చేస్తామ‌న్న‌వి చేయ‌క‌, చేయాల‌నుకున్న‌వి చేస్తున్న కూట‌మి!

అధికారం ద‌క్కింది తెలుగు త‌మ్ముళ్లు జేబులు నింప‌డానికి, ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుల‌ను రాబ‌ట్టుకోవ‌డానికి, వ‌చ్చే ఎన్నిక‌ల ఖ‌ర్చుకు జ‌మ చేసుకోవ‌డానికి

తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి వ‌స్తే త‌ను ఏం చేయాల‌నుకున్న‌దో అవ‌న్నీ చేస్తోంది! అయితే త‌మ చేతికి అధికారం ద‌క్కితే చేస్తామ‌న్న వాటిని ప‌క్క‌న పెట్టి తెలుగుదేశం- జ‌న‌సేన కూట‌మి తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఏమేం చేయాల‌ని మ‌న‌సులో అనుకున్న‌దో అవ‌న్నీ చేస్తూ ఉంది! క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల దోపిడీ ఒక రేంజ్ లో ఉంది! అధికారంలోకి రావ‌డానికి ఖ‌ర్చు పెట్టాం కాబ‌ట్టి.. అందుకు క‌నీసం రెండు మూడు రెట్లైనా సంపాదించుకోకుంటే ఎలా? అన్న‌ట్టుగా ఎమ్మెల్యేల వ్య‌వ‌హారాలు సాగుతూ ఉన్నాయి.

అధికారంలోకి రాగానే తాము అధికారంలోకి వ‌చ్చాం కాబట్టి చెల్లించాల్సిన క‌ప్పాలు చెల్లించాల‌ని కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ర‌క‌ర‌కాల వ్యాపారాల‌ను చేసుకునే వారితో వ‌సూళ్ల‌ను సాగించుకున్నారు. ఏపీలో ఎమ్మెల్యేల ఆగ్ర‌హానికి గురి కాకుండా వాళ్ల‌కు వీలైనంత చ‌దింపులు చదివించేసుకోవ‌డ‌మే చాలా మంచిద‌నే ప‌ద్ధ‌తి పాత‌దే! 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఆ త‌ర్వాత 2019లో అధికారంలో వ‌చ్చిన‌ప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు మ‌ళ్లీ కూట‌మి ఎమ్మెల్యేల వంతు! మార్పు ఏమీ లేదు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విప‌రీతంగా దోపిడీలు చేసేశార‌ని తెలుగుదేశం సానుభూతి ప‌రులు, తెలుగుత‌మ్ముళ్లు, తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్య‌ర్థులు 2019 నుంచి తెగ బాధ‌ప‌డిపోయారు. అయితే ఇప్పుడు అవ‌కాశం ఇటు వ‌చ్చింది కాబ‌ట్టి.. వీరి వ్య‌వ‌హారాలూ జోరుగానే సాగుతూ ఉన్నాయి. అదేమంటే ఎన్నిక‌లప్పుడు ఖ‌ర్చు పెడుతున్నాం క‌దా అంటూ ఒక ఎంపీ బాహాటంగానే వ్యాఖ్యానించారు! అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంతో పోలిస్తే.. ఇప్పుడు పూర్తిగా గేట్లు తెరిచిన‌ట్టుగా అయ్యింది!

ఏపీలో రానురానూ ప‌రిస్థితి పూర్తిగా రాజ‌కీయ క‌నుస‌న్న‌ల్లో సాగుతూ ఉంది. అదేదో సినిమాలో విల‌న్ అంటాడు, వైజాగ్ లో నా అనుమ‌తి లేకుండా మ‌హా అంటే బీచ్ లో బొరుగులు అమ్ముకోవ‌చ్చు అంతే త‌ప్ప త‌న క‌నుస‌న్న‌ల నుంచి జారి ఏదీ జ‌ర‌గ‌దు అని! ఇప్పుడు ఏపీ రాజ‌కీయం కూడా అలానే సాగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో ఎమ్మెల్యేలే అనుకుంటే, తెలుగుదేశం హ‌యాంలో ప‌చ్చ‌చొక్కా వేసిన ప్ర‌తివాడూ ఎమ్మెల్యేనే! ఎవరి స్థాయికి వారి వ్య‌వహారాలు సాగిస్తూ ఉన్నారు. పైర‌వీలు, సంక్షేమ ప‌థ‌కాల అర్హ‌త‌లు ఒక స్థాయి క్యాడ‌ర్ కు మంచి సొమ్ము చేసుకునే అవ‌కాశంగా మారాయి. రెండో కేట‌గిరి మ‌ద్యం, ఇసుక దందాలు.. వీరి స్థాయి కొంచెం ఎక్కువ‌!

పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో ఎక్క‌డ చూసినా ఎమ్మార్పీ వైన్సే క‌నిపిస్తాయి. ఎమ్మార్పీ వ్యాపార‌మే అక్క‌డ జ‌రుగుతుంది. అయితే ఏపీలో ఎమ్మార్పీ ఊసు లేదు! ప్ర‌తి క్వార్టర్ మీదా అధికారికంగానే ముప్పై రూపాయ‌లు ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటారు? అనే ప్ర‌శ్నే లేదు! మ‌ద్యం విష‌యంలో జ‌గ‌న్ అనుస‌రించిన విధానం వ‌ల్ల‌.. ఎక్కువ తీసుకున్నా ఫ‌ర్వాలేదు అనే ప‌రిస్థితి క్రియేట్ కావ‌డం ఇక్క‌డ దుర‌దృష్ట‌క‌రం! అయితే జ‌గ‌న్ అనుస‌రించిన విధానం వ‌ల్ల తెలుగుదేశం వ‌సూళ్లు న్యాయం అయిపోవు! ఒక్కో క్వార్ట‌ర్ కు ముప్పై రూపాయ‌లు అంటే, ప్ర‌తి ఫుల్ బాటిల్ మీదా 120 రూపాయ‌ల వ‌రకూ అన‌ధికార వ‌సూళ్లే సాగుతూ ఉన్నాయి.

అయితే ఇది ఇంత‌టితో ఆగుతుందా.. రానురానూ ప‌తాక స్థాయికి చేరుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం! అయితే మ‌ద్యం వ్య‌వహారాలు ఇక్క‌డితో ఆగ‌వ‌ని మాత్రం స్ప‌ష్టం అవతూ ఉంది. బెల్ట్ షాపుల‌కు బోర్లా తెరిచిన‌ట్టుగా అయ్యింది. గ్రామ‌గ్రామానా ఇక మ‌ద్యం ఏరులై పారే ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. దీని వ‌ల్ల ఒక సెక్టార్ ప్ర‌జ‌ల ఇళ్లు గుల్ల అయ్యే అవ‌కాశాలు కూడా పుష్క‌లం! దీని ప‌రిణామాలు రానున్న రెండు మూడేళ్ల‌లో క‌నిపించే అవ‌కాశం ఉంది. తెలుగుదేశం కూట‌మి చూసుకుంటున్న‌ద‌ల్లా త‌మ జేబుల్లోకి డ‌బ్బులు వ‌చ్చే మార్గాల‌నే!

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో రోడ్ల గురించి చాలా రాజ‌కీయ‌మే న‌డిపింది తెలుగుదేశం- జ‌న‌సేన‌! అయితే అధికారంలోకి వ‌చ్చి అటుఇటుగా ఐదు నెల‌లు అవుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎక్క‌డా ఒక‌ప‌ర్లాంగు రోడ్లు వేయ‌లేదు! క‌నీసం గుంత‌లు కూడా పూడ్చ‌డం లేదు! 2014 నుంచి 2019ల మ‌ధ్య‌న తెలుగుదేశం ప్ర‌భుత్వ‌మే అధికారంలో ఉండింది, అప్పుడు రోడ్లు స‌వ్యంగా వేచి ఉంటే 2019 నుంచి 2024ల నాటికి అవి అంత దారుణంగా త‌యార‌య్యేవేమీ కావు.

అయితే రాజ‌కీయం మాత్రం కూట‌మి బాగానే చేసింది. మ‌రి అధికారం ద‌క్కాకా రోడ్ల విష‌యంలో ఏమైనా చ‌ర్య‌లున్నాయా అంటే ఇంకా మాట మాత్రం కూడా రావ‌డం లేదు! మాట‌లు మొద‌లైతే ఆ త‌ర్వాత క‌ద‌లిక‌లు రావాలి! అయితే మాట‌లు కూడా లేవు. అమ‌రావ‌తి విష‌యంలో అయితే మాట‌లైనా చెబుతూ ఉన్నారు, అయితే రాష్ట్రంలో ఎక్క‌డా రోడ్ల రిపేర్ల విష‌యంలో ఊసు లేదు! రోడ్ల విష‌యంలో అంత రాజ‌కీయం చేసి,ఇప్పుడు కిక్కురుమ‌న‌క‌పోవ‌డాన్ని కూడా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు!

