అమెరికా నుంచి ట్రంప్ అక్రమ చొరబాటుదారులను తరిమివేస్తున్నాడు. సంకెళ్లు వేసి, మిలటరీ విమానాల్లో వారి దేశాలకు పంపించేస్తున్నాడు. చదువు పేరుతో అక్కడకు వెళ్లినవారిలో దాదాపు 80 శాతం మంది, చదువు సంగతి పక్కన పెట్టి, చట్టవిరుద్ధంగా హోటళ్లలో, సూపర్ మార్కెట్లలో పని చేస్తూ ఉంటే యికపై అవి సాగవు అని గొంతు చించుకుని చెప్తున్నాడు. ‘చదువుకోవడానికి వచ్చిన వారు ఆ పనే చేయండి. బాగా చదువుకుని నైపుణ్యం సంపాదించి, మా దగ్గర హెచ్చు జీతాల ఉద్యోగాలు తెచ్చుకుని దర్జాగా రండి.’ అంటున్నాడు. ‘వీళ్లకు గేట్లు తెరుస్తాం తప్ప, చిల్లరమల్లర పనులు చేయడానికి గుంపులు గుంపులుగా వచ్చి మాకు చికాకు తెచ్చి పెట్టకండి’ అంటున్నాడు.
ఇక కెనడా నుంచో, మెక్సికో నుంచో అక్రమ మార్గాల్లో వచ్చేసి, ‘మేం రాజకీయ శరణార్థులం. మా దేశాల్లో మమ్మల్ని రాజకీయ కారణాల చేత హింసిస్తూ బతక నివ్వటం లేదు. ఆశ్రయం యివ్వండి’ అంటూ కోరే వాళ్ల అభ్యర్థనలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం అంటున్నాడు. ఇలా అడిగే వాళ్లలో భారతీయులు కూడా ఉన్నారట. ఇక్కడ ప్రాణాలకు ముప్పు వచ్చేటంత పొలిటికల్ పెర్సిక్యూషన్ ఏముంది? ఉందని వీళ్లు చెప్తే మాత్రం యిప్పటిదాకా అమెరికా అధికారులు ఎలా ఒప్పుకుంటున్నారు అనేది వింత. అక్రమమార్గాల్లో అమెరికాలో చొరబడిన కొందరు గుజరాతీయులు ‘మేం కాంగ్రెసు పార్టీ కార్యకర్తలం. గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వం మమ్మల్ని బతకనీయటం లేదు’ అని చెప్పుకుని ఆశ్రయం అడిగారని విని తెల్లబోయాను. ఇలాటి వాటికి అడ్డుకట్ట వేస్తానంటున్నాడు ట్రంప్.
ట్రంప్ ఇలా చేయడం మన పట్ల ద్రోహం చేసినట్లే అనే టోన్‌లో అని మన మీడియా గగ్గోలు పెడుతోంది. దాని ప్రభావంతో మన ప్రజలు కూడా ట్రంప్‌కు శాపనార్థాలు పెడుతున్నారు. అసలు అక్రమ మార్గాల్లో అక్కడకు వెళ్లమన్నదెవరు? అమృత్‌సర్‌లో విమానం దిగిన బ్యాచ్‌లో కొందరు డిసెంబరు నెలలో కూడా యిక్కణ్నుంచి వెళ్లారు. డిసెంబరు అంటే ట్రంప్ గెలిచి, ప్రమాణస్వీకారానికి వేచి ఉన్న సమయమన్నమాట. ఈ అక్రమ చొరబాటుదారులపై ట్రంప్ వైఖరి లోకవిదితం. అయినా వీళ్లు బయలు దేరారంటే వాళ్ల తెంపరితనం చూడండి. వీళ్ల గుండెల్లో, వీళ్ల బాటలో బయలు దేరే వాళ్ల గుండెల్లో యిప్పటికైనా భీతి, కనీసం గుబులు పుట్టించాలనే ట్రంప్ వాళ్ల తిరోగమనానికి అంత పబ్లిసిటీ యిస్తున్నాడు.
