భూమి ధరల పెంపులో.. అమరావతి మాయ!

భూమి ధరల పెంపు విషయంలో అమరావతి ప్రాంతానికి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో భూమి ధరలని గానీ, రిజిస్ట్రేషన్ చార్జీలని గానీ ఏమాత్రం పెంచడం లేదు.

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఎక్కువ ఉన్న చోట తగ్గిస్తారని, మిగిలిన చోట్ల పెంచుతారని అంటున్నారు గానీ, చివరకు చూస్తే పెంచడమే జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే భూమి ధరల పెంపు విషయంలో అమరావతి ప్రాంతానికి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో భూమి ధరలని గానీ, రిజిస్ట్రేషన్ చార్జీలని గానీ ఏమాత్రం పెంచడం లేదు.

అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలైన, విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో భూమి ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్నారు. అయితే అమరావతిలో మాత్రం పెంచకపోవడానికి ప్రభుత్వం ఏదో కారణాలు చెబుతున్నది గానీ, దీని వెనుక మాయతో కూడిన వక్ర ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకున్నారని అనుమానం ప్రజలకు కలుగుతోంది.

ప్రభుత్వం చెబుతున్న కారణం ఏమిటంటే, ‘అమరావతి రాజధానికి పెట్టుబడులతో పాటు ప్రపంచ స్థాయి సంస్థలను తీసుకురావాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అందువల్ల ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు.’ అంటూ వివరించింది.

అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే అనేక భవనాల నిర్మాణాలు ఊపందుకుంటున్న దశలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి వస్తూ, కేవలం భూమి ధరలను చూసి ఆకర్షితులవుతాయా? ఆ ప్రాంతానికి సహజమైన ధర ఉంటే రావడానికి సంకోచిస్తారా? చవక భూమి ఇస్తేనే తమ సంస్థలను స్థాపిస్తామని చెప్పే వారు నిజంగా వ్యాపారం చేస్తారా? వారితో రాష్ట్రానికి ఎంత మేర లాభం కలుగుతుందనే అంశం సందేహాస్పదం.

ఇప్పుడు భూమి ధరలు పెంచకపోవడం వలన నష్టం కేవలం ప్రభుత్వానికే. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహంతో వ్యవహరిస్తున్నట్టుగా కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ సంస్థలు అమరావతికి తరలివస్తే, అవన్నీ తమ ప్రాజెక్టులను ప్రారంభించేవరకు ఆగి, అవి ఏర్పాటైన తర్వాత భూమి ధరలను భారీగా పెంచవచ్చుననే ఆలోచన ప్రభుత్వానికి ఉందని అనుకుంటున్నారు.

అందువల్ల, ఇప్పటి ధర కంటే ఆ సమయంలో రెట్టింపు ధర పెంచినా మిగిలిన స్థలాలు అమ్ముడవుతాయని వారు భావిస్తున్నారు. అదేవిధంగా, భూములు ఇచ్చిన రైతులకు దక్కే వాటా స్థలాల ధరలు కూడా అప్పటికి భారీగా పెరుగుతాయి. అప్పుడు ఈ రైతులందరూ ఎక్కువ లాభం పొందతారని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు.

కాబట్టి, అమరావతి ప్రాంతంలో భూమి ధరలు పెంచకపోవడం తాత్కాలికమేనని, భవిష్యత్‌లో ఇది మరింత అధిక ధరల పెంపుకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2 Replies to “భూమి ధరల పెంపులో.. అమరావతి మాయ!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.