ద‌రిద్రులంతా జ‌గ‌న్ చుట్టూనే!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చుట్టూ ద‌రిద్రులు ఎక్కువే. ఇలాంటి వాళ్ల వ‌ల్లే వైసీపీ అంటే.. త‌ట‌స్థుల్లో నెగెటివ్ అభిప్రాయం ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మైంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కొన్ని అసాంఘిక శ‌క్తులు జ‌గ‌న్ పేరు…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చుట్టూ ద‌రిద్రులు ఎక్కువే. ఇలాంటి వాళ్ల వ‌ల్లే వైసీపీ అంటే.. త‌ట‌స్థుల్లో నెగెటివ్ అభిప్రాయం ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మైంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కొన్ని అసాంఘిక శ‌క్తులు జ‌గ‌న్ పేరు చెప్పుకుంటూ, ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూశారు. వీళ్ల వికృత చేష్ట‌ల‌కు నాటి ప్ర‌భుత్వ పెద్ద‌లు మౌనం ద్వారా ప్రోత్స‌హించారు.

బోరుగ‌డ్డ అనిల్‌, అలాగే కొంద‌రు వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌మంటూ ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర అభ్యంత‌ర‌క‌ర పోస్టులు, కామెంట్స్ చేశారు. వీళ్ల‌ను ఎప్పుడూ వైసీపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు మంద‌లించిన పాపాన పోలేదు. టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల‌పై అవాకులు చెవాకులు పేలుతుండ‌డంతో వైసీపీ పెద్ద‌లు ఎంజాయ్ చేస్తూ గ‌డిపారు. ఎంత‌సేపూ ప్ర‌త్య‌ర్థుల్ని తిడుతున్నార‌ని ఆలోచించారే త‌ప్ప‌, అలాంటి వాళ్లతో ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు వ‌స్తుంద‌నే ఆలోచ‌న చేయ‌లేదు.

ఇలాంటివ‌న్నీ రాజ‌కీయంగా వైసీపీ మెడ‌కు చుట్టుకున్నాయి. ఎన్నిక‌ల్లో పార్టీని ఘోరంగా దెబ్బ‌తీశాయి. వైసీపీ హ‌యాంలో ప‌ద‌వుల పంప‌కం చూస్తే …ఛీ, ఇలాంటి వాళ్ల‌కు ఇచ్చారేంద‌బ్బా అనే అస‌హ్యం సొంత వాళ్ల‌లో కూడా క‌లిగిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. వైసీపీపై ప్ర‌జ‌ల్లో గౌర‌వం పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పేరుతో కొంద‌రు చేసిన అరాచ‌కాలే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

కొన్ని క‌మిష‌న్ల‌లో ఇలాంటి వాళ్ల‌ను స‌భ్యులుగా నియ‌మించార‌నే షాక్ నుంచి తేరుకోకుండానే, ఏకంగా చైర్మ‌న్లుగా కూడా నియ‌మించి …దటీజ్ జ‌గ‌న్ అనిపించారు. వైసీపీ గెలిస్తే… ఒర‌గ‌బెట్టేదేముందిలే అని, ఆ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కొంద‌రు చెలాయించిన ద‌ర్పం చూసి, చాలా మందిలో నిరుత్సాహం ఏర్ప‌డింది. అవ‌కాశ‌వాదులు మాత్రం చాలా తెలివిగా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు పేరుతో చేయ‌కూడ‌ని త‌ప్పుల్ని చేశారు.

