస్థితి ఉంది. చీమ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డి పుట్ట‌ను నిర్మించుకుంటే, అది కాస్త పాముల‌కు నివాసం అయిన‌ట్టుగా.. వైసీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు సోష‌ల్ మీడియాలోనూ, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. కానీ 2019-24 మ‌ధ్య వైసీపీ అధికారం ఎవ‌రి పాలైందో అంద‌రికీ తెలుసు. అందుకే ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం చెందింది.

ఇప్పుడు మ‌ళ్లీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఎవ‌రైతే ప్ర‌తిప‌క్షంలో బాగా క‌ష్ట‌ప‌డ‌తారో వాళ్ల పేర్ల‌ను గుడ్‌బుక్‌లో రాసుకుంటార‌ట‌. అధికారం వ‌చ్చిన వెంట‌నే శ్ర‌మించిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ప్ర‌మోష‌న్ ఇస్తాన‌ని హామీ ఇవ్వ‌డం విశేషం. జ‌గ‌న్ మాట‌ల్ని విశ్వ‌సించ‌డం ఎలా? వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల‌లో ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎవ‌రికీ ఏమీ చేయ‌లేదు.

2014-19 మ‌ధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు సోష‌ల్ మీడియాలోనూ, క్షేత్ర‌స్థాయిలోనూ త‌మ శ‌క్తి మేర‌కు అంద‌రూ జ‌గ‌న్ సీఎం కావాలనే ఆకాంక్ష‌తో ప‌ని చేశారు. వైసీపీ అధికారంలోకి వ‌స్తే త‌మ బ‌తుకులు మారుతాయ‌ని న‌మ్మారు. బ‌తుకులు మార‌డం దేవుడెరుగు… వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌రింత దిగ‌జారాయ‌నే వాళ్లే ఎక్కువ‌.

వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప‌ల్నాడుకు చెందిన వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ప్రాణాల‌కు తెగించి జ‌గ‌న్ కోసం నిల‌బ‌డ్డారు. జ‌గ‌న్‌కు చెందిన స‌ర‌స్వ‌తి భూముల కోసం పిన్నెల్లి పోరాడారు. కానీ వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. పిన్నెల్లికి క‌లిగిన ప్ర‌యోజ‌నం శూన్యం. క‌నీసం పిన్నెల్లికి ముఖ్యమంత్రిగా వైఎస్ జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. కానీ టీడీపీ నాయ‌కురాలిగా జ‌గ‌న్‌ను రాక్ష‌సుడిగా పోల్చిన విడ‌ద‌ల ర‌జినీకి మాత్రం చిల‌క‌లూరిపేట టికెట్ ఇవ్వ‌డంతో పాటు ఆమెకు మంత్రి ప‌ద‌విని కూడా బోన‌స్‌గా ఇచ్చారు. ఇదీ జ‌గ‌న్ స్వ‌భావం, మ‌రి జ‌గ‌న్‌ను ఇప్పుడు న‌మ్మేదెట్టా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

అలాగే వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎంతో మంది సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశారు. కేసులు పెట్టించుకున్నారు, జైలుకెళ్లారు. అంతెందుకు చంద్ర‌బాబు సామాజిక వర్గానికి చెందిన ఇంటూరి ర‌వికిర‌ణ్‌ను నాడు చంద్ర‌బాబు స‌ర్కార్ ముప్పుతిప్ప‌లు పెట్టింది. ఇంటూరిని కిడ్నాప్ చేసి చిత్ర‌హింస‌లు పెట్టారు. వైసీపీ అధికాంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇంటూరితో పాటు ఆయ‌న‌లా ప‌ని చేసిన సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు ద‌క్కిన ప్ర‌తిఫ‌లం ఏంటి? ఏమీ లేదు. వైసీపీ అధికారంలోకి రాగానే కొంత కాలం దేవేంద్ర‌రెడ్డి సోష‌ల్ మీడియా బాస్‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఆ త‌ర్వాత అస‌లు సోష‌ల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ లేని స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జ‌గ‌న్ వైఖ‌రి ఎట్లా వుంటుందంటే… సోష‌ల్ మీడియా బాధ్య‌త‌లు అప్ప‌గించే వ్య‌క్తికి అందులో ఖాతా అవ‌స‌రం లేద‌ని న‌మ్ముతారు. వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు బాగా తెలుస‌ని ఆయ‌న అనుకుంటారు. ఇలాంటి ధోర‌ణితో జ‌గ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే రాక్ష‌స స‌మూహంతో యుద్ధం చేయ‌డం సాధ్య‌మా?

