ఆర్జీవీకి ఇచ్చిన నోటీసులు చెల్లుతాయా?

కేవలం ఇన్వాయిస్ ల మీదనే ఆధారపడి చెల్లింపు చేసేట్లయితే, ఫైబర్ నెట్ తరఫునుంచి వాటిని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉన్న ఏర్పాటు ఏమిటి?

దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద ఏపీ సర్కారు కక్షసాధింపుకు దిగుతోందా? ఏపీ ఫైబర్ నెట్ రూపంలో ఆయనకు తాజాగా పంపిన నోటీసులు చట్టం ముందు నిలబడతాయా? వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ ద్వారా ఫస్ట్ షో ప్లాట్ ఫారమ్ మీద ప్రదర్శించడాన్ని ఇప్పుడు రాజకీయంగా మారుస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం 1.14 కోట్ల రూపాయలు నిర్మాణ సంస్థకు చెల్లించగా, ఆ మొత్తానికి 12 శాతం వడ్డీ వేసి మరీ 15 రోజుల్లోగా చెల్లించాలనేది నోటీసుల సారాంశం.

గడువులోగా కట్టకపోతే జరిమానా కింది 18శాతం వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫైబర్ నెట్ వారు వర్మకు నోటీసులు ఇచ్చారు సరే.. ఇవి చట్టపరంగా చెల్లుతాయా? సోషల్ మీడియా పోస్టల విషయంలో కేసులకు లొంగకుండా బెయిలు తెచ్చుకున్న వర్మను మరింతగా బద్నాం చేయడానికి ఇదొక మార్గంగా చూస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా ఉంది.

పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారమే.. రెండు లక్షల చందాల వరకు ఏకకాల చెల్లింపు కింద రూ.2 కోట్లు ఇచ్చేలాగా ఒప్పందం కుదిరింది. అంతకంటే ఎక్కువ చందాలు వస్తే ప్రాఫిట్ షేరింగ్ 75-25 కింద చేసుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి వ్యూహం పార్ట్ 1కు 1,43,357 చందాలు, పార్ట్-2 కు 24,213 చందాలు వచ్చినట్గుగా నిర్మాణ సంస్థ ఆర్జీవీ ఆర్వీ ఇన్వాయిస్ లు సమర్పించారు. ఆ మేరకు వారికి రెండుభాగాలకు సంబంధించి 1,14.96,610 చెల్లించారు.
అయితే నిర్మాణ సంస్థ సమర్పించిన ఇన్వాయిస్ లు ఫ్యాబ్రికేటెడ్ అని, తప్పుడు ఇన్వాయిస్ లు అని ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు పెట్టింది. బీఎన్ఎస్ డేటా ప్రకారం పార్ట్ 1 ను 1845, పార్ట్2 కు 383 చందాలు వచ్చినట్టుగా చెబుతోంది.

ఇక్కడ కొన్ని సందేహాలు తేలడం లేదు. నిర్మాణ సంస్థ సమర్పించిన ఇన్వాయిస్ లు తప్పుడు ఇన్వాయిస్ లు అని అనడానికి ఫైబర్ నెట్ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? ఏ ప్రాతిపదికమీద వాటిని ఫ్యాబ్రికేటెడ్ అని అంటున్నారు. అసలు ఒప్పందంలో ఏముంది. ఇన్వాయిస్ ల ఆధారంగానే చెల్లింపులు జరగాలని ఉందా? లేదా, బీఎన్ఎస్ డేటా ఆధారంగా చెల్లింపులు జరుగుతాయని ఉందా? ఆ ఒప్పందంలో బీఎన్ఎస్ డేటా గురించిన ప్రస్తావన లేకపోతే గనుక.. అసలు ఈ నోటీసులు చట్టం ముందు నిలబడతాయా?

కేవలం ఇన్వాయిస్ ల మీదనే ఆధారపడి చెల్లింపు చేసేట్లయితే, ఫైబర్ నెట్ తరఫునుంచి వాటిని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉన్న ఏర్పాటు ఏమిటి? ఆ ఏర్పాటు బీఎన్ఎస్ డేటా మాత్రమే అనే సంగతి ఒప్పందంలో ఉన్నదా? ఒప్పందంలో బీఎన్ఎస్ డేటా ప్రస్తావన లేకపోతే గనుక.. ఇప్పుడు దాని ఆధారంగా మదింపుచేయడం కరక్టేనా? ఇవన్నీ కూడా సందేహాలే.

అలాగే.. ఫైబర్ నెట్ వారు దాదాపు 25 చిత్రాలకు సంబంధించి.. ఫస్ట్ షో ఒప్పందాలు చేసుకుంటే అవన్నీ సగం-సగం పంచుకునే ఒప్పందాలు మాత్రమేనని, ఆర్జీవీ ఆర్వీ సంస్థతో మాత్రం నిర్మాతలకు 75, ఫైబర్ నెట్ కు 25 శాతం దక్కేలాగా ఒప్పందం చేసుకున్నారని తప్పుపడుతున్నారు. ఇది కూడా వర్మకు గత ప్రభుత్వం దోచిపెట్టడానికి ఎంచుకున్న మార్గం అనేది వారి ఆరోపణ. ఇది చట్టం ముందు నిలబడే విషయం కానే కాదు.