సూప‌ర్ సిక్స్ సంగ‌తి స‌రేస‌రి! వృద్ధాప్య పెన్ష‌న్లను ప‌క్క‌న పెడితే, మిగ‌తా వాటి ఊసు లేదు. దీపావ‌ళి నుంచి మూడు గ్యాస్ సిలెండ‌ర్లు అని ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు అది కూడా అమ‌లు విష‌యంలో ప్ర‌శ్నార్థ‌కంగానే మారుతూ ఉంది. ఒక‌వైపు అర్హ‌త పేరుతో చాలామందిని ప‌క్క‌న పెట్టేశారు. ఏ ఆఫ‌ర్ విష‌యంలో అయినా కండీష‌న్స్ అప్లై అనేది చిన్న‌గా రాసిన‌ట్టుగా తెలుగుదేశం హామీల విష‌యంలో కూడా అలాంటి కండీష‌న్లే అమ‌ల‌వుతూ ఉన్నాయి. కండీష‌న్స్ అప్లై కింద చాలా మందిని అన‌ర్హులుగా తేల్చేశారు. మ‌రి గ్యాస్ కంపెనీల‌కు ప్ర‌భుత్వ‌మే డ‌బ్బు క‌ట్టి పేద‌ల‌కు ఉచిత సిలెండ‌ర్లు ఇస్తుందా అంటే అది కూడా లేదట‌! ప్ర‌జ‌లు త‌మ డ‌బ్బుతో గ్యాస్ సిలెండ‌ర్ కొనాల‌ట‌, స‌బ్సిడీ కింద ఆ డ‌బ్బును వారి ఖాతాల్లోకి జ‌మ చేస్తార‌ట‌! ఈ మాట విన్నాకా ఈ ప‌థ‌కం విష‌యంలోనూ ప్ర‌జ‌ల‌కు క్లారిటీ వ‌చ్చింది. ఇదీ పోయిన‌ట్టే అని అనుకోవాల్సి వ‌స్తోంది.

ఎప్పుడు గ్యాస్ బుక్ చేసుకుంటారో, అదెప్పుడు డెలివ‌రీ అవుతుందో, ఆ డ‌బ్బులు ఎప్పుడు వారి ఖాతాల్లోకి ప‌డుతుందో.. ఇదంతా గంద‌ర‌గోళంగా మారుతుంది. ఈ గజిబిజిలో ఈ కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించేసుకోవ‌చ్చు. ఆ డ‌బ్బులు పడే వాడికీ అర్థం కాదు, ప‌డ‌నివాడికీ అర్థం కాదు. వెనుక‌టికి గ్యాస్ ధ‌ర‌ల‌ను అమాంతం పెంచిన‌ప్పుడు మోడీ కూడా ఇదే వ్యూహాన్ని అనుస‌రించారు.

ప్ర‌భుత్వ‌మే గ్యాస్ కంపెనీల‌కు క‌ట్టే స‌బ్సిడీ మొత్తాల‌ను ఆ కంపెనీల‌కు కాకుండా ప్ర‌జ‌ల ఖాతాల్లోకి వేస్తామంటూ మొద‌ట ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. 2016లో అలాంటి ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. గ్యాస్ ధ‌ర అమాంతం పెరిగింది. అర్హులు అంటూ స‌గం మందిని ప‌క్క‌న పెట్టారు. మిగ‌తా వారికి ఒక ఏడాది వేశారు. రెండో ఏడాది నుంచి కొంద‌రి అర్హుల ఖాతాల్లోకి కూడా వేయ‌డం మానేశారు! ఓపికున్న వాళ్లు తిరిగారు, అదే స‌మ‌యంలో గివ్ ఇట్ అప్ అంటూ మ‌రో మాట చెప్పారు! మీరే వ‌దులుకోండి అని ప్ర‌క‌టించారు. అలా వ‌దులుకున్నా, వ‌దులుకోక‌పోయినా.. 2019 నాటికే గ్యాస్ స‌బ్సిడీని పూర్తిగా ఎత్తేశారు!

ఒక మాట మాత్ర‌పు ప్ర‌క‌ట‌న కూడా లేకుండా ప్ర‌జ‌ల ఖాతాల్లోకి వేస్తామ‌న్న డ‌బ్బును వేయ‌లేదు! దీంతో యూపీఏ హ‌యాంతో పోలిస్తే గ్యాస్ ధ‌ర ఏకంగా మూడు వంద‌ల రూపాయ‌లు ఒకేసారి పెరిగింది. ఆ త‌ర్వాత పెట్రో ధ‌ర‌ల‌తో పాటు పెరిగే వ్య‌వ‌హారం వేరే! అలా దేశంలో అతిభారీ స‌బ్సిడీ ప‌థ‌కాన్ని మోడీ దిగ్విజ‌యంగా వ‌దిలించేసుకున్నారు! కార్పొరేట్ల‌కు అలాంటి స‌బ్సిడీలు త‌ప్ప సామాన్యుల‌కు కాద‌నే ప‌ద్ధ‌తిని ఆయ‌న అనుస‌రించుకుంటూ ప‌క్కా వ్యాపారిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చంద్ర‌బాబు చెబుతున్న మూడు ఉచిత గ్యాస్ సిలెండ‌ర్ల ప‌థకం ఇదే దారి ప‌ట్టే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇక ఆడ‌వాళ్ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, నిరుద్యోగ భృతి ల ఊసులేదు! అయినా లోకేష్ కు ఉద్యోగం దొరికాకా ఇక నిరుద్యోగ భృతి ఎవ‌రికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి?

