ధ‌ర్మారెడ్డి అండ‌… కొండ‌పై బీఆర్ నాయుడి ఛానెల్ ద‌ర్శ‌నాల దందా!

తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే త‌న‌కు అపార‌మైన భ‌క్తి అని, ప్ర‌తి రెండు నెలల‌కు ఒక‌సారి కొండ‌కు వెళ్లేవాడిన‌ని టీటీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు మొద‌టి ప్రెస్‌మీట్‌లో గొప్ప‌లు చెప్పారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో…

తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే త‌న‌కు అపార‌మైన భ‌క్తి అని, ప్ర‌తి రెండు నెలల‌కు ఒక‌సారి కొండ‌కు వెళ్లేవాడిన‌ని టీటీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు మొద‌టి ప్రెస్‌మీట్‌లో గొప్ప‌లు చెప్పారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో తిరుమ‌ల‌లో అరాచ‌కాలు జ‌రిగాయని, శ్రీ‌వారి క్షేత్రం అప‌విత్ర‌మైంద‌ని, అందుకే కొండ‌కు వెళ్ల‌లేద‌ని బీఆర్ నాయుడు చెప్పారు.

ఈ కామెంట్స్‌తో తిరుమ‌ల శ్రీ‌వారిపై నాయుడికి భ‌క్తిశ్ర‌ద్ధ‌ల సంగ‌తేమో గానీ, సీఎం చంద్ర‌బాబుపై మాత్రం అపార‌మైన భ‌క్తి వుంద‌ని లోకానికి తెలిసిపోయింది. టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మితులైన బీఆర్ నాయుడు, క‌నీసం ఆ ప‌ద‌విపై గౌర‌వంతో అయినా రాజ‌కీయాలు మాట్లాడ‌కుండా వుంటే బాగుండేది. అయితే టీటీడీ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క ఆధ్యాత్మిక సంస్థ‌కు చైర్మ‌న్‌గా కూట‌మి స‌ర్కార్ నియ‌మించ‌డంతో త‌న‌ను తాను రాజ‌కీయంగా కంట్రోల్ చేసుకోలేక‌పోయారు.

మొద‌టి ప్రెస్‌మీట్‌తోనే బీఆర్ నాయుడు అభాసుపాల‌య్యారు. అయితే ఆయ‌న మాట్లాడిన దానికి, ఆచ‌ర‌ణ‌కు చాలా తేడా క‌నిపిస్తోంది. వైసీపీ హ‌యాంలో బీఆర్ నాయుడి ఛానెల్ టీవీ5 సిఫార్సుల‌కు టీటీడీ ఉన్న‌తాధికారి ఏవీ ధ‌ర్మారెడ్డి అత్య‌ధిక ద‌ర్శ‌నాలు ఇచ్చారు. నాయుడి మీడియా అడగ‌డ‌మే ఆల‌స్యం… ఎంత మందికైనా ద‌ర్శ‌నాలు ఇవ్వ‌డానికి శ్రీ‌మాన్ ధ‌ర్మారెడ్డి గారు ఎదురు చూస్తూ కూచునేవారు.

టీవీ5 ఛానెల్‌లో తాను కూడా భాగ‌స్వామిగా చెప్పుకునే సాంబ‌శివ‌రావు తిరుమ‌ల‌కు వ‌స్తే, ఆయ‌న‌తో పాటు వెంట ఉన్న 15 మందికి ప్రొటోకాల్ ద‌ర్శ‌నాన్ని క‌ల్పించింది వాస్త‌వం కాదా? ధ‌ర్మారెడ్డే స్వ‌యంగా వాళ్లంద‌రినీ వెంట‌బెట్టుకెళ్లి ద‌ర్శ‌నం చేయించ‌డం నిజం కాదంటారా? వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిత్యం ఎల్లో మీడియా అంటూ పోరాడుతుంటే, ధ‌ర్మారెడ్డి మాత్రం వారితో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగార‌ని తిరుమ‌ల‌లో ఏ మీడియా ప్ర‌తినిధిని అడిగినా చెబుతారు.

