నాగబాబుపై ప్రేమతో కూడిన భయం!

పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తన అన్నను క్యాబినెట్ లోకి తీసుకొని తనకు తన అన్న నుంచి ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకున్నారని చెప్పుకోవచ్చు.

జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తున్నారని వార్తలు రావడంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఊరు వాడ తిరిగి కష్టపడిన తన అన్న నాగబాబుకు సరైన పదవి కట్టబెట్టి తన ప్రేమను చాటుకున్నాడని ఆనందపడిపోతున్నారు. మరొకవైపున నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారన్న వార్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ మాత్రం రుచించడం లేదు

సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు నాగబాబుని చెడుగుడు ఆడేస్తున్నారు. జబర్దస్త్ అనే షోలో కూర్చుని మహిళలపై కామెడీలు చేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతు, మానసిక రుగ్మతతో బాధపడుతున్న అలాంటి వాడికి మంత్రి పదవి ఇవ్వడం చాలా దారుణం అంటూ అనేక రకాల ఆరోపణలు గుప్పిస్తున్నారు.

దీని అంతటికి కారణం గతంలో ఒకసారి చంద్రబాబుతో విభేదించి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన సమయంలో నాగబాబు అప్పట్లో చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, లోకేష్ లపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ అసలు నాకు నందమూరి బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని చేసిన వ్యాఖ్యలు… మరొక సందర్భంలో మీ తండ్రిని వెన్నుపోటు పొడిచిన సమయంలో మీ బ్లడ్, మీ బ్రీడ్ ఏమైందంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు బాగా సర్క్యూలేట్ చేశారు. అప్పుడు నాగబాబు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలకు ఇప్పుడు అతడిని మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన పార్టీలో కూడా ఒక వర్గం నుంచి నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చిందని, పార్టీలో ఎంతో మంది నిస్వార్ధంగా పనిచేశారని, వారికి మంత్రి పదవి కట్టబెడితే పవన్ కళ్యాణ్ పై గౌరవం పెరిగేదని ఇలా అనేక విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. మరొకవైపున పవన్ కళ్యాణ్ మాత్రం చాలా తెలివిగా తన అన్నను క్యాబినెట్ లోకి తీసుకొని తనకు తన అన్న నుంచి ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకున్నారని చెప్పుకోవచ్చు.

నాగబాబు ఎప్పటి నుంచో రాజకీయంగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 2019లో జనసేన పార్టీ నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోవడం తిరిగి 2024 లో అయినా నిలబడి సత్తా చాటాలనుకుంటే, పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. కనీసం రాజ్యసభకు అయినా పంపించాలని కోరినా అది కూడా కుదరకుండా పోయింది.

దీనితో ఎక్కడ నాగబాబు తనకు జనసేన పార్టీలో అన్యాయం జరుగుతుందని తన అసహనాన్ని చూపిస్తాడో అన్న భయంతో ముందుగానే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో మిగిలిన ఒక్క మంత్రి పదవి ఇప్పించుకునేలా పావులు కదిపారు. ఇలా ఇవ్వడానికి కూడా ఒక కారణం, భయం కూడా ఉంది.

వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తన చెల్లిని పార్టీ కోసం వాడుకొని అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను పక్కన పెట్టడంతో సహించలేక తన అన్న వైయస్ జగన్ పై అలుపెరగని పోరాటం చేస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. వైయస్ జగన్ కనుక 2019 లో అధికారంలోకి వచ్చిన వెంటనే షర్మిలకు ఏదో ఒక పదవి కట్టబెడితే ఏ గోల ఉండేది కాదని, కానీ ఇప్పుడు జగన్ కు కంటిలో నలుసుగా తయారయ్యి ముప్పుతిప్పలు పెడుతున్న విషయం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం.

గతంలో ఒకటి, రెండు సందర్భాలలో పవన్ కళ్యాణ్ పై నాగబాబు ప్రేమ చూపిస్తూనే ఇండైరెక్ట్ గా విమర్శించిన విషయాలు మర్చిపోకూడదు. నాగబాబుపై ప్రేమతో కూడిన భయం, ఆ ప్రేమ భయం కంటే బలంగా ఉంది కాబట్టే తన అన్న నుంచి ఎలాంటి ముప్పు, ఎలాంటి ప్రతి దాడి ఎదురుకాక ముందే మంత్రి పదవి కట్టబెట్టి రాబోయే రోజులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్ చేసుకున్నాడని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మరొకవైపున తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియాలో నాగబాబుపై చేస్తున్న విమర్శలు రాబోయే రోజులలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్న పరిస్థితి కూడా నెలకొని ఉంది.

శ్రీకాంత్ రెడ్డి గుదిబండి

31 Replies to “నాగబాబుపై ప్రేమతో కూడిన భయం!”

  1. అస్సలు ఆగట్లేదు గ్రేట్ ఆంధ్ర కి.. ఏదో ఒకటి confirm అయ్యేవరకు నిద్ర పట్టదేమో .. ఇంతలోనే ఇన్ని ఆర్టికల్స్

  2. Asalu ardham Leni artical … Anni families,mana lagaey vuntai anukovadam ..ekkadinundi ..deniki mudi pedtunnaaro..kanisam neekannaa ardamautundhaa GA…ahh comparision enti …nagababu is strong candidate… Well educated..annitikantey.. party kosam tanu Anni vadulukunnaru…ippudu ayana adagakapoina ..ayanaki respectful ga .. padavi ivvali… Idi okka nagababu vishayamlo maatramey…kaadu .. party kosam kastapadina prathi okkaridhi..adi vaari hakku..