ఎందుకంటే.. తన ప్రోడక్ట్ ను నిర్మాతం ఫిఫ్టీ-ఫిఫ్టీకి ఇవ్వడానికి ఇష్టపడనప్పుడు.. మరో దామాషాలో ఒప్పందం చేసుకోవడం కొత్త సంగతి కాదు. ఆమెజాన్, నెట్ ఫ్లిక్స్ తదితర ఏ ప్లాట్ ఫారంలు అయినా.. అన్ని సినిమాలకు ఒకటే దామాషాలో ఒప్పందాలు చేసుకోవాలనే రూలేం లేదు. సినిమా, నిర్మాతలు, దర్శకుడు వారి బ్రాండ్ వేల్యూ వీటన్నింటిని బట్టి.. ఈ దామాషాలు మారిపోతుంటాయి. ఆ పాయింట్ మీద క్లెయిం చేయడం తుస్సుమంటుంది.

ఈ కోణాల్లో వర్మకు అందిన నోటీసుల్ని పరిశీలించినప్పుడు.. ఆయనకు ఫైబర్ నెట్ పంపిన నోటీసులు ఎందుకూ కొరగానివని అర్థమవుతోంది. ఎక్స్ పోస్టుల విషయంలో నాలుగుచోట్ల కేసులు పెడితే.. వర్మ తమకు లొంగిరాకుండా, బెయిలు తెచ్చుకుని మరీ ధీమాగా నిలబడినందుకు ఆయన మీద మరో వేధింపుల అస్త్రాన్ని సంధించడానికి ఇది ప్రయత్నం మాత్రమే. దీని ద్వారా వర్మ ఏదో కుమ్మక్కు అయినట్టుగా బురద చల్లడం జరగొచ్చు. కానీ లీగల్ గా ఆయన నుంచి డబ్బు వెనక్కు రాబట్టడం అంత ఈజీ కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

8 Replies to “ఆర్జీవీకి ఇచ్చిన నోటీసులు చెల్లుతాయా?”

  1. ///అసలు ఒప్పందంలో ఏముంది. ఇన్వాయిస్ ల ఆధారంగానే చెల్లింపులు జరగాలని ఉందా? లేదా, బీఎన్ఎస్ డేటా ఆధారంగా చెల్లింపులు జరుగుతాయని ఉందా? ఆ ఒప్పందంలో బీఎన్ఎస్ డేటా గురించిన ప్రస్తావన లేకపోతే గనుక.. అసలు ఈ నోటీసులు చట్టం ముందు నిలబడతాయా?////

    .

    వ్యుస్ (ఇక్కడ చందాలు అని రాసినట్తు ఉన్నడు ఎందుకొ) ప్రకారం చెల్లింపులు అన్నాక అవి ఇప్పటికి వరకూ ఎలా లెక్కెస్టున్నారొ తెలెదా?

    నువ్వు చెపుతున్న 1,43,357 24,213 వ్యుస్ కి ఆదారలు ఎమిటి? ఎలా లెక్కకట్టరు? మీరు ఇన్వాయిస్ లొ ఎది రాసుకు వస్తె దాని ప్రకారం చెప్పింపులు చెసారా? రెపు కనీసం కొర్ట్ లొ ఈ విషయాలు అడగరా?

    1. అసలు ఈ సినిమా కి దీయెటర్లలొ వచ్చిన ఆదాయం ఎంత? అది కూడా సుమ్మరు రెండున్నర లక్షలు అంటున్నరు!

      మరి దీనికి ఫిబెర్ నెట్ లొ వెయటనికి 2 కొట్లు ఎలా ప్రజల డబ్బు కర్చు చెస్తారు? అప్పట్లొ మీ వొడ్కా కర్చులు అన్న వచ్చాయా అని RGV మీద సెటైర్లు పెల్చారు!

  2. నీవు చెప్పినట్టు వర్మ కు ఏమి కాదు. కానీ APSFL ద్వారా 1863 వ్యూస్ వున్న బ్రాండ్ కలిగిన వర్మ కు అడ్డంగా రెండు కోట్లు ఎలా దోచిపెట్టారు అనేది జనాలకు అర్థం అవుతుంది. వర్మ ఎటూ దీన్ని మీడియాలో చింకి చాప చేసి మీ పార్టీను ఇంకా బ్రష్టు పట్టీంచడం పక్కా. ఆ రకంగా మంచిదే.

  3. మీ రాజకీయ సినిమలకి,

    మీ పత్రికలకి,

    మీ ప్రచారాలకి,

    మీ ప్యెలెస్స్ లకి,

    మీ ఎగ్గ్ పుఫ్ఫ్ లకి,

    మీ పార్టి రంగులకి,

    మీ ప్రవెట్ జెట్లకి,

    జనం డబ్బు ఎలా చెల్లిస్తారు?

  4. మన వెబ్సైట్ ప్రతి పేజీ ఎంత మంది ఓపెన్ చేసి చూశారు, ఎంత మంది కామెంట్లు పెట్టారు అని మీ వెబ్సైట్ అడ్మిన్ దగ్గర లెక్కలు వుంటాయి కదా. అలానే ఫైబర్నెట్ వాళ్ళదగ్గర కూడా వున్నాయి ఏమో , కదా.

Comments are closed.