ఇప్పుడు జ‌గ‌న్ కొత్త‌గా ఇస్తున్న పిలుపు వింటుంటే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. జ‌గ‌న్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం.

“ఇప్పుడు సోష‌ల్ మీడియా కాలం. ఇది నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ నుంచి గ్రామ‌స్థాయి లీడ‌ర్ వ‌ర‌కూ ధ్యాస‌పెట్టాలి. ప్ర‌తి గ్రామంలోనూ పార్టీ క‌మిటీల‌న్నీ సోష‌ల్ మీడియాకు అనుసంధానం కావాలి. క‌మిటీల్లోని ప్ర‌తి ఒక్క‌రూ వాళ్ల సామాజిక మాధ్య‌మాల్లో చురుగ్గా వుండాలి. మీ పేజీలను మీరే న‌డిపాలి. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలు త‌యారు చేసుకోవాలి”

ప్ర‌తి పక్షంలో ఉన్న‌ప్పుడేమో అమాయ‌కుల్ని బ‌లి చేయ‌డానికి జ‌గ‌న్ త‌పిస్తుంటారు. అధికారంలో ఉన్న‌ప్పుడు చెలాయించిన సజ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి, వీరారెడ్డి, అర్జున్‌రెడ్డి లాంటి వీరులు, శూరులు ఇప్పుడు ఏమ‌య్యారు? వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు సోష‌ల్ మీడియా నిర్వ‌హ‌ణ‌కు చేసిన ఖ‌ర్చు ఎంత‌? అందులో స‌జ్జ‌ల భార్గ‌వ్ అండ్ టీమ్ వెన‌కేసుకున్న మొత్తం ఎంతో క‌నీసం జ‌గ‌న్ ఇప్ప‌టికైనా గుర్తించారా? ఇప్పుడు అధికారంలో లేక‌పోవ‌డంతో స‌జ్జ‌ల భార్గ‌వ్‌, ఆయ‌న‌తో క‌లిసిన టీమ్‌… చ‌ల్ల‌గా త‌ప్పుకుంది. త‌మ వ్యాపారాల్లో నిమ‌గ్న‌మ‌య్యారు.

రేపు వైసీపీ అధికారంలోకి వ‌స్తే… మ‌ళ్లీ స‌జ్జ‌ల భార్గ‌వ్‌, అర్జున్‌రెడ్డి, వీరారెడ్డి లాంటి వాళ్లే క‌దా ముందుకొచ్చేద‌నే భావ‌న బ‌లీయంగా వుంది. అందుకే జ‌గ‌న్ ఇస్తున్న పిలుపున‌కు స‌రైన స్పంద‌న లేదు. చీమ‌ల్లా శ్ర‌మించి పుట్ట‌ల్ని పెడితే, అందులోకి పాముల్లా జ‌గ‌న్‌తో పాటు స‌జ్జ‌ల భార్గ‌వ్‌లాంటి వారు చేరుకుంటున్నార‌నే విమ‌ర్శ.

అధికారంలో ఉన్న‌ప్పుడు ఆర్థికంగా, హార్థికంగా భ‌రోసా క‌ల్పించి వుంటే, ఇప్పుడు జ‌గ‌న్ చెప్ప‌క‌పోయినా వైసీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు సైనికుల్లా ప‌ని చేసేవారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇబ్బందులు ప‌డి, మ‌ళ్లీ ప్ర‌తిప‌క్షంలోకి రాగానే రాక్ష‌సుల‌తో యుద్ధం చేసేందుకు శ‌క్తి ఎక్క‌డి నుంచి వ‌స్తుందో జ‌గ‌న్ ఆలోచించారా?

గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో బాగా ప‌ని చేయాల‌ని జ‌గ‌న్ చెప్ప‌డం వ‌ర‌కూ బాగానే వుంది. మ‌రి వాళ్లంతా స‌మూహంగా ప‌నిచేయాలంటే వ‌న‌రులు స‌మ‌కూరుస్తారా? అబ్బే, ఆ మాట జ‌గ‌న్ నోటి నుంచి రానే రాదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు బాగా ప‌ని చేయ‌డానికి, గుర్తింపు పొంద‌డానికి ఒక అవ‌కాశం అంటూ జ‌గ‌న్ మ‌భ్య‌పెట్టే మాట‌లు చెబుతున్నారు. ఇప్పుడు బాగా ప‌ని చేస్తే, భ‌విష్య‌త్‌లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కిరీటాలు పెడ‌తాన‌నే చెబితే న‌మ్మే వాళ్లెంద‌రు? ఎందుకంటే అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ సొంత‌వాళ్ల విశ్వాసాన్ని కోల్పోయార‌న్న‌ది వాస్త‌వం.

ఇప్పుడు ఏ ప్రాతిప‌దిక‌న జ‌గ‌న్‌పై న‌మ్మ‌కంతో కూట‌మికి వ్య‌తిరేకంగా తెగించి పోరాడాలి? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వాల్సి వుంటుంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌, ఆయ‌న కోట‌రీ వ్య‌వ‌హార తీరు మిగిల్చిన చేదు జ్ఞాప‌కాలు… సొంత వాళ్ల‌ను ఇంకా వెంటాడుతూ వున్నాయి. చేదు జ్ఞాప‌కాల్ని దిగ‌మింగుకుని జ‌గ‌న్ కోసం పోరాటానికి సిద్ధం కావాలంటే, మామూలు విష‌యం కాదు. ముందుగా న‌మ్మ‌కం క‌లిగించేలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించాలి. అధికారం కోసం ఉత్తుత్తి ఆరాటం వుంటే స‌రిపోదు. త‌ప్పుల్ని ఒప్పుకుని, భ‌విష్య‌త్‌లో పున‌రావృతం కానివ్వ‌న‌ని హామీ ఇవ్వాలి. ఆ త‌ర్వాతే పోరాటం.

32 Replies to “నిన్ను న‌మ్మేదెట్టా జ‌గ‌న్‌?”

  1. దీనినే సూక్ష్మంగా…. క్షవరం అయితేనే కానీ వివరం బోధపడదు అంటారు!! కాకపోతే ఇక్కడ బోడిగుండు అయింది.. అదీ విషయం!!!!

    1. దమ్మీడీకి పనికి రానోనోడికి గోచిగాడు దోచిపెట్టాడు… వాడి ఆశ డబ్బు నుండి అధికారాం మీదకి మళ్ళింది… ఏవేవో చెప్పాడు… రాష్ట్రాన్ని నాకించి నాశనం చేసాడు… ఇంకా నీ లాంటి బేవార్స్ గాళ్ళు వాడిది పట్టుకొని చీకుతూనే వున్నారు… చీక్కుంటూ బతుక్కోరా పందుల్లోడా

  2. ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు కానీ!

    నాయకుడి గా ఉన్న వాడి కి కుల వ్యతిరేఖత ఉండకూడదు.. ఎందుకంటే సమాజంలో అందరికి అన్ని హక్కులు ఉంటాయి.

    నాకు బాగా గుర్తు రాజశేఖర్ రెడ్డి గారు రెండో చీర సీఎం అయినప్పుడు కమ్మ వారి మీద ఉన్నా అపోహ పోయింది అయనకి ఎందుకంటె 60% కమ్మ వాళ్ళు కాంగ్రెస్ కి వేసి YSR ని CM చేసారు కారణం TDP వెళ్లి TRS తో పొత్తు పెట్టుకోవటమే.