అయ్యా జ‌గ‌న్‌, మీ పాల‌న‌లో మంచీచెడు ఇవీ అని చెప్పేవాళ్లే లేక‌పోయారు. జ‌గ‌న్ మ‌న‌స్త‌త్వం ఎలాంటిందంటే… త‌న‌తో బాగుండ‌డం వ‌ర‌కూ చూసుకుంటారు. వాళ్ల‌ను అంద‌లం ఎక్కిస్తారు. అంతే త‌ప్ప‌, తాను ప్రోత్స‌హిస్తున్న వాళ్ల‌కు స‌మాజంలో ఎలాంటి విలువ ఉన్న‌దో తెలుసుకోరు, ప‌ట్టించుకోరు. అందుకే ఎన్నిక‌ల్లో దారుణ ఫ‌లితాల్ని పొందాల్సి వ‌చ్చింది. చుట్టూ గొబ్బునాయాళ్ల‌ను పెట్టుకుని, ప్ర‌జ‌లు ఆద‌రించాలంటే ఎలా సాధ్య‌మ‌ని వైసీపీ సీనియ‌ర్ నేత ఒక‌రు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చేస్తున్న ప‌నుల్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే, వైసీపీ మూలాల్ని ఎలా దెబ్బ‌తీయాల‌ని అనుకుంటున్న‌దో అర్థ‌మ‌వుతుంది. వైసీపీ అంటే అసాంఘిక పార్టీ, దాంట్లో వున్న‌వాళ్లంతా దోపిడీదారులు, రౌడీలు, కామాంధులు అనే నెగెటివ్ అభిప్రాయాన్ని బ‌లంగా స‌మాజంలో క‌లిగించేందుకు కూట‌మి స‌ర్కార్ నిత్యం శ్ర‌మిస్తోంది. ఇందుకు ఈ మీడియా కూడా అవిశ్రాంతంగా శ్ర‌మిస్తోంది. జ‌గ‌న్ మాత్రం .. బెంగ‌ళూరు-తాడేప‌ల్లి చ‌క్క‌ర్లు కొట్టుకుంటూ, అప్పుడ‌ప్పుడు పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు. వైసీపీని నైతికంగా దెబ్బ‌కొట్టే ప్ర‌త్య‌ర్థుల ప్ర‌య‌త్నాల‌పై జ‌గ‌న్ శ్ర‌ద్ధ పెట్ట‌డం లేదు. కాల‌మే అన్నింటిని చూసుకుంటుంద‌నే ధోర‌ణి జ‌గ‌న్‌లో క‌నిపిస్తోంది.

26 Replies to “ద‌రిద్రులంతా జ‌గ‌న్ చుట్టూనే!”

  1. GA తన స్వాగతానికి వెళ్ళిపోయి ఆత్మవిరామర్శా, ఆత్మపరమర్శ ఒకేసారి చేసుకుంటున్నాడు.

  2. ఎందుకు GA పొద్దున్నే అందరితో తిట్టించుకుంటావ్ ? 
    అప్పుడు అంటే ఏమి తెలియడు కానుక వోట్లేసి గెలిచారు 5 సవంచరాలు సర్వ నాశనం చూసి
    అన్నీ తెలుసుకున్న కా కూడా ప్రజలని వెర్రి వెంగళప్పాయిలు అనుకుని రాస్తున్నావా ఏంటి?
  3. ఇప్పటికీ అదే తప్పు చేస్తున్నాడు, ఇంకా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నాడు, పెర్ని, రోజా, శామల, పంచ్ గాడు, ప్రదీప్, etc వంటి దరిద్రపు నోరు ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. ఇంకా అదే నమ్ముకుంటే ఈసారి సింహం నిజంగానే సింగిల్ అవక తప్పదు.

  4. 😂😂😂 ఏంటి GA…buthulu తిడుతున్నావ్….. ఐనా అప్పట్లో….బాబోయ్ PAWAN ను, బాబోరినీ buthulatho చెడుగుడు ఆడుకున్నారు…అని లెకి ఎలివేషన్ ఆర్టికల్స్ రాసింది నువ్వే కదా సుద్దపూస GA…

  5. తటస్థ ఓటర్లు అవసరమైన మేర సంక్షేమం అభివృద్ధి శాంతిభద్రతలు సామజిక న్యాయం చూస్తారు కానీ జగన్ గారి పాలనలో రోడ్స్ నిల్ పోలవరం కోల్డ్ స్టోరేజ్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పరిశ్రమలను ఇబ్బంది పెట్టడం ఏ పరిశ్రమదారుడు ఈయన గారి విధానాలు చూసి బయపడి రాకపోవడం రౌడీలను బూతులు తిట్టేవాళ్లను ప్రోత్సహించడం ప్రజల డబ్బు విచ్చల విడి గ విలాసాలకు ఖర్చు పెట్టడం పోలీస్ లను రౌడీ ల గ వాడుకోవడం అంతులేని అవినీతి ఇటువంటివానికి తిరిగి ఓట్లు వేస్తె రాష్ట్రము పోతుందని వాళ్లకు తెలుసు వైస్సార్ సానుభూతి సోనియా మోసం చేసిందనే అపోహ తో వేశారు ఈయనకు వచ్చిన ఓట్లు పథకాలు ఓట్లు మాత్రం ఇప్పుడు కూటమి పథకాలు బాగానే ఇస్తుంది ఇక ఈయనకు ఓట్లు రావడం గగనమే

Comments are closed.