ష‌ర్మిల‌పై తేల్చుకోవాల్సింది రాహులే!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలపై ఇక తేల్చుకోవాల్సింది ఆ పార్టీ అగ్ర‌నేత రాహులే. త‌న రాజ‌కీయ పంథాపై ష‌ర్మిల చాలా క్లారిటీతో ఉన్నారు. త‌న అన్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఆమె తీవ్ర‌మైన అక్క‌సుతో ఊగిపోతున్నార‌ని,…

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిలపై ఇక తేల్చుకోవాల్సింది ఆ పార్టీ అగ్ర‌నేత రాహులే. త‌న రాజ‌కీయ పంథాపై ష‌ర్మిల చాలా క్లారిటీతో ఉన్నారు. త‌న అన్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఆమె తీవ్ర‌మైన అక్క‌సుతో ఊగిపోతున్నార‌ని, ష‌ర్మిల మాట‌లే చెబుతున్నాయి. అందుకే ష‌ర్మిల‌కు ఒక పార్టీ కావాలి. ఆ పార్టీ తాను ఏం మాట్లాడినా ప్ర‌శ్నించ‌కూడ‌దు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అయితేనే త‌న‌కు అన్ని విధాలా స‌రిపోతుంద‌ని ఆమె ప‌సిగ‌ట్టారు. జ‌గ‌న్‌పై ర‌గిలిపోతున్న ష‌ర్మిల మొద‌ట తెలంగాణ‌లో వైఎస్సార్‌టీపీ పేరుతో ప్ర‌యోగం చేశారు. అయితే తెలంగాణ స‌మాజం ముందు ష‌ర్మిల పిల్లిమొగ్గ‌లు ప‌నిచేయ‌లేదు. తెలంగాణ త‌న మెట్టినిల్లు అని, ఇక్కడే ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌న్నాన‌ని భారీ డైలాగ్‌లు కొట్టారు.

ఈడ పిల్ల‌, ఆడ‌పిల్ల అని ఏవేవో మాట్లాడారు. చివ‌రికి తెలంగాణ త‌న రాజ‌కీయ క్షేత్రం కాద‌ని గ్ర‌హించారు. అందుకే తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేయ‌లేదు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరి, ఏపీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వైఎస్ జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా న‌ష్టం చేయ‌డంలో ష‌ర్మిల త‌న వంతు పాత్ర‌ను విజ‌య‌వంతంగా పోషించారు. ఇక న‌ష్ట‌పోవ‌డానికి జ‌గ‌న్‌కు ఏమీ మిగ‌ల్లేదు.

అదేంటో గానీ, ష‌ర్మిల టాస్క్ ఇంకా పూర్తి కాన‌ట్టుంది. హ‌ర్యానా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల కార‌ణంగానే ఓడిపోయింద‌ని జ‌గ‌న్ ఆరోపిస్తే, స్వాగ‌తించాల్సిన ష‌ర్మిల‌, అబ్బే ఆయ‌న్నే త‌ప్పు ప‌ట్టింది. ఏపీకి, హ‌ర్యానాకు తేడా వుంద‌ని ఆమె అన్నారు. హ‌ర్యానాలో కాంగ్రెస్‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌త అబ‌ద్ధ‌మ‌ట‌. ఏపీలో మాత్రం నిజ‌మ‌ని ష‌ర్మిల చెప్ప‌డం ద్వారా, రాజ‌కీయాల కంటే వ్య‌క్తిగ‌త క‌క్ష‌లే ముఖ్య‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

ఇదే రీతిలో ష‌ర్మిల రాజ‌కీయ పంథా సాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇక జ‌న్మ‌లో కోలుకోలేదు. కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని కూడా తాక‌ట్టు పెట్టేందుకు కూడా ష‌ర్మిల వెనుకాడ‌ర‌ని ఆమె మాట తీరే చెబుతోంది. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు రావాల‌ని అధిష్టానం కోరుకుంటే, ఆమె నాయ‌క‌త్వంపై రాహుల్ పున‌రాలోచ‌న చేయాల్సి వుంటుంది.

5 Replies to “ష‌ర్మిల‌పై తేల్చుకోవాల్సింది రాహులే!”

  1. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలని కాపాడి వైకాపా ప్రయోజనాలని తాకట్టు పెట్టింది…. మరి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అదే చెయ్యాలి…. ఇందులో తప్పు ఏమి ఉంది…. అన్న ఎప్పుడూ లేనిదీ కాంగ్రెస్ మీద వలపు బాణాలు వేసినా హర్యానా కాంగ్రెస్ నించి ఎవ్వరు ఆ ట్వీట్ కి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు…..

Comments are closed.