తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!

ఒక దేశం, ఒక ఎన్నిక‌, ఒక మ‌తం, ఒక భాష‌.. ఇవే జాతీయ స‌మ‌స్య‌లు అయిన‌ట్టుగా మోడీ ప్ర‌భుత్వం అలా ముందుకుపోతూ ఉంది

దాదాపు 12 యేళ్ల కింద‌ట కేంద్రంలో అధికారాన్ని ఆశిస్తూ క‌మ‌లం పార్టీ చేసిన ప్ర‌చారాల‌కు, అప్పుడు సాగించిన ఉద్యమాల‌కూ.. ఆ త‌ర్వాతి పాల‌న‌కూ ఆస‌లు ఏమైనా సంబంధం ఉందా అనే ప్ర‌శ్న‌నే ఇప్పుడు వేసుకుంటే.. ఆ కాలం వేరే, ఈ కాలం వేరే అనుకోవాల్సి వ‌స్తోంది! అప్పుడు అవినీతి ప‌రులు అంటూ బీజేపీ ముద్ర వేసిన కాంగ్రెస్ నేత‌లు ఎవ్వ‌రి మీదా ఆ త‌ర్వాతి కాలంలో చ‌ర్య‌లు ఏమీ లేక‌పోగా.. వారిలో బీజేపీ తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేసిన కొంద‌రిని ఆ పార్టీలోకే చేర్చుకుని రాత్రికి రాత్రి రాజ్య‌స‌భ స‌భ్యులుగా కూడా చేశారు! అలా క‌మ‌ల‌జ‌లం చ‌ల్లి వారంతా దేశం కోసం, ధ‌ర్మం కోసం అని చెప్పిన జాబితా పెద్ద‌దే!

మ‌రి ఇంత‌కీ సామాన్యుల జీవితాల్లో మార్పులు తీసుకోవ‌డానికి ఏ నిర్ణ‌యాలు తీసుకున్నారు? అంటే.. వాటి వ‌ల్ల అణువంత ప్ర‌యోజ‌నం ద‌క్క‌క‌పోగా.. సామాన్యుల‌నే ఇక్క‌ట్ల పాల్జేసిన నిర్ణ‌యాలు బోలెడు! నోట్ల ర‌ద్దుతో ఒక్క కోటీశ్వ‌రుడికీ కించిత్ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. సామాన్యులు మాత్రం క్యూల్లో నిల‌బ‌డ్డారు నెల‌ల త‌ర‌బ‌డి. అయితే నోట్ల ర‌ద్దు త‌ర్వాతి ఎన్నిక‌ల్లో మోడీకి అంత‌కు మించిన మెజారిటీ ద‌క్కింది కాబ‌ట్టి.. అది చెల్లిపోయింది.

తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు, యూపీఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు కాషాయ‌వాదులు చెప్పిన మాట‌లు అన్నీ ఇన్నీ కావు! స్విస్ బ్యాంకులు అని, అక్క‌డ ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం అని, మోడీ ప్ర‌ధాని అయితే దాన్నంతా వెన‌క్కు తెప్పించ‌డ‌మే ప‌ని అని ఇలా ఎన్ని చెప్పారంటే అన్ని చెప్పారు! అలా న‌ల్ల‌ధ‌నం అంతా ఇండియాకు తేవ‌డం బీజేపీకి అధికారం ద‌క్కితే చిటికెలో ప‌ని అని, ఆ డ‌బ్బును దేశ ప్ర‌జ‌ల ఖాతాల్లోకి త‌లా 15 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ మోడీ ఇట్టే వేసేస్తాడ‌ని కూడా 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో డ‌బ్బా కొట్టారు! అధికారికంగా ఆ మేర‌కు ప్ర‌చారం కూడా చేశారు.

బీజేపీ అధికారంలోకి రావ‌డం ఆల‌స్యం, మోడీ ప్ర‌ధాని కావ‌డం ఆల‌స్యం.. ప్ర‌తి భార‌తీయుడు ఖాతాలోకీ 15 ల‌క్ష‌ల రూపాయ‌లంటూ ప్ర‌చార‌మే చేశారు! అయితే.. అది ఎన్నిక‌లు అయిపోయిన మ‌ర‌సటి రోజే మ‌రిచిపోయారు. ఆ త‌ర్వాత కాల‌క్ర‌మంలో ప్ర‌జ‌లు కూడా మ‌రిచిపోయారు! అలాంటి హామీ ఒక‌టి ఇచ్చారంటే ఇప్ప‌టి వారు న‌మ్మ‌లేక‌పోవ‌చ్చు! కానీ.. అలాంటి క‌బుర్లే అప్ప‌ట్లో క‌మ‌లం పార్టీ నుంచి వినిపించాయి!

