జేపీ అవకాశవాదిగా మారిపోయారా?

ఇప్పుడున్న రాజకీయ విశ్లేషకుల్లో లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ కు మంచి పేరు ఉంది. ఆయన విశ్లేషణలు నిష్పాక్షికంగా ఉంటాయని, స్పష్టమైన దృష్టికోణం ఉంటుందని, చెప్పే విషయంలో డెప్త్ ఉంటుందని ప్రజలు నమ్ముతుంటారు.…

ఇప్పుడున్న రాజకీయ విశ్లేషకుల్లో లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ కు మంచి పేరు ఉంది. ఆయన విశ్లేషణలు నిష్పాక్షికంగా ఉంటాయని, స్పష్టమైన దృష్టికోణం ఉంటుందని, చెప్పే విషయంలో డెప్త్ ఉంటుందని ప్రజలు నమ్ముతుంటారు. కానీ ఆయన కూడా రాజకీయ విశ్లేషణల్లో అవకాశవాదిగా మారిపోతున్నారా? ఏ ఎండకాగొడుగు పట్టే రకంగా.. ఏ రోటికాడ ఆ పాట పాడే రకంగా తయారవుతున్నారా? ఆయన కూడా ఎవ్వరు ప్రభుత్వంలో ఉంటే వారిని కీర్తించే విశ్లేషకుడిగా పరివర్తనం చెందారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి.

తాజాగా విజయవాడలో నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడును కీర్తించడానికి ఆయన ఉత్సాహపడ్డారు. అక్కడితో ఆగిఉన్నా.. ‘ఏదోలే కులాభిమానం’ అని అంతా సరిపెట్టుకునేవారు.. కానీ, జగన్మోహన్ రెడ్డి గత అయిదేళ్ల పాలన మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

2022 సెప్టెంబరులో విశాఖలో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ హాజరయ్యారు. ఆ సభలో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఆకాశానికెత్తేస్తూ జేపీ మాట్లాడిన మాటలు చూసి ఆయన అభిమానులే విస్తుపోయారు.

అప్పటికి జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ‘‘పేద ప్రజల సంక్షేమానికి ఖచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని, తెలుగురాష్ట్రాల్లో సమర్థంగా డబ్బు పంపిణీ చేస్తున్నారని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లంచాల అవసరం లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్న తీరు అద్భుతం అని అన్నారు. ఈ విషయంలో జర్మనీకంటె మెరుగైన విధానాలు మన వద్ద ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో మనం గర్వపడాలంటూ జగన్ సర్కారుకు కితాబులు ఇచ్చారు.
అదే జయప్రకాశ్ నారాయణ్.. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీపోయి.. చంద్రబాబునాయుడు పరిపాలన వచ్చింది. విజయవాడలో ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో తెలుసా..?

‘‘గత అయిదేళ్లూ ఏపీ తీవ్ర సంక్షోభంలో ఉంది. 9.64 లక్షల అప్పు ఉంది. వచ్చే ఆదాయంలో సగం వడ్డీలకే పోతోంది. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇంత అప్పులు లేవు. గత ప్రభుత్వం సంపదసృష్టిపై దృష్టిపెట్టకుండా.. బటన్లు నొక్కడంపైనే దృష్టిపెట్టారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం చంద్రబాబుకు మాత్రమే ఉంది.’’ ఇలా చెప్పుకుంటూ పోయారు.

రెండేళ్లలో మరీ ఇంత కాంట్రాస్టా? జయప్రకాశ్ నారాయణ్ లో మరీ ఇంత అవకాశవాది దాగి ఉన్నారా? రాజకీయాల్లో ఆయన కూడా అపరిచితుడు లాంటి వాడేనా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

24 Replies to “జేపీ అవకాశవాదిగా మారిపోయారా?”

  1. మిమ్మల్ని పొగిడితే ఉత్తముడు.. మిమ్మల్ని తెగిడితే అవకాశవాది..

    అయితే ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి..