నిజానికి యిలా వెనక్కి పంపడం, సంకెళ్లు వేయడం కొత్తేమీ కాదు. పంపడం తప్పు కాదు కానీ, సంకెళ్లు వేయడం దేనికి? అని కొందరంటున్నారు. దానికో లాజిక్ ఉంది. ఇలా తిరిగి వెళ్లవలసి వచ్చిన వాళ్లు అవమానభారంతో కృంగుబాటుకు గురై ఉంటారు కాబట్టి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయవచ్చు, యితరులపై దాడి చేయవచ్చు. విమానంలో వైర్లు పీకి, కూలిపోయేట్లు చేయవచ్చు. వారికా అవకాశం యివ్వకుండా కాళ్లూ చేతులూ కట్టేసి వాళ్ల వాళ్ల దేశాల్లో దింపేస్తే అమెరికా వారు తమ భారం దింపుకున్నట్లే! లేకపోతే అదో తలకాయనొప్పి!
ఇక విద్యార్థి వీసాపై వెళ్లి చట్టవిరుద్ధంగా పని చేసే వాళ్లను కూడా ఎలా సమర్థించగలం? తక్కువ జీతాలకు పని చేయడానికి సిద్ధపడే వీళ్ల వలన రూలు ప్రకారం జీతం అడిగే స్థానిక అమెరికన్లకు అవకాశాలు పోతున్నాయి కదా! నిజానికి యీ విద్యార్థులు ఇండియాలో ఉండగా చట్టవిరుద్ధమైన పనులు చేయడానికి జంకే రకం. అమెరికాకు వెళితే మాత్రం వీళ్లకు ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తోంది. అక్కడ ఎవడూ పట్టించుకోడులే అనే తెగువ చూపుతున్నారు. వాళ్ల ధీమాను సడలించడానికి ట్రంప్ సమకట్టాడు. అతన్ని తప్పు పట్టగలమా? కానీ పడుతున్నారు చాలామంది.
‘పాపం అలాటి చిన్నాచితకా పనులు చేయకపోతే విద్యార్థులకు కష్టం కదండీ, తల్లిదండ్రులు బోల్డు అప్పు చేసి పంపించారు, అక్కడ యూనివర్శిటీ క్యాంపస్‌లో పార్ట్ టైమ్ యివ్వటం లేదు, మరి డబ్బెలా వస్తుంది? అప్పెలా తీరుస్తారు?’ అంటూ వాదిస్తున్నారు. స్టూడెంటు వీసాకు అప్లయి చేసే ముందే క్యాంపస్‌లో ఆర్జించే అవకాశం ఉండదని తెలుసు కదా! అలాటి ఆదాయం లేకపోయినా, నా కాళ్ల మీద నన్ను నిలబెట్టగలిగిన ఆర్థిక స్తోమత మా తల్లిదండ్రులకు ఉంది అని బ్యాంకు డిపాజిట్లు వగైరా చూపించే వీసా తెచ్చుకున్నాడుగా! ఆ సర్టిఫికెట్లు అబద్ధమా? అంటే అమెరికా విమానం ఎక్కక ముందే అసత్యాలు చెప్పడం, అక్రమ మార్గాలు తొక్కడం మొదలు పెట్టేశాడన్నమాట! మరి దీనికి ఫలితం సవ్యంగా ఉండి తీరుతుందని ఎలా ఆశించగలరు? వేసే విత్తనం బట్టే చేతికందే పంట ఉంటుంది.