స్విస్ బ్యాంకుల డ‌బ్బు పోయింది, త‌లా 15 ల‌క్ష‌లు గాయాబ్.. కాంగ్రెస్ నేత‌ల అవినీతి ఊసు లేదు, 2 జీ స్కామ్ నిరూప‌ణ కాలేదు, కామ‌న్ వెల్త్ స్కామ్ లో ఎవ‌రికి శిక్ష ప‌డిందో తెలీదు, మ‌హారాష్ట్ర‌లో సైనికుల ఫ్లాట్ల స్కామ్ లో కీల‌క పాత్ర పోషించాడ‌ని క‌మ‌లం పార్టీ ఆరోపించిన నాయ‌కుడికి ఈ మ‌ధ్య‌నే ఆ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చారు! మ‌రి మోడీ వ‌స్తే ధ‌ర‌ల‌న్నీ త‌గ్గిపోతాయ‌ని.. డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువను మోడీ అద్భుతం అనిపించుకునే స్థాయికి తీసుకెళ్తార‌ని.. గ్యాస్ బండ ధ‌ర త‌గ్గిపోతుంద‌ని.. ఇలాంటి మాట‌ల‌న్నీ చెప్పే వారు!

అప్ప‌ట్లో ఈ అంశాల‌ను ఆధారంగా చేసుకుని.. ఇప్ప‌టి ఆర్థిక మంత్రి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డే వారు! 12 యేళ్ల కింద‌టితో పోలిస్తే.. డాల‌ర్ తో రూపాయి మార‌కం విలువ ప‌త‌న స్థాయి వైపుకే వెళ్తూ ఉంది! అప్పుడు ఒక డాల‌ర్ కు 60 రూపాయ‌లు అయితే, ఇప్పుడు 82! ఇక గ్యాస్, పెట్రోల్ ధ‌ర‌ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది!

ఇక ఇన్ ఫ్రా ఏమైనా పెరిగిందా.. ప్ర‌జ‌ల‌కు ఏమైనా స‌రికొత్త సౌక‌ర్యాలు వ‌చ్చాయా అంటే చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు! ఊరూరా పార్కులు పెట్టారా, లేదా పిల్ల‌ల‌కు స్కూళ్లు క‌ట్టించారా, మారుమూల గ్రామాల‌కు రోడ్లేశారా అంటే.. ఈ ప‌దేళ్ల‌లో ఇలాంటివి చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు. ప్ర‌ధాన‌మంత్రి రోడ్ల ప‌థ‌కం కింద‌ట‌.. యూపీఏ 2 హాయాంలో గ్రామాల‌కు రోడ్లు వేసిందే ఆఖ‌రు! గ‌త ప‌దేళ్ల‌లో ఈ ప‌థ‌కం పేరు కూడా వినప‌డ‌టంల ఏదు. యూపీఏ టైమ్ లో వేసిన రోడ్ల‌ను రిపేర్ చేసిన దాఖ‌లాలు కూడా లేవంటే ఆశ్చ‌ర్యం ఏమీ లేదు. అదేమంటే రోజుకు ఇన్ని మైళ్ల రోడ్లు వేస్తున్నామంటూ కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖా మంత్రి ప్ర‌క‌ట‌న చేస్తూ ఉంటారు.

అయితే వారు వేసే రోడ్లేమిట‌య్యా అంటే జాతీయ ర‌హ‌దారులు. అదంతా టోల్ వ్యాపారం! ప్ర‌తి న‌ల‌భై కిలోమీట‌ర్ల‌కూ టోల్ గేట్లు త‌యారు అయ్యాయి. క‌నిష్టంగా యాభై రూపాయ‌లు, గ‌రిష్టంగా 150 రూపాయ‌లు ప్ర‌తి కారు నుంచి వ‌సూలు చేస్తున్నారు. బ‌స్సులు, ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్, స‌రుకు రవాణా.. ఇలాంటి వాహ‌నాల టోల్ రేటు మ‌రింత ఎక్కువ‌! హెచ్ఏఎమ్ ప‌ద్ధ‌తిలో .. ప్రైవేట్ కంపెనీల‌కు రానున్న ఇర‌వై యేళ్ల వ‌ర‌కూ టోల్ గేట్ల ద్వారా వ‌సూళ్ల‌ను చేసుకోవ‌డానికి అనుమ‌తులు ఇస్తూ జాతీయ ర‌హ‌దారులు వేస్తున్నారు!

