తను గే అని ప్రకటించుకోవడానికి గర్వ పడతాను అంటూ గర్వంగా ప్రకటించుకొన్న యాపిల్ సీఈవో టీమ్ కుక్ కి ఇప్పుడు కొత్త తిప్పలు మొదలయ్యాయి. అసహజమైన, ప్రకృతికి విరుద్ధమైన లైంగిక కార్యకలాపాలు నడుపుతున్నాను.. అని గర్వంగా ప్రకటించుకొన్న ఈయన పట్ల అనేక దేశాల్లో వ్యతిరేక వాణి వినిపిస్తోంది. ప్రపంచంలోని నలుమూలల మార్కెట్ కలిగి ఉన్న యాపిల్ కంపెనీకి సీఈవోగా ఉంటూ.. కుక్ ఇలా ప్రకటించుకోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
మన దేశంలోనే కాదు… చాలా దేశాల్లో ఇలాంటి అసహజమైన లైంగిక ప్రవృత్తుల పట్ల అసహ్యభావం ఉంది. సృష్టికి విరుద్ధమైన లైంగిక చర్యను వ్యతిరేకించే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని దేశాల్లో ఇలాంటి వాళ్లకు కూడా అన్ని హక్కులూ ఉన్నప్పటికీ మరికొన్ని దేశాల్లో మాత్రం గేలు, లెస్బియన్లు అని ప్రకటించుకోవడం నేరం. ఒకవేళ ఇలాంటి అసజమైన లైంగిక కోరకలు ఉన్నా.. వాటి గురించి బయటకు చెప్పకూడదు. తాము గేలమని ప్రకటించుకోడదు.
ఇలాంటి నియమాలు ఉన్న దేశాల్లో రష్యా ఒకటి. పాశ్చాత్య దేశమే అయినా… రష్యాలో గేలు, లెస్బియన్లు అనైతికంగా వ్యవహరించే వాళ్ల కిందే లెక్క. మరి ఇప్పుడు టిమ్ కుక్ విషయంలో కూడా ఈ నియమాన్ని వర్తింపజేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. యాపిల్ సీఈవోను ఎన్నటికీ దేశంలో అడుగు పెట్టనీయకూడదని రష్యన్ లెజిస్ట్లేటర్లు డిమాండ్ చేస్తున్నారు. గే అని గర్వంగా ప్రకటించుకొన్న ఆయన గనుక దేశంలోకి వస్తే అరెస్టు చేయించాలని కూడా వారు కోరుతున్నారు.
విచిత్రం ఏమిటంటే.. యాపిల్ ప్రస్తుత సీఈవో తనను తాను గే అని ప్రకటించుకొన్న నేపథ్యంలో అక్కడ యాపిల్ కంపెనీ మీద, యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ మీద కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. జాబ్స్ జ్ఞాపకంగా ఏర్పాటు చేసిన ఒక శిలాఫలకాన్ని రష్యన్లు ధ్వంసం చేశారు. జాబ్స్ ఏమీ గే కాదు, అయినా కూడా వారు తమ కసిని తీర్చుకొన్నారు. ఈ విధంగా కుక్ మాటలు కొత్త సెగలను రేపుతున్నాయి. మరి చేసేదేదో సైలెంట్ గా చేసుకోకుండా.. ఈ విధంగాప్రకటించుకొని కుక్ .. మొత్తానికే ఎసరు తెచ్చుకొన్నాడు!