ఎందుకొచ్చిన రొష్టు యిదంతా అంటే ‘ఇక్కడ ఉద్యోగావకాశాలు లేవు, ఉపాధి మార్గాలు లేవు, దరిద్రం తాండవిస్తోంది, మనిషి ఎదగాలంటే అమెరికా వెళ్లాల్సిందే’ అనే వాదనలు చేస్తున్నారు. విద్యార్థి వీసా మీద వెళ్లాలంటే 40-50 లక్షల అప్పు చేయాలి. ఇక అక్రమ మార్గాల్లో చొరబడాలంటే అప్పు చేసే, ఆస్తులమ్మో తలా 40-50 లక్షలు ఏజంట్లకు ముందే సమర్పించుకోవాలి. ఆ డబ్బుతో యిక్కడే ఒక పాన్‌షాప్ పెట్టుకుని బతకవచ్చు కదా! ప్రాణాలు బలిపెట్టే సాహసం చేయడం దేనికి?
ఏమైనా అంటే ‘ఇండియాలో దరిద్రం, దరిద్ర నారాయణులే ఉన్నారు. అక్కడైతే అందరూ లక్ష్మీనారాయణులే! అక్కడ అడుగుపెడితే చాలు, మనమూ వారిలో ఒకరై పోతాం’ అంటారు. అది నిజమేనా? ఇండియా అంటే దరిద్రమేనా? స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఆ దరిద్రం తగ్గదా? ఈ విషయంపై ఎచ్‌ఎమ్ టివి వారి ‘కమాన్ ఇండియా’ అని 2006 మేలో నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రశ్నోత్తరాలకు యిప్పటికీ రిలవెన్స్ ఉందనే భావంతో ఆ నాటి యింటర్వ్యూ టెక్స్‌ట్‌ను యిస్తున్నాను.
ప్రశ్న 01- సగటు భారతీయుని దారిద్య్రాన్ని తగ్గించే అవకాశాలున్నాయా?
జవాబు – దారిద్య్రం తగ్గించడం గురించి ఆలోచించడం కంటె మనిషి ఆలోచనా సరళిని మార్చడం గూర్చి మొదటగా ఆలోచించండి. దరిద్రం అనేది ఒక భావన. మెరుగుపడే అవకాశాలు అందుబాటులో ఉన్నా చేయి చాచి తీసుకోనక్కరలేదు అనే భావన. ‘భగవంతుడు నా కిచ్చిన యీ అవయవసంపద, తెలివితేటలు వృథా, నేనెందుకు పనికిరాను’ అనే భావన. ద్వారం మూసుకుపోతే ఏడుస్తూ కూర్చుని, కిటికీ ఐనా తెరవడానికి బద్ధకించే ఓ లక్షణం. ఎమోషన్స్‌ను పక్కన పెట్టి నిజాలు మాట్లాడుకుందాం. మన చుట్టూ వున్న సమాజంలో ఎన్నో స్కిల్‌డ్, అన్‌స్కిల్‌డ్ జాబ్స్ వున్నాయి.
మీ స్టూడియో లోనే ఎలక్ట్రీషియన్‌కు, ప్లంబర్‌కు, సెక్యూరిటికీ, కెమెరా అసిస్టెంటుకి, స్క్రిప్టు రైటర్‌కు కొరత వుండి వుంటుంది. సరైన వాళ్లు దొరక్క ఎన్నో పనులు పెండింగ్‌లో వుంటాయి. కంప్యూటర్ మెకానిక్ కోసం, కారు మెకానిక్ కోసం, కారు డ్రైవర్ కోసం, టైర్ పంక్చర్ వేసేవాడి కోసం మనం నిరంతరం చూస్తూనే వుంటాం. చేస్తామని ముందుకు వచ్చిన వాళ్లకు పని రాదు. నైపుణ్యం లేదు. చురుకుదనం లేదు. ఎంతో వాక్యూమ్ వుంది. ఎన్నో గ్యాప్స్ వున్నాయి. వాటిని పూరించడానికి వీళ్లెందుకు పూనుకోరు? మాకు ఈ పని రాదు అని కూర్చోవచ్చా? వ్యవసాయం కిట్టుబాటు కాకపోతే రైతు, నగరానికి వచ్చి కార్మికుడు కావటం లేదా? కార్మికుడు దుకాణదారు కావటం లేదా? నేను ఎలక్ట్రానిక్స్ యింజనీరింగ్ నుండి జెనటిక్ యింజనీరింగ్‌కు మారలేదా?