    2024 ఎన్నికలకు మూడు నెలల ముందే .. జగన్ రెడ్డి సంక్షేమమే అతన్ని ఓడించబోతోంది.. అని క్లారిటీ గా చెప్పేవాడు..

    ఇతనికి తెలిసిన ఈ విషయం.. సీఎం సీట్లో కూర్చున్న మన జగన్ రెడ్డి కి ఎందుకు అనిపించలేదు..

    లేక.. జగన్ రెడ్డి కి ఓడిపోతున్నామన్న విషయం తెలిసే.. గూట్లో ఉన్న గులకరాయి ని బయటకు తీసి.. గోతిలో పడ్డాడా..?

  2. అప్పుడు జేపీ పొగిడినపుడు.. బట్టలు విప్పుకుని నృత్యం చేసారు… ఇప్పుడు కులం కార్డు తీశారు.. అందుకే 11 ఇచ్చారు…

  3. ‘‘గత అయిదేళ్లూ ఏపీ తీవ్ర సంక్షోభంలో ఉంది. 9.64 లక్షల అప్పు ఉంది. వచ్చే ఆదాయంలో సగం వడ్డీలకే పోతోంది. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇంత అప్పులు లేవు. గత ప్రభుత్వం సంపదసృష్టిపై దృష్టిపెట్టకుండా.. బటన్లు నొక్కడంపైనే దృష్టిపెట్టారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం చంద్రబాబుకు మాత్రమే ఉంది.’’ –> This is True

  4. JP సంగతి వదిలెయ్

    అ Psycho గురుంచి నువ్వెమనుకుంటున్నావొ రాయి రా సామి

    వాడొక మనిషి ..వాడిదొ పాలన

  5. JP సంగతి వదిలెయ్

    అ సైకొ గురుంచి నువ్వెమనుకుంటున్నావొ రాయి రా సామి

    వా..డొ..క మనిషి ..వా.డి..దొ పాలన

  6. He praised welfare schemes and criticized anti development agenda, he is right on both the counts. He just was tactful in timing those two statements, but not lier or opportunist.

  7. Sumaaru డబ్బాయి వేల కోట్ల పెట్టుబడులు తో స్టీల్ ఫ్యాక్టరీ ఫైనలైజ్ అయ్యింది వైజాగ్ లో కనీసం వార్త కూడా లేదూ

  8. జగన్ కి వతిరెకం గా మాట్లాదితె ఎవరినా అవకాశ వాదెకదా GA ద్రుస్టిలొ!

    జగన్ ఉన్న టైమె లొ కూడా JP చాలా clear గా చెప్పరు. వొట్ల కొసం సంగ్షెమం పెరుతొ పంచటం చాలా ఎక్కువ అవుతుంది అని. jagan ప్రభుతం అబిరుద్ది పూర్టిగా పక్కన పెట్తింది అని. ఒకసారి అయన పాత వీడియొలు చూసుకొ!

  9. Neeku ardam Ina kanattu natiste ela ga,

    Button nokkudu baga chesadani ayana appudu ippudu Annadu,

    Adi thappa inkemi cheyyaledu Jagananne Anni chotla ade cheppukunnadu

  10. మొదటి నుండి అవకాశవాదే. బాగా ముసలాడు అయ్యాడుగా, ఇంకా ఎందుకులే అని ముసుగు తీసేసాడు 😛🤣😂

  11. అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ గ్రేట్ ఆంధ్రా మాత్రం వైసిపి బాకా మాత్రమే ఊదుతుంది, అదీ నిబద్ధత అంటే…..

      1. అంటే మీకు ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటివి ఆదర్శమా?అవి పత్రికావిలువలు పాటిస్తున్నాయని నేనేమీ అనలేదే, వారు చే సే తప్పులవలన మీరు చేసేది ఒప్పు కాలేదు….

  12. అసలు ఇలాంటి కుహనా మేధావులే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు….తస్మాత్ జాగ్రత్త

Comments are closed.