అన్నంత పని చేస్తున్న కవిత!

ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ఆరాధిస్తామని, కొత్త తెలంగాణ తల్లిని ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పింది.

గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అండ్ కేసీఆర్ కూతురు కవిత అన్నంత పని చేస్తోంది. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది. కొత్త తెలంగాణ తల్లికి సంబంధించి ఇచ్చిన జీవోను ధిక్కరిస్తామని, ఒక ఉద్యమంలా పాత తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా నెలకొల్పుతామని ప్రతిజ్ఞ చేసింది.

ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తామని అన్నది. కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి బలవంతంగా ప్రజలపై రుద్దాడని అన్నది. తెలంగాణ తల్లి రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడమే కాకుండా, ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలంటున్నాడని, లేకపోతే కేసులు పెడతామంటున్నాడని ఆగ్రహించింది.

రేవంత్ రెడ్డి ఎన్ని జీవోలు ఇచ్చినా ఉద్యమ స్ఫూర్తితో పాత తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా పెడతామని అన్నది. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పింది. వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తామని చెప్పింది. బీఆర్ఎస్, జాగృతి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పింది.

సరే …చేసినప్పుడు చూద్దాం అనుకున్నారు కొందరు. జైలు నుంచి వచ్చాక సెకండ్ ఇన్నింగ్స్ లో యాక్టివ్ గా ఉన్న కవిత మొన్న రేవంత్ రెడ్డికి సవాల్ విసిరింది. వెంటనే రంగంలోకి దిగిపోయింది. జగిత్యాలలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అక్కడ 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసింది.

అంటే …ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా ఆవిష్కరించడంలో తొలి అడుగు పడిందన్న మాట. కొత్త తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకపోవడం కవితను తీవ్రంగా కలవరపెడుతోంది. ఉద్యమ తెలంగాణ తల్లినే తాము ఆరాధిస్తామని, కొత్త తెలంగాణ తల్లిని ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పింది. జగిత్యాలలో గులాబీ పార్టీ కార్యకర్తలు “బతుకమ్మ తల్లి మాదిరా …కాంగ్రెస్ తల్లి మీదిరా” అని నినాదాలు చేశారు. దీనిబట్టి కొత్త తెలంగాణ తల్లిపట్ల ఎంత వ్యతిరేకతో ఉందో అర్ధమవుతోంది.

10 Replies to “అన్నంత పని చేస్తున్న కవిత!”

Comments are closed.