వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ కేడర్ తప్పు చేసి వుంటే, వాళ్లను చట్టబద్ధంగా అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు వుంది. అలాంటప్పుడు రాత్రి వేళ వెళ్లి, కనీసం నోటీసులు ఇవ్వకుండా, తామెవరో కూడా చెప్పకుండా కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లడం విమర్శలకు దారి తీస్తోంది.
మూడు రోజుల క్రితం గుంటూరుకు చెందిన ప్రేమ్‌కుమార్ అనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టును బలవంతంగా జీపులో తరలించారు. తీసుకెళ్లింది ఎవరో తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే గానీ, కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం తెలియలేదు.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ గుంటూరు తరహా ఘటనే పునరావృతం కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు యూనిఫామ్‌లో వైసీపీ కార్యకర్తలు కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధిత కుటుంబ సభ్యుల వద్దకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వెళ్లి ధైర్యం చెప్పారు. పోలీస్‌స్టేషన్ ఎదుట అప్పలరాజు నిరసనకు దిగారు. పోలీసులు, మాజీ మంత్రికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ కార్యకర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, వాళ్లను వెంటనే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
Mana Jagan Anna pane
Last 5 years lo arrest chesindi tdp valle kada raa
Y chi p tricks , everyone knows…
ఎట్టుకెళ్లి జెగ్గులు గాన్ని దె0గినట్టూ దె0గుతారా ఏందీ??
అర్రెస్ట్ అయిన ప్రేంకుమార్ ఎమి చెస్తె అర్రెస్ట్ చెసారొ కూడా చెప్పు!
TDP కండువా వెసుకొని, దారిన పొయె వారిని toll అంటూ ఆపి… డబ్బులు అడుగుతూ… అదెదొ గొప్పగా online లొ ఆ వీడియొ కూడా పెడితె ఎలా?
.
ఒక డాక్టర్ మాస్క్ అడిగితెనె… ఉద్యొగం నుంచి సస్పెండ్ చెసి… పిచ్చాస్పత్రిలొ పెట్టింది ఎవరొ గుర్తు చెసుకొ! నువ్వు వేదాలు వల్లిస్తె ఎలా?
ప్రేమ్ కుమార్ పచ్చకండువా వేసుకున్నాడు కదా మీ వాడు కాదు కదా మీకు ఎందుకు బాధ..
మీరు బాధ పడుతున్నారు అంటే తప్పు ఒప్పుకున్నేట్లే..