  3. అన్ని కుటుంబాలు జెగ్గులు కుటుంబం లాగ వీధికి ఎక్కి తిట్టుకుంటారు అనుకుంటే ఎట్లా….

  4. జీవితం మొత్తం హైదెరాబాదులోనే ఉండి! కేవలం 2019 ఎన్నికలకోసమే హైదరాబాద్ నుండి ఓటు హక్కు.. ఆంధ్ర కు తెచ్చుకుని ఇక్కడ తిరిగి.. 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోగానే.. Packup అయిపోయి! హైద్రాబాదుకే పరిమితమై.. అక్కడ నుండి ట్విట్టర్ రాజకీయాలు చేసుకుంటూ.. కేవలం ఎన్నికలకు మాత్రమే 2 నెలల ముందు ఆంధ్ర కు వచ్చి జీవితం మొత్తం తెలంగాణలోనే ఉండే.. నాగబాబు కు ఆంధ్ర రాష్ట్ర మంత్రి పదవా అది పప్పెష్ ను D0 N g@ దారిలో.. MLC చేసి మంత్రిని చేసినట్టు చెయ్యటమా ఇచ్చే వాడికి పుచ్చుకునే వాడికి ఉండాలి.. కాస్త.. S! గ్గు!?

    ఏం సంబంధం వీడికి ఆంధ్ర కి? ఇక్కడున్న నాయకులకు ఇవ్వకుండా.. వీడికెందుకు MLC పదవి? ఏం ఒరగబెట్టాడని దానితో పాటు ఏకంగా మంత్రి పదవి ? ఆంధ్ర దౌర్భాగ్యం!

  5. జనసేన పార్టీ కోసం…తిరిగి..మీటింగ్ లు పెట్టీ క్యాడర్ నీ స్మవనయం చేసిన పార్టీ సభ్యుడు కి పదవి ఇస్తే తప్పు ఏమి ఉంది…

  6. జబర్దస్త్ అనే షోలో కూర్చుని మహిళలపై కామెడీలు చేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతు, మానసిక రుగ్మతతో బాధపడుతున్న అలాంటి వాడికి మంత్రి పదవి ఇవ్వడం చాలా దారుణం అంటూ అనేక రకాల ఆరోపణలు గుప్పిస్తున్నారు

    గుద్దబండి శ్రీకాంతం!

    మరి రోజా మేడం కి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఈ నీతులు గుర్తుకి రాలేదా ?

    1. రోజా కి మంత్రి పదవి ఇవ్వనప్పటినుండి … రాజకీయాలలో క్రియాశీలకంగా MLA గా ఉంటూనే.. ప్రజలలో తిరుగుతూ.. ఆమె ఓ పక్క రాజకీయాలు మరో పక్క సినిమా కార్యక్రమాలు చేసుకుంది. వీడెక్కడున్నాడు ఆంధ్రాలో రాజకీయాలలో? ఎన్నికలలో తప్ప ఎప్పుడు కనపడడే? వీడికంటే గొప్ప కార్యకర్త యెవ్వడు భజన సేన లో లేరా?

  7. Ha ha ha ha Sreekanth do you think both sharmila, Jagan and Naaga babu, Pawan are same. What a comedy. Ni article lo ne undi 2024 elections lo naaga babu ki seat ivvakapoyina thamudine support chesthunnadu, Ni article lo em raasthunnavo nike telidu. Pullalu pettadaniki ready ga untaru

  8. Ha ha ha ha Sreekanth do you think both sharmila, Jagan and Naaga babu, Pawan are same. What a comedy. Ni article lo ne undi 2024 elections lo naaga babu ki seat ivvakapoyina thamudine support chesthunnadu, Ni article lo em raasthunnavo nike telidu.

  9. Ha ha ha ha Sreekanth do you think both sharmila, Jagan and Naaga babu, Pawan are same. What a comedy. Ni article lo ne undi 2024 elections lo naaga babu ki seat ivvakapoyina thamudine support chesthunnadu, Ni article lo em raasthunnavo nike telidu.

  10. ఒ రే య్. గ్యా స్ ల వా డ * శ్రీ కాం త్. * … నా గ బా బు మం త్రి. కా వా లం టే

    జ ల గ. నా లా. *. మ ర్డ ర్ చే యా లా. & దో పి డీ లు చే యా లా.

  11. నాగబాబు కి ఆరోగ్యం అంతంత మాత్రమే, ఆటను పవన్ ని ఎదిరించడం అనేది కల. అలానే కూటమి లో వుంటూ, పవన్ మాట కాదని బాబు ని ఎదో అంటాడని ఊహినఃకేద్మ నీ తెలివి తక్కువ తనం. నాగబాబు పవన్ కన్నా, చిరు కె ఎక్కువ వర్క్ చేసాడు. ఎదో ఎస్ మిస్టర్ హోదా లో రిటైర్ అవ్వాలి అంతే.

    కానీ నాగబాబు ఆంధ్ర లో సెటిల్ అయ్యి, తనకు ఇచ్చిన మంత్రి వర్గం మీద గ్రిప్ తెచ్చుకుని నిరూపించుకోవాలి, చూద్దాం ఏమి చేస్తాడో.

Comments are closed.