గ్రామాల్లో అడగండి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కారణంగా పొలాలలోకి కూలీకి మనుషులు రావటం లేదంటారు, నగరాల్లో అడగండి, ఫ్యాక్టరీలోకి స్కిల్‌డ్ లేబరు దొరకటం లేదంటారు. మరొక పక్కన చూస్తే నిరుద్యోగం పెరుగుతోందంటారు. ఏమిటీ ఎనామలీ? ఏమిటీ వైపరీత్యం? అసలు విషయం ఏమిటంటే, అందరూ చదువుకుంటున్నారు. చదువుకున్నాక వైట్ కాలర్ జాబ్స్ తప్ప వేరే ఏమీ చేయకూడ దనుకుంటున్నారు. కానీ వైట్ కాలర్ జాబ్స్ తగ్గుతున్నాయి. కంప్యూటర్ వచ్చాక గుమాస్తా వుద్యోగాలు పోయాయి. దాంతో నిరుద్యోగం, దారిద్య్రం అంటున్నారు. కానీ అదే సమయంలో వృత్తి వుద్యోగాలలో ఎన్నో ఖాళీలున్నాయి.
టైలర్ షాపుకి వెళ్లి ఆలస్యమెందుకయిందని అడగండి. టైలర్లు లేరండీ, లోకల్ వాళ్లు రావటం లేదు, ఎక్కడో యుపి నుంచి వచ్చి చేస్తున్నారు అంటారు. జ్యూయలరీ షాపులో అడగండి – బంగారు పనివాళ్లు దొరకలేదంటారు. బ్యూటీ పార్లర్‌లో అడగండి – అక్కడా పనివాళ్ల కొరత, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మాయిలు పని చేస్తున్నారండి. మన వాళ్లకి పని చేసే యింట్రస్టు లేదు అంటున్నారు. హాస్పటల్ పెడితే నర్సుల కొరత, కేరళ నుంచి రావాలంటారు. చాలా షాపుల ముందు, సూపర్ మార్కెట్లలో బోర్డులు కనబడతాయి ‘సేల్స్ మెన్ వాంటెడ్! సేల్స్ గర్ల్స్ వాంటెడ్’ అని. మరి యిలాటి పరిస్థితుల్లో యిక్కడ ఉపాధి అవకాశాలు లేవని, దారిద్య్రం వుందని అంటే ఎవరిది తప్పు? వైట్ కాలర్ జాబ్ తప్ప మరేదీ ఉద్యోగం కాదని, చేయడానికి తగదని అనుకునే మెంటాలిటీ వల్లనే, ఎడాప్టబిలిటీ లేకపోవడం వలన యిది జరుగుతోంది.
ప్రశ్న 02 – తక్కిన దేశాల్లో దారిద్య్రం తగ్గగా లేనిది మన వద్ద ఎందుకు తగ్గటం లేదు?
జవాబు – దారిద్య్రానికి నిర్వచనం మారిస్తే సరి! దరిద్రుణ్ని అని చెప్పుకుని ప్రభుత్వం నుండి రాయితీలు అడగడం మనం జనాలకు అలవాటు చేశాం. దాంతో ప్రతివాడు నేను దరిద్రుణ్ని, వెనుకబడిన వాణ్ని అని చెప్పుకోవడం గర్వంగా ఫీలవుతున్నాడు. దరిద్రుడు అంటే బద్ధకస్తుడు అని స్టాంపు వేస్తే సరి. వాళ్లకు రాయితీలు యివ్వడం ఆపేసి, వాటి బదులు ‘పని కల్పిస్తాం, రండి, వచ్చి పని చేసి డబ్బులు సంపాదించుకోండి.’ అంటే సరి. అప్పుడు ఎవరూ నేను దరిద్రుణ్ని అని చెప్పుకోడు.
