సూప‌ర్‌సిక్స్ స్కీమ్స్ మ‌ల్లే.. ఎమ్మెల్సీ ప‌ద‌వుల హామీలు!

ఎన్నిక‌ల్లో ప‌ని చేయించుకోడానికి ఎన్నెన్నో చెప్తార‌ని, అవ‌న్నీ అమ‌లుకు నోచుకుంటాయ‌ని ఆశించ‌డం వృథా అని టీడీపీ ఆశావ‌హులు వాపోతున్నారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంలో పొత్తులో భాగంగా కొంద‌రు టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబునాయుడు టికెట్లు ఇవ్వ‌లేక‌పోయారు. అలాంటి వాళ్లంద‌రినీ బుజ్జ‌గించి, పార్టీకే ప‌ని చేయ‌డానికి నాడు చంద్ర‌బాబు ప్ర‌యోగించిన అస్త్రం ఎమ్మెల్సీ ప‌ద‌వి. అధికారంలోకి రాగానే మొట్ట‌మొద‌ట వ‌చ్చే ఎమ్మెల్సీ ప‌ద‌వుల్లో మీకే న్యాయం చేస్తాన‌ని ఆశావ‌హులంద‌రితోనూ చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లికారు. ప్ర‌జ‌ల‌కు ఏ విధంగా అయితే , సంప‌ద సృష్టించి, జ‌గ‌న్‌కు మించి సంక్షేమ ల‌బ్ధి క‌లిగిస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారో, ఆశావ‌హుల‌కు కూడా వాళ్లు కోరుకున్న‌ట్టుగా మంచి ప‌ద‌వులు ఇస్తాన‌ని త‌న మార్క్ భ‌రోసా ఇచ్చారు.

దీంతో టికెట్ ద‌క్క‌క‌పోయినా, కూట‌మిని అధికారంలోకి తెచ్చుకోవాల‌ని టీడీపీ ఇన్‌చార్జ్‌లు శ‌క్తి వంచ‌న లేకుండా ప‌ని చేశారు. రాజ‌కీయ విభేదాల్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ ప్ర‌భుత్వాన్ని తెచ్చుకోవాల‌ని తాప‌త్ర‌య‌పడ్డారు. ముఖ్యంగా పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విని మొద‌టి విడ‌త‌లోనే ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇవ్వ‌డానికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. అలాగే మ‌రికొంద‌రు టీడీపీ నాయ‌కులు కూడా ….ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు త‌మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని గుర్తు చేస్తున్నారు.

కానీ టీడీపీకి ద‌క్కిన మూడు ఎమ్మెల్సీ సీట్ల‌లో ఒక‌టి రెన్యువ‌ల్‌, మ‌రో ఇద్ద‌రికి కొత్త‌గా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల్ని అందిస్తాన‌ని హామీలిచ్చి, ఏ ర‌కంగా అయితే వాటి ఊసే ఎత్త‌డం లేదో, చివ‌రికి సొంత పార్టీ నాయ‌కుల‌కు కూడా అదే ర‌క‌మైన పొలిటిక‌ల్ ట్రీట్మెంట్ చంద్ర‌బాబు ఇచ్చార‌ని కొంద‌రు దెప్పి పొడుస్తున్నారు. ఇంత వ‌ర‌కూ ప్ర‌జానికంలోనే హామీల అమ‌లుకు నోచుకోలేద‌న్న ఆవేద‌న క‌నిపించేద‌ని, ఇప్పుడు నాయ‌కుల్లో కూడా చూడొచ్చ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఎన్నిక‌ల్లో ప‌ని చేయించుకోడానికి ఎన్నెన్నో చెప్తార‌ని, అవ‌న్నీ అమ‌లుకు నోచుకుంటాయ‌ని ఆశించ‌డం వృథా అని టీడీపీ ఆశావ‌హులు వాపోతున్నారు. ఇప్పుడు ఇవ్వ‌లేని వాళ్ల‌కు 2027లో ద‌క్కే ఎమ్మెల్సీల ఆశ చూపుతున్నార‌ని వారు అంటున్నారు.

మోస‌పోయామ‌నే భావ‌న …మ‌న‌సుకు ఎంత నొప్పి క‌లిగిస్తుందో ఇప్పుడు అనుభ‌వంలోకి వ‌స్తోంద‌ని, బ‌హుశా సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు నోచుకోని ప్ర‌జ‌ల మాన‌సిక స్థితి కూడా అట్లే వుంటుందేమో అని నాయ‌కులు అంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అంటే ఇదో కాబోలు అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

5 Replies to “సూప‌ర్‌సిక్స్ స్కీమ్స్ మ‌ల్లే.. ఎమ్మెల్సీ ప‌ద‌వుల హామీలు!”

  1. నీ కామెడీ బలే ఉంది వెంకట్ రావు .. .. నవ రత్నాలు ఇస్తున్న అన్నాను వొదిలేసి ..సూపర్ సిక్స్ కోసం వేసారా .. ౯ ఎక్కువా .. ౬ ఎక్కువా నాయన .. మీ లోగిక్స్ మేకైనా అర్థం అవుతాయో లేదు దేవుడికే ఎరుక ..

  2. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను

    సజ్జనుండు బల్కు చల్లగాను

    కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా

    విశ్వ దాభిరామ..! వినుర వేమ…!

    తాత్పర్యం :

    అల్పబుద్ధి కలిగినవాడు ఎప్పుడూ.. డాంబికాలు పోతూ, ఆడంబరంగా మాటలు చెప్పుకుంటాడు. అదే శాంత స్వభావి మాత్రం సున్నితంగా మాట్లాడుతాడు, ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు. కంచు శబ్దం చేసినట్లుగా, బంగారం శబ్దం చేయదు కదా..! అలాగే అల్బబుద్ధి కలిగినవాడిని కంచుతోనూ, శాంత స్వభావిని బంగారంతో పోల్చాడు ఈ పద్యంలో వేమన మహాకవి.

Comments are closed.