అలాంటి వ్యాపారాత్మ‌క ధోర‌ణి ఉంది కానీ, గ‌త ప‌దేళ్ల‌లో.. ఏపీలోనో, తెలంగాణ‌లోనో, క‌నీసం సౌత్ ఇండియాలో ఎన్ని గ్రామాల‌కు తారు రోడ్డు వేశార‌నేది తేలిక‌గా స‌మాధానం దొరికే ప్ర‌శ్న కాదు! అది రాష్ట్ర ప్ర‌భుత్వాల బాధ్య‌త అని భ‌క్తులు వాదిస్తారేమో, అయితే యూపీఏ టైమ్ లోనే కాదు, అంత‌కు చాలా సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌ధాన‌మంత్రి రోడ్ల నిర్మాణ ప‌థ‌కం ఒక‌టి ఉండేది. దాని ద్వారా రూర‌ల్ రోడ్ల‌న్నింటినీ కేంద్ర‌మే వేసేది. కావాలంటే ప‌ల్లెల‌కు వెళ్లే దార్ల‌లో పాత బోర్డులు చూసుకోవ‌చ్చు!

సంక్షేమ ప‌థ‌కాల్లేవు, ఎరువులు – ర‌సాయ‌నాలపై రాయితీలు ఎత్తేశారు, అవ‌న్నీ ఎత్తేసి ఏటా రెండు వేల రూపాయ‌లు రైతుల ఖాతాల్లోకి అన్నారు, గ్యాస్ స‌బ్సిడీలు మాయం అయ్యాయి, ఉపాధి హామీ ప‌థ‌కం వంటి ఆలోచ‌న ఒక్క‌టీ లేదు, జీఎస్టీ వ‌చ్చి దుమ్ము రేగ్గొడుతూ ఉంది. ద్ర‌వ్యోల్బ‌ణం ఏ యేటికాయేడు పెరుగుతూనే ఉంది. ధ‌ర‌లు ఆకాశాన్ని అంటతూ పైకి పోతున్నాయి! ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఒక దేశం, ఒక ఎన్నిక‌, ఒక మ‌తం, ఒక భాష‌.. ఇవే జాతీయ స‌మ‌స్య‌లు అయిన‌ట్టుగా మోడీ ప్ర‌భుత్వం అలా ముందుకుపోతూ ఉంది! అయితేనేం.. రాష్ట్రాల‌కు రాష్ట్రాల్లో గెలుస్తున్నారు క‌దా, జ‌నాల స‌మ‌స్య‌లతో ఇక ప‌నేంటి?

11 Replies to “తాము అనుకున్న‌వ‌న్నీ మోడీ చేసేసుకోవ‌చ్చంతే!”

  1. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంత టోల్ బాదుడు లేదు, ఈయనే రోడ్లు వేసున్నాడు, డెవలప్ చేస్తున్నాడని అంటారు ఈయన సపోర్టర్స్. నేషనల్ హైవేస్ ఏదో ఇప్పుడే కడుతున్నట్టుగా. చిన్నా చితకా రైళ్లు ప్రారంభోత్సవానికి కూడా ఈయన రెడీ అవుతున్నాడు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమీ లేవు అనే కదా.

  2. చైనా రష్యా మనకి గొప్ప ఆదర్శం అని అప్పుడు అందరూ వక్కాణించారు కదా.. అందరూ హాయిగా సంతోషించాలి ఇప్పుడు …

  3. హన్నా! 18% GST కట్టిన పాప్కార్న్ తింటూ ఏమిటి ఈ రాతలు?

    ప్లే స్టో–ర్ లో వా–టే-సుప్ లే–టె-స్ట్ అ/ప్డే/ట్ వచ్చింది డౌ–న్లొ/డ్ చే/సు–కోండి!

Comments are closed.