ముష్టివాళ్ల కోసం కట్టించిన పునరావాస కేంద్రాలన్నీ ఖాళీగా వుంటాయి. రోడ్లన్నీ ముష్టివాళ్లతో కిటకిటలాడుతూ వుంటాయి. ఎందువలన? అక్కడ వాళ్ల చేత పని చేయిస్తారు. అందుకని వీళ్లు వెళ్లరు. దాని కంటె హాయిగా ముష్టి అడుక్కుంటే బాగు అనుకుంటారు. తక్కిన ఉద్యోగస్తులు సాయంత్రం 6 గంటలకు దుకాణం కట్టేస్తే వీళ్లు రాత్రి 10, 11 గంటల దాకా ‘డ్యూటీ’ చేస్తూనే ఉంటారు. వీధుల్లో ముష్టి ఎత్తనక్కరలేని ముష్టివాళ్లని కూడా మన సమాజం తయారు చేస్తోంది. ‘నువ్వు ఏ పనీ చేయనక్కరలేదు, నీకు ఫలానా వయసు వస్తే చాలు, నువ్వు ఫలానా కులానికి చెందితే చాలు, ఇంటికి నెలనెలా డబ్బు పంపిస్తాం, నీకు ఉచిత రేషన్ యిస్తాం, పెళ్లి చేసుకుంటానంటే మంగళసూత్రం వూరికే యిస్తాం, పిల్లల్ని కంటే వాళ్లను సాకుతాం. నేను దరిద్రుణ్ని అని చెప్పుకో చాలు.’ అని ప్రభుత్వాలు చెప్పడంతో అందరూ నేను దరిద్రుణ్ని నేను దరిద్రుణ్ని అని క్లెయిమ్ చేస్తున్నారు.
ప్రశ్న 03 – వారి మైండ్‌సెట్ మారడానికి మీరిచ్చే సూచనలేమిటి?
జవాబు – నిర్బంధ విద్య వుండాలి. వృత్తివిద్యలు నేర్పించి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అలవర్చాలి. వైట్ కాలర్ జాబ్స్‌పై మోజు తగ్గించాలి. బిపియల్ (బిలో పావర్టీ లైన్) వారికి పరిమితకాలం మూడు నెలలో, ఆరు నెలల వరకే సహాయం చేయాలి తప్ప ఎల్లకాలం ఉచితాలు అందించే పద్ధతి మానుకోవాలి. దరిద్రం అనేది రోగం లాటిది అని ప్రజల మెదడులో గట్టిగా నాటుకోవాలి. అప్పుడే దానిలోంచి బయట పడడానికి శతథా ప్రయత్నిస్తాడు. లేకపోతే ఇంతే! మానసికంగా దరిద్రుడిగా ఉంటాడు.
ప్రశ్న 04 – వారి మైండ్‌సెట్ మారినా దేశంలో ఆర్థిక ప్రగతి జరగాలి కదా? ఆర్థిక ప్రగతిలో పారిశ్రామిక ప్రగతి పాత్ర ఏమిటి? దాని వలన సగటు భారతీయుడు ఏ విధంగా ప్రభావితం అవుతాడు?
జవాబు – పరిశ్రమలు పెరిగితే వస్తూత్పత్తి పెరుగుతుంది. వస్తువుల లభ్యత పెరుగుతుంది. వాటిని స్వంతం చేసుకుని జీవన ప్రమాణం పెంచుకోవాలనే ఆశ పౌరులలో కలుగుతుంది. ఆశలు, అవసరాలు పెంచుకున్నకొద్దీ, వారిలో మరింత సంపాదించి అనుభవించాలనే కోరిక కలుగుతుంది. సంపాదించాలంటే కష్టపడాలి. అందరూ కష్టపడితే ఆటోమెటిక్‌గా ఆర్థికంగా అందరూ బాగుపడతారు. కొనుగోళ్లు పెరిగితే నాణ్యమైన వాటికోసం చూస్తారు. నాసి రకమైనవి మార్కెట్లోంచి తప్పుకుంటాయి. అందువలన ఉత్పత్తిదారులు నాణ్యమైనవే తయారుచేస్తారు.
