చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు ఇది మంచి ఉదాహరణ. కొన్ని విషయాల్లో.. ప్రభుత్వం ప్రతికూల నిర్ణయాలు తీసుకుంటే.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులలో అపనమ్మకం పెరిగి వెనక్కు వెళతారని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతారు. అది తనకు అనుకూలురైన వారి విషయంలో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అదే సమయంలో.. మరి కొన్ని విషయాల్లో ప్రభుత్వం ప్రతికూల నిర్ణయాలు తీసుకునేలా, పెట్టుబడులు పెడుతున్న వారిని బెదరగొట్టి వెనక్కు తరిమేసేలా ప్రజా ఉద్యమాలను వెనక నుంచి కీ ఇచ్చి నడిపిస్తారు. ఇది జగన్ అనుకూల సంస్థల విషయంలో అనే సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వివరాల్లోకి వెళితే.. అదానీ జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ఇచ్చారు అని విమర్శించడానికి మాత్రమే చంద్రబాబు ముందుకొస్తారు. అదే సమయంలో ఆ ఒప్పందాల వల్ల రాష్ట్రాని నష్టం అని కూడా అంటారు. పోనీ ఇప్పుడు అధికారంలో ఉన్నది తమరే కదా.. రాష్ట్రాన్ని కాపాడడానికి, ఖజానా మీద భారం తగ్గించడానికి మీరే ఆ ఒప్పందాలను రద్దు చేయవచ్చు కదా అని అడిగితే.. దానికి మాత్రం చంద్రబాబునాయుడు నీళ్లు నములుతారు. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే పెట్టుబడిదారులు వెనక్కు వెళతారు.. అని అంటారు.
తిరుపతిలో ప్రతిష్ఠాత్మకంగా ఓబెరాయ్ గ్రూప్ హోటల్ నిర్మించడానికి జగన్ గతంలో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఓ పోరాటం నడుస్తోంది. తిరుపతిలో తిరుమలకు వెళ్లే మార్గంలో నాన్ వెజ్ మరియు లిక్కర్ అందించే ఫైవ్ స్టార్ హోటల్ ఉండడానికి వీల్లేదని కుహనా వాదులు ఈ పోరాటం మరియు లీగల్ ఫైట్ చేస్తున్నారు.
తిరుమలలో వసతి గృహాలు తప్ప హోటళ్లు నిర్మించకూడదని ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చిందని, కాబట్టి తిరుమల కొండ పాదాల చెంత ఓబెరాయ్ హోటల్ కట్టడానికి వీల్లేదని హైకోర్టులో కేసులు నడుపుతున్నారు.
అయితే ఈ పోరాటాలన్నీ నాటకాలే అనే అభిప్రాయం పలువురిలో ఎంది. తిరుమల పాదాల చెంత.. అంటే.. తిరుపతి మొత్తం అంతే. తిరుపతిలో ఎక్కడా ఏ హోటలూ కట్టకూడదా అనేది పలువురి వాదన. తిరుమలలో హోటళ్లు కట్టకూడదనే నిబంధన చూపించి, తిరుపతిలో నిర్మాణాన్ని ఎలా వ్యతిరేకిస్తారని అడుగుతున్నారు. అయినా కుహనా భక్తులు, ఆధ్యాత్మవాదులు ఆ ముసుగులు తగిలించుకుని స్వప్రయోజనాలకోసం ఈ పోరాటాలు చేస్తున్నట్టుగాన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ హోటల్ కి ఏ పేరు పెట్టాలనుకొన్నారో కూడా సెలవియ్యండి
Tirumala pavitrata nu kapudukovali illanti hotels ki anumathi ivvakandi