    ఎవరో అన్నట్లు మానవ సంబందాలు అన్నీ ఆర్థిక సంబాధాలే… అలాగే ఎన్ని కులాలు గా ఉన్నా కూడా సమూహిహం గా అందరు ధర్మాన్నే సమర్థిస్తారు ఏది మానవ జాతిలో ఉన్నా అద్వితీయమైన విషయం.

    ఇంకా టీడీపీ 2019 లో స్వయం తప్పుల కి జగన్ దెబ్బకి పార్టీ చచ్చిపోయింది అందరూ జగనే దిక్కు అనుకున్న టైమ్ లో

    జగన్ 2 పెద్ద తప్పులు చేసాడు ..1. లెక్క లేని తనం ప్రదర్శించి జనం దగ్గర నమ్మకన్నీ కోల్పోయాడు … 2. కులాల పేరుతో సమాజాన్ని చీలుద్దాం అని చూశాడు ఇది జనం దగ్గర క్షమించారని తప్పు అయింది..పార్టీ చనిపోయింది..ఇంకా టీడీపీ బతికిపోయింది

  3. ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు కానీ!

    నాయకుడి గా ఉన్న వాడి కి కుల వ్యతిరేఖత ఉండకూడదు.. ఎందుకంటే సమాజంలో అందరికి అన్ని హక్కులు ఉంటాయి.

    నాకు బాగా గుర్తు రాజశేఖర్ రెడ్డి గారు రెండో చీర సీఎం అయినప్పుడు కమ్మ వారి మీద ఉన్నా అపోహ పోయింది అయనకి ఎందుకంటె 60% కమ్మ వాళ్ళు కాంగ్రెస్ కి వేసి YSR ని CM చేసారు కారణం TDP వెళ్లి TRS తో పొత్తు పెట్టుకోవటమే.

    ఎవరో అన్నట్లు మానవ సంబందాలు అన్నీ ఆర్థిక సంబాధాలే… అలాగే ఎన్ని కులాలు గా ఉన్నా కూడా సమూహిహం గా అందరు ధర్మాన్నే సమర్థిస్తారు ఏది మానవ జాతిలో ఉన్నా అద్వితీయమైన విషయం.

    ఇంకా టీడీపీ 2019 లో స్వయం తప్పుల కి జగన్ దెబ్బకి పార్టీ చచ్చిపోయింది అందరూ జగనే దిక్కు అనుకున్న టైమ్ లో

    జగన్ 2 పెద్ద తప్పులు చేసాడు ..1. లెక్క లేని తనం ప్రదర్శించి జనం దగ్గర నమ్మకన్నీ కోల్పోయాడు … 2. కులాల పేరుతో సమాజాన్ని చీలుద్దాం అని చూశాడు ఇది జనం దగ్గర క్షమించారని తప్పు అయింది..పార్టీ చనిపోయింది..ఇంకా టీడీపీ బతికిపోయింది

  4. తిక్కలోడ! సామెత కూడా సరిగ్గా చెప్పడ్డం రాదా!

    కష్టపడి కార్యకర్తలు పార్టీ ( పుట్ట) నీ గెలిపిస్తే, గర్వ*పోతు, ధ*న దాహ పిశా*సి, హంత*కుడు అయిన ప్యాలస్ పులకేశి ( పాము) దాన్ని ఆక్రమించాడు. ఆ చీమలు.లాంటి కార్యకర్త లని కూడా తినేశాడు.

    ఇలా కదా చెప్పాల్సింది.

  5. కి కి కి.

    బస్తీ మే సవాల్..

    ప్యాలస్ పులకేశి గాడి జేబులో నుండి ఒక్క రూపాయి తీసి కార్య కర్త కి టి ఇప్పించమనూ,

    వాడి కబాబ్ కత్తిరించి ఇస్తా!

  6. సొంత తండ్రి, చిన తండ్రి నీ లేపేసినోదు,

    సొంత తల్లి, చెల్లి సేవలు వాడుకుని, వాళ్ళ ఆస్తులు కూడా కాజేసిన జె*ఫ్ఫా. గాడు.