నాణ్యతా ప్రమాణాలు పెంచుకుంటే ఎగుమతి అవకాశాలు పెరుగుతాయి. ఎగుమతుల వలన దేశ ఆర్థికస్థితి బాగుపడుతుంది. మేలైన, హెచ్చు సామర్థ్యం గల యంత్రాలను, టెక్నాలజీని దిగుమతి చేసుకునేటంత ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయి. ఆ యంత్రాలు ఉత్పాదనను మరింత పెంచుతాయి. ఒక పరిశ్రమ ఓ చోట గట్టిగా వేళ్లూనుకుందంటే దానికి అనుబంధ పరిశ్రమలు అనేకం ఏర్పడతాయి.
ఉదాహరణకు ఆటోమొబైల్ రంగం! కార్ల ఫ్యాక్టరీ ఒకటి వచ్చిందంటే దానిలో వినియోగించే వందలాది విడిభాగాలు తయారుచేసి సప్లయి చేసేవారు, సర్వీసు చేసేవాళ్లు – యిలా అనేక పరిశ్రమలు దాని చుట్టూ పుట్టుకుని వస్తాయి. తమిళనాడు బాగా అభివృద్ధి చెందడానికి యిది ఒక కారణం. అక్కడ ఆటోమొబైల్ పరిశ్రమ వుంది.
మన రాష్ట్రంలో ఐటీ పరిశ్రమకు యిలాటి సౌలభ్యం లేదు. యాన్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చే ఆవకాశం చాలా తక్కువ. అందువలన పరిశ్రమలు రావాలి. అప్పుడే బాగుపడతాం. కానీ మన ఎంఫసిస్ అంతా సర్వీస్ సెక్టార్‌పై వుంది. కాల్ సెంటర్లు ఎన్ని వస్తే మాత్రం ఏం లాభం? వాటికి అనుబంధంగా ఏమీ రావు కదా!
ప్రశ్న 05 – మనదేశపు పరిశ్రమలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏమిటి?
జవాబు – మొదటిది అవినీతి. ఫలానా పరిశ్రమ పెట్టడానికి అనుమతి యిస్తే ఆ ప్రాంతానికి ఏం మేలు జరుగుతుందో నాకు అనవసరం. నాకు ఒరిగేదేమిటి? అని రాజకీయ నాయకుడు చూస్తాడు. తనకు ఆర్థికంగానో, రాజకీయంగానో లాభం లేకపోతే అటువైపు తిరిగి చూడడు. రెండవది రెడ్ టేపిజం. పరిశ్రమకు అనుమతించకపోతే నాకు కలిగే నష్టం ఏముంది? అని బ్యూరోక్రాట్ ఆలోచిస్తాడు. వాళ్లకు ఏ టార్గెట్సూ వుండవు. నీ ఏరియాలో నెలకు యిన్ని యిండస్ట్రీస్ రాకపోతే నీ ఉద్యోగం హుళక్కి అనరు కదా. ఫైలు మీద సంతకం పెట్టి, ఆ తర్వాత ఏవైనా చిక్కులు వస్తే నా పెన్షన్‌కు యిబ్బంది వస్తుంది అనుకుంటాడు సగటు ఉద్యోగి. అందువలన సాధ్యమైనంత వరకు ఏమీ చేయకుండా వుండడానికి చూస్తాడు. ఏవేవో రూల్సు తయారుచేసి, సందర్భం కాకపోయినా వాటిని దీనికి అన్వయించి అడ్డంకులు సృష్టిస్తాడు. మూడోది ఫైనాన్సు. పరిశ్రమ పెట్టే ప్రతివాడిని అనుమానంగా చూస్తారు బాంకర్లు. కొత్తరకం ప్రాజెక్టుతో వెళితే దాన్ని అర్థం చేసుకుని, అంచనా వేయగల సామర్థ్యం వాళ్లకు లేదు. ఎందుకంటే వాళ్ల నాలెజ్‌ను వాళ్లు అప్‌టుడేట్ చేసుకోవడం లేదు.
