మళ్లీ తెరపైకి తమన్ ‘శోభనం’ డైలాగ్

“బాలీవుడ్ మేకర్స్ మ్యూజిక్ ను చూసే విధానం నాకు నచ్చలేదు. ఒక్క పాట చేయమంటారు, ఒక్క రీల్ చేస్తే చాలు అంటారు. బాలీవుడ్ లో మ్యూజిక్ ఎలా ఉంటుందంటే.. పెళ్లి ఒకడితో, ఫస్ట్ నైట్…

“బాలీవుడ్ మేకర్స్ మ్యూజిక్ ను చూసే విధానం నాకు నచ్చలేదు. ఒక్క పాట చేయమంటారు, ఒక్క రీల్ చేస్తే చాలు అంటారు. బాలీవుడ్ లో మ్యూజిక్ ఎలా ఉంటుందంటే.. పెళ్లి ఒకడితో, ఫస్ట్ నైట్ మరొకడితో అన్నట్టు ఉంటుంది. ఒక సినిమాకు ఆరుగురు మ్యూజిక్ ఎలా చేస్తారో నాకు అర్థంకావడం లేదు. ఒక కథను ఆరుగురు సంగీత దర్శకులు ఎలా కంటిన్యూ చేస్తారో తెలియడం లేదు. ఇవన్నీ పక్కనపెడితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే వాడు ఎవడో చేస్తాడు. అలాంటప్పుడు మనం మనసుపెట్టి చేయలేం కదా.”

దాదాపు మూడేళ్ల కిందటం తమన్ స్వయంగా ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ఇప్పుడీ క్లిప్ ను కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడే ఎందుకు వైరల్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే.

పుష్ప-2 సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ ను పాక్షికంగా తప్పించారు. కొంతభాగం రీ-రికార్డింగ్ వర్క్ కోసం తమన్ ను తీసుకున్నారు. అతడితో పాటు, మరో ఇద్దర్ని కూడా ప్రాజెక్టులోకి లాక్కొచ్చారు. మొత్తానికి దేవిశ్రీని బయటకు పంపించారు.

ఈ మార్పుపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్, ఇప్పుడు తనే అలాంటి పనికి ఒప్పుకోవడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి తమన్ కు ఇలాంటివి కొత్తేంకాదు. గతంలో ప్రభాస్ సినిమాకు కూడా ఇలానే ఆఖరి నిమిషంలో సీన్ లోకి వచ్చి వర్క్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ సినిమాకు అన్నీతానే అన్నట్టు దర్శకుడితో కలిసి ప్రచారం కూడా చేశాడు. ప్రమోషనల్ టూర్లు కూడా చేశాడు.

ఇప్పుడు పుష్ప-2ను కూడా తమన్ అలానే ఆక్రమించుకుంటాడంటున్నారు కొంతమంది. ఓ సినిమాకు అరకొరగా సంగీతం అందించడం తనకు నచ్చదని, ఏ ప్రాజెక్టుకైనా పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని చెప్పిన తమన్, ఇప్పుడిలా పుష్ప-2లోకి ఎంటరయ్యాడంటున్నారు కొంతమంది.

పుష్ప-2 విడుదలకు సమయం తక్కువగా ఉంది. పట్టుమని నెల రోజులు కూడా టైమ్ లేదు. అటు ఐటెం సాంగ్ షూటింగ్ నడుస్తోంది. ఇటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో పడింది. డిసెంబర్ 5 సినిమా రిలీజ్.

4 Replies to “మళ్లీ తెరపైకి తమన్ ‘శోభనం’ డైలాగ్”

Comments are closed.