వ్యూహంలో ఇరుక్కున్న దర్శకుడు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసు కేసులు, కోర్టు కేసులు కొత్త కాదు. ఇప్పుడీ దర్శకుడిపై మరో కేసు నమోదైంది. కాకపోతే ఇది కాస్త ఆసక్తికరమైన కేసు. Advertisement గతంలో వ్యూహం అనే సినిమా…

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసు కేసులు, కోర్టు కేసులు కొత్త కాదు. ఇప్పుడీ దర్శకుడిపై మరో కేసు నమోదైంది. కాకపోతే ఇది కాస్త ఆసక్తికరమైన కేసు.

గతంలో వ్యూహం అనే సినిమా తీశాడు వర్మ. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాల్ని కించపరిచే విధంగా ఆర్జీవీ కామెంట్స్ చేశాడనేది కేసు. ఆ మేరకు వర్మ పెట్టిన పోస్టుల స్క్రీన్ షాట్స్ తో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఐటీ చట్టం కింద వర్మపై కేసు నమోదు చేశారు. ఇదే చట్టం కింద ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా వ్యక్తుల్ని అరెస్ట్ చేసి, మరికొందరికి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రామ్ గోపాల్ వర్మ కూడా చేరారు.

ఏ చిత్రానికి సంబంధించి వర్మపై ఇప్పుడు కేసు నమోదైందో, అదే చిత్రం విడుదలను అడ్డుకోవాలని గతంలో నారా లోకేష్ ప్రయత్నించారు. వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కోరుతూ, ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

అప్పట్లో హైకోర్టులో లోకేష్ నెగ్గలేకపోయారు. సినిమా రిలీజైంది. ఇప్పుడు అదే చిత్రానికి సంబంధించి వర్మపై కేసు నమోదైంది. వైఎస్ఆర్ మరణించిన రోజు నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎదిగిన క్షణం వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో వ్యూహం చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ.

14 Replies to “వ్యూహంలో ఇరుక్కున్న దర్శకుడు”

  1. ఎప్పడు వచ్చిందో ఎప్పడు పొయ్యింది తెలియని వూరు, పేరు లేని సినిమాని ఇప్పుడు అందరికీ తెలియచెప్పడం తప్ప ఆర్జీవీ నీ కెలికి సాధించేదిఏముంది

  2. ఈయన గురించి ఈయన గొప్పలు చెప్పుకొవటమె కాని, ఒక్కసారి కూడా ఇతను బలహీనుడి వైపు నుంచొని బలవంతుడి మీద పొరాడం నెను చూడలెదు!

    .

    నెను ముంబై వెళ్ళి ganster ల మీదె సినిమా తెసాను అని గొప్పలు చెప్పుకుంటాదు. కాని వాల్లనే ఆ సినిమాలొ హెరొలు గా చూపిస్టాడు!

    నాకు తెలిసి అత్యంత పిరివాడు ఈ జీవి!

  3. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది వీడికీ ఒక రోజు వస్తుంది అనుకున్న రానే వచ్చింది ఇక కాళ్ళ కింద నరాలు తెగెదాకా మింగడమే తరువాయి అలాగే ఈ గ్రేటాంద్రా గాడికి ఒక రాసే ఉంటుంది

Comments are closed.