    ఇంకా వాడు ది చీక*మని చెబుతున్నాఫ్ అంటే, ఇది విపరీతమైన కులగజ్జి మాత్రమే.

  7. ఇప్పటికీ కూడా ఇంకా వాడినే పట్టుకుని చీకుతు*న్నావ గ్రేట్ ఆంద్ర!

    మీ అవినా బావ లపక్ తపక్ యేమిట్యో !

  8. ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు కానీ! నాయకుడి గా ఉన్న వాడి కి కుల వ్యతిరేఖత ఉండకూడదు.. ఎందుకంటే సమాజంలో అందరికి అన్ని హక్కులు ఉంటాయి.

    అలాగే ఎన్ని కులాలు గా ఉన్నా కూడా సమూహిహం గా అందరు ధర్మాన్నే సమర్థిస్తారు ఏది మానవ జాతిలో ఉన్నా అద్వితీయమైన విషయం.

    ఇంకా టీడీపీ 2019 లో స్వయం తప్పుల కి జగన్ దెబ్బకి పార్టీ చచ్చిపోయింది అందరూ జగనే దిక్కు అనుకున్న టైమ్ లో

    జగన్ 2 పెద్ద తప్పులు చేసాడు ..1. లెక్క లేని తనం ప్రదర్శించి జనం దగ్గర నమ్మకన్నీ కోల్పోయాడు … 2. కులాల పేరుతో సమాజాన్ని చీలుద్దాం అని చూశాడు ఇది జనం దగ్గర క్షమించారని తప్పు అయింది..పార్టీ చనిపోయింది..ఇంకా టీడీపీ బతికిపోయింది

  9. ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు కానీ! నాయకుడి గా ఉన్న వాడి కి కుల వ్యతిరేఖత ఉండకూడదు.. ఎందుకంటే సమాజంలో అందరికి అన్ని హక్కులు ఉంటాయి.

    అలాగే ఎన్ని కులాలు గా ఉన్నా కూడా సమూహిహం గా అందరు ధర్మాన్నే సమర్థిస్తారు ఏది మానవ జాతిలో ఉన్నా అద్వితీయమైన విషయం.

    ఇంకా టీడీపీ 2019 లో స్వయం తప్పుల కి జగన్ దెబ్బకి పార్టీ చచ్చిపోయింది అందరూ జగనే దిక్కు అనుకున్న టైమ్ లో

    జగన్ 2 పెద్ద తప్పులు చేసాడు ..1. లెక్క లేని తనం ప్రదర్శించి జనం దగ్గర నమ్మకన్నీ కోల్పోయాడు …

    2. కులాల పేరుతో సమాజాన్ని చీలుద్దాం అని చూశాడు ఇది జనం దగ్గర క్షమించారని తప్పు అయింది..పార్టీ చనిపోయింది..ఇంకా టీడీపీ బతికిపోయింది

  10. నాయకుడి గా ఉన్న వాడి కి కుల వ్యతిరేఖత ఉండకూడదు.. ఎందుకంటే సమాజంలో అందరికి అన్ని హక్కులు ఉంటాయి.

  11. “బెంగుళూరు బంకర్” లో దాక్కుని, కేవలం కళ్ళుమూసుకుంటే చాలు 5 ఏళ్ళు అలా అలా గడిచి, చంద్రబాబు super six ఇవ్వలేదు అని ప్రచారం చేస్తే చాలు 175/175 కొట్టి, అధికారం లోకి వస్తాం ఇంతోటి దానికి నాయకులు అండ్ కార్యకర్తల గోంతెమ్మ కోర్కెలు తీరుస్తూ నెత్తి మీద కూసోపెట్టుకోవాలా “గుడ్డి ఆంధ్రా”??

    ఉంటే ఉండండి పొతేపోండి.. సింగల్ సింహానికి ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు

    జై జై పంగనామాల బంకర్ రెడ్డీ

  12. ఒరేయ్ పిచ్చిరెడ్డి నీ దృష్టిలో రాక్షసులు అంటే ఎవరు ఒళ్ళు దగ్గరి పెట్టుకొని రాయి

Comments are closed.