అనర్హతపై సుప్రీం కోర్టు ఏం తేలుస్తుందో?

గులాబీ పార్టీ ఆల్రెడీ హై కోర్టును ఆశ్రయించగా ఈ విషయంలో తాము కల్పించుకోలేమని, అసెంబ్లీ స్పీకర్ దే తుది నిర్ణయమని తేల్చిపారేసింది

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తేవాలని ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. గులాబీ పార్టీ ఆల్రెడీ హై కోర్టును ఆశ్రయించగా ఈ విషయంలో తాము కల్పించుకోలేమని, అసెంబ్లీ స్పీకర్ దే తుది నిర్ణయమని తేల్చిపారేసింది. దీంతో గులాబీ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడ శుక్రవారం విచారణ ప్రారంభమైంది.

రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడుతుందని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతోంది. అలా జరగాలని ఆశపడుతోంది కూడా. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తొమ్మిది నెలల కిందటే గులాబీ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.

అయినా స్పీకర్ చర్యలు తీసుకోలేదు. తరువాత హైకోర్టుకు వెళ్ళింది. ఈ విషయంలో స్పీకరే నిర్ణయం తీసుకోవాలని హై కోర్టు చెప్పి కూడా ఆరు నెలలైంది. ఆల్రెడీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పారు.

అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి తుది నిర్ణయం స్పీకర్ దే అని ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలని ఆయన్ని ఆదేశించలేమని హై కోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కూడా కాంగ్రెస్ అండ్ టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి నిరాశే ఎదురైంది.

2 Replies to “అనర్హతపై సుప్రీం కోర్టు ఏం తేలుస్తుందో?”

  1. మ్మెల్యే ల అనర్హత విషయం జగన్ గారి అవినీతి కేసు తేలటానికి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుందని చెప్పేయడమే అన్ని సాక్ష్యాలు వున్న బాబాయ్ హత్య జరిగి ఇంత కాలమైనా కేసు తేలనప్పుడు ఇలాంటి సున్నిత విషయాలు ఎలాగా తేలుతాయి ఇది మన సర్వోన్నత న్యాయ స్తానం కూడా ఆలోచించాలి

Comments are closed.