ఇంకా తెలుగుదేశం పార్టీ మెనిఫెస్టోను చ‌దువుకుంటూ పోతే.. అమ‌లు అయిన ప‌థకాల ఊసు లేక‌పోగా, అమ‌లు కాని క‌థ‌లే విరివిగా క‌నిపిస్తాయి! మ‌రి ఇన్ని మాట త‌ప్పడాల‌కు ప‌రిష్కార మార్గం ఏమిటి అంటే.. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ బోలెడున్నాయి! ప్ర‌తి రెండు మూడు నెల‌ల‌కూ ఒక క‌దాన్ని క‌దుపుతున్నా.. కాలాన్ని ఇలా గ‌డిపేయ‌వ‌చ్చు. అధికారం ద‌క్కింది తెలుగు త‌మ్ముళ్లు జేబులు నింప‌డానికి, ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుల‌ను రాబ‌ట్టుకోవ‌డానికి, వ‌చ్చే ఎన్నిక‌ల ఖ‌ర్చుకు జ‌మ చేసుకోవ‌డానికి! అభివృద్ధి అంటే అమరావ‌తి అంటూ ఉంటే స‌రిపోతుంది! ఇంతే సంగ‌తులు చిత్త‌గించ‌వ‌లెను!

23 Replies to “చేస్తామ‌న్న‌వి చేయ‌క‌, చేయాల‌నుకున్న‌వి చేస్తున్న కూట‌మి!”

  1. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే.. అందులో తప్పేమి ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేసింది. సోషల్ మీడియా బాధితుల్లో జడ్జిలు కూడా ఉన్నారని హైకోర్టు గుర్తుచేసింది. జడ్జిలను కూడా బూతులు తిడుతూ పోస్టులు పెట్టారని తెలిపింది.

    హైకోర్టు ఇలా స్పందించడానికి ప్రత్యేక కారణం ఉంది. విజయబాబు అనే వ్యక్తి.. సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని హైకోర్టులో పిల్‌ వేశారు. ఇలా కేసులు పెట్టకుండా ఆపాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అందులో తప్పేముందని ప్రశ్నించడమే కాదు.. అలా కేసులు పెట్టొద్దని పోలీసులను ఆపలేమని తెలిపింది. వారు చట్టప్రకారం నడుచుకుంటున్నారని తెలిపింది.

  2. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారి పై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ మాజీ సమాచార కమిషనర్ విజయబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. అసభ్యకర పోస్టుల పెట్టినవారి పై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం గుర్తు చేసింది.

    సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంలో పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి గంపగుత్త ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పేసింది.పోలీసులు కట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి పై పోలీసులు చట్ట నిబంధనలకు అనుగుణంగా పోస్టులు పెడుతుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ పిల్ పై తగిన ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది.

    Where is this news GA????

    1. ఇక్కడ విడ్డూరం ఏంటంటే విజయబాబు భాషా సంఘం చైర్మన్, ఆ భాషా ఆమోదయోగ్యమో కాదో చూసుకోకపోవటం..

      (దివంగత వంగవీటి రాధ సమకాలీకుడిని అని చెప్పుకుంటాడు)

  3. Begger to billionaire చేతి నిండా పని దొరికింది…మాకు free లు వద్దు… మేమే tax కడతాం సంపాదించుకునే అవకాశం ఇచ్చారు…అది చాలు…ఇలాంటి బోకు sites దేశానికి నష్టం..అది చెప్పడానికే site చూడటం..

  4. Present situation in AP seems like “1975 Indira Gandhi Emergency ruling” on 40% of AP population who have voted YSRCP.

    Sri Modiji and courts has to look into the issue and bring back

    the normal situation in AP

  5. చెప్పినవన్నీ చేసాడు జగన్… జనాలు ఏమిచ్చారు.. ? చిప్ప… సో.. అవి చెయ్యాల్సిన అవసరం ఏముంది. ? అందుకే వాళ్ళు చెయ్యడం లేదు… నాకైతే తప్పు అనిపించడం లేదు.

  6. వచ్చి గట్టిగ సంవత్సత్రం కాలేదు అప్పుడే ఎలా చేస్తారు. ఖజానా కాళీ చేసి అప్పులు మిగిల్చిన గత ప్రభుత్వ బొక్కలు ఎలా పుడ్చాలో తెలుసు కోవాలి.. అయినా ఉచితలకి అలవాటు పడటం ఏంటి. ఏం చేస్తే మన ప్రాంతం బాగు పడుతుందో జనం ఆలోచించాలి..

Comments are closed.