ప్రశ్న 06 – పరిస్థితి చక్కదిద్దడానికి మీ సలహాలు ఏమిటి?
జవాబు – సింగిల్ విండో సిస్టమ్‌ను నిజంగా అమలు చేయాలి. కమిటీల పేరుతో అనుమతులు కాలయాపన చేయడం మానాలి. సంబంధం లేని చెక్‌లిస్టులు పెట్టి ఉత్సాహం చంపకూడదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రొటోకాల్ పద్ధతుల్లో సంస్కరణలు ప్రవేశపెట్టాలి. అధికారులకు రివిజన్ కోర్సులు పెట్టి సమకాలీన ప్రపంచంలో ఏం జరుగుతోందో నేర్పాలి. వాళ్ల వాళ్ల మనోవల్మీకాల్లోంచి బయటకు లాక్కురావాలి. దంతపు మేడల నుండి కిందకు దింపి సామాన్యుడి దృష్టికోణం నుండి చూడడం నేర్పాలి.
ప్రశ్న 06 – ఔత్సాహికులకు మీరిచ్చే సలహా ఏమిటి?
జవాబు – క్షేత్రస్థాయి వాస్తవాలను ఛాలెంజ్‌గా తీసుకోవాలి. పరిస్థితులు అనుకూలించలేదని నిరాశ పడకూడదు. ఎదురు గాలి వీచినపుడే గాలిపటం పై కెగురుతుందని గ్రహించాలి. ఓపిక, ఓర్పు రెండూ వుండాలి. నాణ్యతపై రాజీ పడకూడదు. బ్రాండ్ ఇమేజ్ – మనదీ, మన దేశానిదీ కాపాడుకోవాలి. సంఘ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసిన వాడిదే జయం. వెంటవెంటనే లాభాలు కురవక పోవచ్చు కానీ మీ విస్తృతి పెరుగుతుంది, పదికాలాల పాటు రంగంలో వుంటారు. గుర్తింపూ వస్తుంది.
ఇదీ ఆనాటి ఇంటర్వ్యూ. తర్వాతి కాలంలో సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని పెరిగాయి. మరింత ఎక్కువగా సోమరులను తయారు చేస్తున్నారు. ‘ఇక్కడ కష్టపడితే రూపాయిలు మాత్రమే వస్తాయి. అక్రమంగా నైనా అమెరికాలో దూరి యిదే కష్టం పడితే డాలర్లు కురుస్తాయి.’ అనే ఆలోచనతో రిస్కు తీసుకుని ఆపదలు కొని తెచ్చుకుంటున్నారు. ఫలితంగా యిక్కడ మనకు పని వాళ్లు దొరకటం లేదు. అక్కడ అక్రమంగా పని చేసే వాళ్లను వెతికి పట్టుకోవడానికి సిబ్బంది చాలటం లేదు!
– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)
Impossible
మీ లాంటి దరిద్రుల కోసమే ఇలాంటి ఆర్టికల్స్.నిద్ర పోయేముందు గుండెల మీద చెయ్యి వేసుకొని ఒక్క నిముషం నీకు నువ్వు ఆలిచించుకో..
vodileyandi papm ..
idhi daridrulu vunna desam. daaridhyram nirmoolinchochu but daridrulanu kaadu.
