వ‌ర్మ ద‌ర్జాగా…!

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్జాగా యూట్యూబ్, అలాగే ప్ర‌ధాన ఛానెల్స్‌కు వెళ్లి మ‌రీ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. వ‌ర్మ ఒక‌ట్రెండు రోజులు క‌నిపించ‌క‌పోయే స‌రికి భ‌య‌ప‌డి ప‌రార‌య్యాడ‌ని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేద‌ని…

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్జాగా యూట్యూబ్, అలాగే ప్ర‌ధాన ఛానెల్స్‌కు వెళ్లి మ‌రీ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. వ‌ర్మ ఒక‌ట్రెండు రోజులు క‌నిపించ‌క‌పోయే స‌రికి భ‌య‌ప‌డి ప‌రార‌య్యాడ‌ని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేద‌ని మూడు రోజులుగా ఆయ‌న ఇస్తున్న ఇంట‌ర్వ్యూలే నిద‌ర్శ‌నం.

పైగా ఇంట‌ర్వ్యూలు చేస్తున్న యాంక‌ర్ల‌ను ఎదురు ప్ర‌శ్నిస్తూ ఆయ‌న ర్యాగింగ్ చేస్తున్నారు. క‌ళ్లెదుటే వ‌ర్మ ద‌ర్జాగా ఇంట‌ర్వ్యూలు ఇస్తుంటే, ఆయ‌న భ‌య‌ప‌డి ప‌రార‌య్యాడ‌ని టీడీపీ నేత‌లు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావ‌డం లేదు. ప్ర‌భుత్వ ప‌రువు పోగొట్టేలా టీడీపీ నేత‌లు వ‌ర్మ‌పై విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

పోలీసుల‌కు వ‌ర్మ చెప్ప‌కుండానే స‌వాల్ విసురుతున్నారు. వ‌ర్మ ఒక‌ట్రెండుసార్లు పోలీసుల విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. వ‌ర్చువ‌ల్ విచారణ‌కైతే తన క్ల‌యింట్ రెడీ అని వ‌ర్మ త‌ర‌పు న్యాయ‌వాది ప్ర‌క‌టించారు. వ‌ర్మ‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప్ర‌భుత్వం ఉంది. అంత వ‌ర‌కూ ఓకే. అయితే ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డంలో పోలీసుల‌కు ఇచ్చిన చిక్కులేంటో అర్థం కావ‌డం లేదు.

అలాగే ఎప్పుడో తాను పెట్టిన పోస్టుల‌కు, ఇప్పుడు అస‌లైన వాళ్ల‌కు కాకుండా ఇత‌రుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌డం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని వ‌ర్మ లేవ‌నెత్తిన ప్ర‌శ్న విలువైంది. మొత్తానికి వ‌ర్మ కేంద్రంగా మీడియాలో విస్తృత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి ఆయ‌న అరెస్ట్ ఎన్న‌డో!

23 Replies to “వ‌ర్మ ద‌ర్జాగా…!”

    1. కొట్టటానికి వచ్చిన ప్రత్యార్థులతో, “మీకు దమ్ముంటే, మీరు మగాళ్ళైతే మా అన్నను కొట్టండి” అని చెప్పినట్లుంది ఈ ఆర్టికల్…😜😜😜

  1. యంకర్ ఈ పొస్టు మీరె పెట్టరా అని చూపిస్తె…. అబ్బె నాకు గుర్తులెదు అని చెపుతున్నాడు.

    ఈయనికి నిజంగా అంత దైర్యమె ఉంటె, పొస్ట్ లన్ని ఎందుకు డిలీట్ చెసుకొని ఇప్ప్డు నాకు తెలీదు నాకు గుర్తులెదు అని చెపుతున్నాడు! నిజమె, అవి నెనె పెట్టను అని దైర్యం గా చెప్ప వచ్చుగా! పొజులు తప్ప, నిజనికి అత్యంత పిరివాడు ఈ జీవి!

  2. ///వర్మ ని ఎట్టి పరిస్థితులలొ అర్రెస్ట్ చెయలి అనె పట్తుదలతొ ఉని ప్రభుత్వం!///

    .