జ‌గ‌న్ శ‌త్రుత్వాల‌తో త‌న‌కేం సంబంధ‌మంటూ, వైసీపీ వ్య‌తిరేక మీడియాతో ధ‌ర్మారెడ్డి అంట‌కాగారు. టీవీ5తో పాటు ఇత‌ర టీడీపీ అనుబంధ మీడియాకు అడిగితే ప్రొటోకాల్ ద‌ర్శ‌నాన్ని ధ‌ర్మారెడ్డి ఎప్పుడూ నిరాక‌రించ‌లేదు. ఇదే ధ‌ర్మారెడ్డి మంత్రులు, వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల విష‌యంలో మాత్రం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

తిరుమ‌ల‌లో ఐదేళ్ల‌లో ఘోరాలు, నేరాలు జ‌రిగి వుంటే, త‌న ఛానెల్‌లో ఎన్నిసార్లు వ్య‌తిరేక వార్త‌లొచ్చాయో చూప‌గ‌ల‌రా? తిరుమ‌ల‌లో ధ‌ర్మారెడ్డి పాల‌న‌పై ఒక్క‌టంటే ఒక్క వ్య‌తిరేక క‌థ‌నాన్ని కూడా టీవీ5లో చేయ‌క‌పోవ‌డం వెనుక మ‌ర్మం ఏంటో బీఆర్ నాయుడు చెప్ప‌గ‌ల‌రా? తిరుమ‌ల అప‌విత్ర‌మైతే, మ‌రి త‌న మీడియా త‌ర‌పున ఎందుకు సిఫార్సు లేఖ‌లు పంపారో చెప్పాల్సిన బాధ్య‌త బీఆర్ నాయుడిపై వుంది.

అలాగే గ‌త ఐదేళ్ల‌లో తన ఛానెల్ త‌ర‌పున ఎన్ని సిఫార్సు లేఖ‌లు ఇచ్చారు? ఎంత మందికి ఎన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు తీసుకున్నారో నిగ్గు తేల్చితే, వాస్త‌వాలేంటో జ‌నానికి తెలుస్తుంది. ధ‌ర్మారెడ్డి అండ‌దండ‌ల‌తో బీఆర్ నాయుడి ఛానెల్ ద‌ర్శ‌నాల దందా సాగించింద‌నే ఆరోప‌ణ‌ల‌పై వాస్త‌వాలేంటో జ‌నానికి తెలియాలి. ఎటూ తానే టీటీడీ చైర్మ‌న్ అయిన నేప‌థ్యంలో వాటిని బ‌య‌ట పెట్ట‌డం పెద్ద స‌మ‌స్య కాదు. ఇప్పుడు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మెప్పుకోసం తిరుమ‌ల‌పై అవాకులు, చెవాకులు పేల‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మో బీఆర్ నాయుడు ఆలోచించుకోవాలి.

వైఎస్ జ‌గ‌న్‌పై కోపం వుంటే, రాజ‌కీయంగా ఆయ‌న‌తో తేల్చుకోవాలి. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై భ‌క్తి వుంటే, దాన్ని ప్ర‌ద‌ర్శించే మార్గం వేరే వుంటుంది. అంతేగానీ, తిరుమ‌లలో నేరాలు ఘోరాలు జ‌రిగాయని, అప‌విత్ర‌మైంద‌న‌డం స‌బ‌బు కాద‌ని భ‌క్తుల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

9 Replies to “ధ‌ర్మారెడ్డి అండ‌… కొండ‌పై బీఆర్ నాయుడి ఛానెల్ ద‌ర్శ‌నాల దందా!”

  1. పాపం BR నాయుడికి ఎదొ డ్రగ్స్ దందా తొ సంబందం ఉనట్టు సాక్షి, GA లొ రాసి నప్పుడె మీ ఏడుపు అర్ధం అయ్యింది GA?

    .

    బులుగు మీడియా ఈయనకి TTD పొస్ట్ రాకుండా ఎంత నీచంగా చెసి రాసిందొ అందరికి తెలిసిందె! చివరికి వీళ్ళ వెదింపులు బరించలెక అయన కొర్ట్ కి వెల్లాల్సి వచ్చింది. కొర్ట్ లొ మొట్టికాయలు పడినా ఇంకా మీకు సిగ్గు రాలెదా సన్నసుల్లరా??

  2. లాస్ట్ 5 ఇయర్స్ లో TV5 ద్వారా టీ.డీ/పీ సేవ చేసినందుకు ప్రతి ఫలం బాగానే సంపాదించాడు .

  3. అంటే.. మీ జగన్ రెడ్డి పెంచుకున్న రెడ్డి పాము.. మీకు నచ్చని చౌదరి గారికి వరాలిచ్చింది అంటున్నారా..?

    మీ బాధలు, మీ కష్టాలు, మీ ఏడుపులు చూస్తుంటే.. బహు ఆనందం గా ఉంది..

    రమణ గారిని సీజేఐ చేయకుండా చేయాలని మీ కష్టము చూసాం.. ఇప్పుడు మీ బతుకు ఇక్కడ దాకా వచ్చింది..

    మీరు బాగు పడాలని చూస్తే.. మీరు ఎదుగుతారు..

    ఇంకొకళ్ళని నాశనం చేయాలని చూస్తే.. మీరే నాశనం అవుతారు..

    ఎప్పటికి తెలుసుకొంటారో..

Comments are closed.