Up, బెంగాల్, రాజస్థాన్, బీహార్,MP.. ఈ అయిదు రాష్ట్రాల సత్వర అభివృద్ధి మీద కేంద్రం దృష్టి పెట్టాలి.మిగతా రాష్ట్రాల వాళ్ళు ఉపాధి,ఉద్యోగ ,వృత్తి పనుల కోసం ఈ రాష్ట్రాలకి కూడా రాక పోకలు సాగించాలి.ఇక్కడ పెద్ద ఎత్తున మానవ వనరులు ఉన్నాయి..ఇవి develop అయితే ఇండియా వేరే లెవెల్!
సూపర్ సిక్స్ హామీలు అని ఏడిచే బ్యాచ్ కి ఆర్టికల్ మంచి సమాధానం, ..
ఆంధ్ర లో రెడ్ల దోపిడీ ,తెలంగాణ లో వెలమల దోపిడీ అరికడితే సాధ్యమే …
ఆంధ్ర లో రెడ్ల దో!పి!డీ ,తెలంగాణ లో వెలమల దో!పి!డీ అరికడితే సాధ్యమే …
ఆంధ్ర లో రె!డ్ల దోపిడీ ,తెలంగాణ లో వెలమల దోపిడీ అరికడితే సాధ్యమే …
సొంతగా తినడానికి తిండి లేకపోయినా సరే, పం*ది లా లెక్కన వరుసగా పిల్లల్ని కనీస దేశం మీదకి వదిలేసి , ఓట్ల కోసం ఫ్రీ పథకాలు పేరుతో, వాళ్ళని మెపడానికి మిగతా జనాలు కష్టపడాల్సి వస్తుంది.
తినడానికి తిండి లేనివాళ్ళ్లి కి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు యెందుకు కనాలి?
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
సూపర్ పోస్ట్ సార్ కొంత మంది అయిన ఆలోచిస్తారు
వరప్రసాద్ గారు,
మీ వ్యాఖ్యానికి రెండు ముక్కలు జోడించదలచాను. మీరు ఆశించిన మార్పు మన దగ్గర బళ్ల నుంచే మొదలవ్వాలి 1.) బళ్ల లో మన చదువులు infomation dump గానే మిగిలిపోయాయి. వృద్ధి చెందిన దేశాలలో 12 తరగతికి సాధించిన కార్య పరిణితి మన దగ్గర డిగ్రీ తరువాత కూడా రావటం లేదు. ఏ వ్యవస్థ అయినా దాని లీడర్ ని బట్టీ అది రాణిస్తుంది. విద్యచెప్పేవారంటే దొడ్లు/అంట్లు శుభ్రంగా ఉన్నాయో లేవో చూసే వంటి బాధ్యతలనుంచి విముక్తి కలిగించాలి. విద్యా వ్యవస్థలో కేవలం బాగా చదువుకున్న వారిని leadershp లో ఉంచేందుకు ఒక చట్టం రావాలి. అంటే గవర్నమెంట్ బదులు UGC లాంటి బోర్డులు మాత్రమే విద్యాలయాలకు leadership nominate చెయ్యాలి. మన వద్ద విద్యతో పాటు administration బాగా తెలిసిన వారికి కరువు ఏమీ లేదు.2.) మన భారతదేశంలో వ్యాపారస్తుడు/కాబోయే వ్యాపారస్తుడు అనగానే వాడిని ఒక ATM గా చూడటం పరిపాటి. దానికి మూలం ఏమిటో తెలియదు. మన దగ్గర పెట్టుబడి విధానం అంటే వడ్డీ వ్యాపారమే కానీ పెట్టుబడి పెట్టేవారినుంచి ఆ వ్యాపారికి సంబంధంచి ఏ పరిజ్ఞానం అందదు/ఉండదు. అది మారటానికి ఏమీ చెయ్యాలో మీబోటివారు చూచిస్తే ఉపయుక్తంగా ఉంటుంది.