సీఎంగా కేడ‌ర్ వ‌ద్ద‌కు బాబు… జ‌గ‌న్ ఎక్క‌డ‌?

ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎప్పుడైనా, ఎక్క‌డైనా త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయిన సంద‌ర్భం ఉందా?

సీఎం హోదాలో నారా చంద్ర‌బాబునాయుడు నేరుగా త‌న పార్టీ ద‌గ్గ‌రికి వెళ్లారు. వాళ్ల‌తో మాట్లాడారు. ఆ మాట‌లు ఇత‌రుల‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. అది వేరే సంగ‌తి. కానీ టీడీపీ కేడ‌రే త‌న‌కు ప్రాణ‌మ‌న్నారు. మీ త‌ర్వాతే ఎవ‌రైనా, ఏమైనా అని ఆయ‌న న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ఇక‌పై మీకు న్యాయం చేస్తాన‌ని చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల‌కు జీడీనెల్లూరు స‌మావేశంలో హామీ ఇచ్చారు.

వైసీపీ అధికారం కోల్పోయి తొమ్మిది నెల‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎప్పుడైనా, ఎక్క‌డైనా త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం అయిన సంద‌ర్భం ఉందా? అనే ప్ర‌శ్న సొంత పార్టీ శ్రేణుల నుంచి వ‌స్తోంది. టీడీపీ కేడ‌ర్‌తో సీఎం చంద్ర‌బాబు స‌మావేశం కావ‌డం, వాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకుంటున్న తీరు చూసిన త‌ర్వాత‌, త‌మ నాయ‌కుడు ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చినా, ఇంత వ‌ర‌కూ త‌మ‌ను క‌ల‌వ‌నే లేదు క‌దా? అని ఆవేద‌న‌తో ప్ర‌శ్నిస్తున్నారు.

అప్పుడెప్పుడో సంక్రాంతి త‌ర్వాత ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రెండురోజులు ఉంటాన‌ని, ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను క‌లుస్తాన‌ని ప్ర‌క‌టించారు. సంక్రాంతి, శివ‌రాత్రి పోయాయి. ఈ నెలాఖ‌రుకు ఉగాది ప‌ర్వ‌దినం కూడా పోతుంది. అయిన‌ప్ప‌టికీ వైసీపీ నుంచి జ‌గ‌న్ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే, కొన్ని ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై త‌న పార్టీ నాయ‌కుల‌తో జ‌గ‌న్ ఆందోళ‌న‌ల‌కు పిలుపునిస్తారు.

ఎంత‌సేపూ జ‌నం వ‌ద్ద‌కు త‌న పార్టీ నాయ‌కుల్ని పోవాల‌ని జ‌గ‌న్ ఆదేశించ‌డ‌మే త‌ప్ప‌, తాను వెళ్ల‌డానికి బ‌ద్ధ‌కించ‌డం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని ఆ పార్టీ నాయ‌కుడొక‌రు అన్నారు. జ‌గ‌న్ వైసీపీ కార్య‌క‌ర్త‌ల్ని క‌లిసి, వాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకోవాలి క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు త‌మ ప్ర‌జాప్ర‌తినిధుల్ని న‌మ్ముకోకుండా, తానే కార్య‌క‌ర్త‌ల‌తో ముఖాముఖి మాట్లాడ్డం మొద‌లు పెట్టార‌ని, సీఎంని చూసైనా జ‌గ‌న్ నేర్చుకోవాల‌ని వైసీపీ శ్రేణులు హిత‌వు ప‌లుకుతున్నాయి.

21 Replies to “సీఎంగా కేడ‌ర్ వ‌ద్ద‌కు బాబు… జ‌గ‌న్ ఎక్క‌డ‌?”

  1. ఇండియన్ పాలిటిక్స్ కే టార్చ్ బేరర్ మా సింగల్ సింహం.. అలాంటి వాణ్ణి ఆఫ్టరాల్ చంద్రబాబు ని చూసి నేర్చుకోమని సలహాలా?? ఎలా కనిపిస్తున్నాడు నీకు?? ఇంకోసారి ప్రవచనాలు చెప్పడానికి ట్రై చేస్తే బట్టలూడదీసి, బాత్రూం కి దె0కపోయి ఏదేదో చేస్తాడు అంతే.. తర్వాత బాధ పడొద్దు.

  2. anna yemann nee laga burra takkuva anukunnava?

    already 3 months back kutami pi vethirekatha vaccesindi,

    YCP srenulu lani Chandra babe active chesthadu

    so anna just kannu moosi teristhe chalu

    last lo yelagoo pada yatra chesetappudu muddulu pedathadu kada

  3. anna yemann nee tingarodu anukunnava?

    already 3 months back kutami pi vethirekatha vaccesindi,

    YCP srenulu lani Chandra babe active chesthadu

    so anna just kannu moosi teristhe chalu

    last lo yelagoo pada yatra chesetappudu muddulu pedathadu kada

  4. anna yemann nee laga dedh anukunnava?

    already 3 months back kutami pi vethirekatha vaccesindi,

    YCP srenulu lani Chandra babe active chesthadu

    so anna just kannu moosi teristhe chalu

    last lo yelagoo pada yatra chesetappudu muddulu pedathadu kada

  5. already 3 months back kutami pi vethirekatha vaccesindi,

    YCP srenulu lani Chandra babe active chesthadu

    so anna just kannu moosi teristhe chalu

    last lo yelagoo pada yatra chesetappudu muddulu pedathadu kada

  6. మీ అందరికీ ఒక్కటే చెపుతున్నా.. వైస్సార్సీపీ వాళ్లకి డైరెక్ట్ గ , ఇండైరెక్ట్ ఏ పనులు కూడా చేసే పరిస్థితి ఉండకూడదు.. బాబోరు..

    .

    సూపర్ సర్ మీరు… అలా ఉండాలి… అదే జగన్ చూడండి, కులం చూడం మతం చూడం అని అందరినీ సమానం గా చూస్తాం అని చెప్పి, చేస్తే, చాచి మొహాన కొట్టి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించారు…

    .

    అందుకే మీరు సూపర్… ఇన్నాళ్లు రాజకీయాలు చేశారు..

    వీలైతే టాక్స్ లు కూడా.. ఒహ్హ్ సారీ, ఆల్రెడీ చేస్తున్నారు కదా.. అందుకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు టాక్స్ లు కట్టడం లేదు.. అందుకే రావాల్సిన gst , మైన్స్ మీద వచ్చే ఇన్కమ్, లిక్కర్ ఇన్కమ్ ఇంకా.. చాలా తగ్గిపోయాయి కదా.. సారీ, నేను మర్చిపోయా..

  7. Anna kalavaka poina… dooram pettinaa.. ee gorrelu athanike vote vestharani..

    Tanu tappa ee gorrelaki vere dikku ledani maa annaki telusu….

    Vvv imp entante

    Anna kani bayata dorikithe..

    Annani nammi mosapoyina…dabbbulu pogottukunna … karyakarthalu… em chestharo meeku telusa ??

  8. మేం కార్యకర్తల.దగ్గరకి వెళ్ళాలి అంటే పరదాలు గట్రా అవన్నీ కావాలి అప్పుడు అంటే ప్రభుత్వ ఖర్చుతో ఐపో ఏది మరి ఇప్పుడేవరు పెట్టుకుంటారు

Comments are closed.