    అబ్బొ!! పిచుక మీద భ్రమ్మస్త్రం అవసరం లెదు!!

    ఈ ప్రభుత్వం ఎవరి మీద దుందుకుగా వ్యవహరించలెదు! అలా చెయలి అనుకుంటె ఎందరొ లొపల ఉండెవారు. చట్టం పని చట్టానికి వదిలెసారు!

  3. ఒక వ్యక్తి మీద పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే అతను పోలీసులకి దొరక్కుండా తప్పించుకు తిరగడం చట్టాల ఉల్లంఘన కింద రాదా? అతను ఇంటర్వ్యూలు ఇచ్చిన టీవీ ఛానెళ్ల యాజమాన్యం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకరించాలి కదా ? లేకపోతే వాళ్ళు కూడా accomplices కింద వస్తారు కదా?

    ఏమో ఏమి జరుగుతోందో అర్ధం కావట్లేదు.

      1. ఈ కేసు నిలబడదు. Until అండ్ Unless డైరెక్ట్ victims case file చేసేవరకు. అది కూడా ఇప్పుడు పెడితే కుదరకపోవచ్చు. ఇదేమి PIL కూడా కాదు. రాజ ద్రోహం కూడా కాదు అప్పట్లో వారు అధికారం లో లేరు కాబట్టి.

  4. ఈ కేసులు ఏమీ చేయలేవని పెట్టిన వాళ్లకు తెలుసు ఈయనకు తెలుసు జనాలకు తెలుసు !! మొరిగే కుక్కల్ని అదిలిస్తాం చూడు అలా ..అంతే !!

    “తల్లిని కూతురిని కూడా పట్టించుకోను , నేను నాకోసం బతుకుతా, నేను స్వేచ్చా జీవిని ” అని డబ్బాలు కొడుతుంటారే , ఆ స్వేచ్చ నే కాస్త కోల్పోతారు అంతే!! అప్పనంగా వచ్చిన డబ్బు లాయర్లకు!! సమయాన్ని దాక్కొనేందుకు !! ఇష్టం వచ్చినప్పుడు కాకుండా తప్పని సరిగా ట్వీట్ లు ఇంటర్వూ లు ఇవ్వాల్సి రావటం!! అమ్మాయిల కాళ్ళు నాకే సమయాన్ని కోల్పోవటం !!అవసరం అయితే కోర్టుకు తిరగాల్సి రావటం !! అదే ఈయనకు పెద్ద శిక్ష !!

    ” పచ్చ ఫిర్యాదులు” అని ముందు ముందు తన కథే ఓ పిచ్చి సినిమా గా తీసినా తీస్తాడు !! తీయాలి తప్పదు తీయకపోతే నల్ల డబ్బిచ్చిన నీలి పార్టీ ఊరుకోదుగా !!!

  5. Andhra lo 1 crore case file avali manobavalu debba thinnay ani..apudu kani budhi raadhu e govt ki and police laki….palana cheyandra ante case lu vesukontu kuchunnaru …evm batch ina adhikaram ithe vundi ga…palana kada cheyali..

  6. బెయిల్ వచ్చిందిగా…కలుగులోనుండి బయటకు వచాడు. బెయిల్ ధైర్యం…అంతకు మించి ఏమి లేదు

  7. రామ్ గోపాల్ వర్మ గాడినిజ్ ని ఓ తెలంగాణ మంత్రి గారు రెండు రోజులు పాటు వీర ఉతుకుడు ఉతికించంచారు.

    అదే సమయంలో కే సు లు పడడంతో మెడికల్ టెస్ట్ లు చేయిస్తే ఆ ఉతుకుడు వీళ్ళ ఖాతాలో ఎక్కడ పడుతుందోనని అ రె స్ట్ చేయలేదు… నిన్న ప్రెస్ మీట్ లో గమనిస్తే మొఖం మీద దెబ్బలు ఇంకా కనిపిస్తున్నాయి.. వాచిపోయినట్లు!!

Comments are closed.