ఒక‌రి మీదే మ‌న‌సు ఉండటం సాధ్య‌మేనా?

పెళ్లి, కుటుంబం, సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు.. ఇవ‌న్నీ పైకి క‌నిపించేవి. అయితే మ‌న‌స‌నేది వీట‌న్నింటికీ అతీత‌మైన‌ది

మ‌నిషి కూడా నిస్సందేహంగా ఒక జంతువే! భూమిపై ప‌రిణామక్ర‌మంలో ఆవిర్భ‌వించిన జంతువుల్లో మ‌నిషి కూడా ఒక‌డు. మ‌నిషి కూడా జంతువుల స‌హ‌చ‌ర్యంలో ఎన్నో సంవ‌త్స‌రాలు గ‌డిపాడు. మ‌నిషిని అత‌డు తినే తిండి ఇత‌ర జంతువుల నుంచి వేరు చేసింద‌నేది ఒక థియ‌రీ. మ‌నిషి చేప‌ను తిన‌డం మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి అత‌డిలో మెడ‌దు అభివృద్ధి చెందింద‌ట‌! ఇలాంటి థియ‌రీలు ఏవైనా.. ఎన్నున్నా మ‌నిషి కూడా జంతుజాలంలో ఇప్ప‌టికీ భాగ‌మే. అయితే ఏ జంతువుకూ లేని భ‌వబంధాలు చాలా వ‌ర‌కూ మ‌నిషికే ఉంటాయి.

బాధ్య‌త‌లు, హ‌క్కులూ, బంధాలు.. ఇవ‌న్నీ మ‌నిషి ఏర్పాటు చేసుకున్న క‌ట్టు బాట్లు. ఈ క‌ట్టుబాట్ల మేర‌కే జీవించాల‌ని సంఘం చెబుతుంది. మ‌నిషి సంఘం క‌ట్టుబాట్లు మ‌నిషిని చాలా వ‌ర‌కూ దారిన పెట్టాయి. లేక‌పోతే మ‌నిషికి ఉన్న మెద‌డు అనే ప‌ద‌నునైన ఆయుధం ఇంకా ఎన్నో వినాశనాల‌ను క్రియేట్ చేసేదన‌డంలో కూడా ఆశ్చ‌ర్యం లేదు.

ఇవ‌న్నీ ఎలా ఉన్నా.. మ‌నిషి మ‌న‌సు లైంగికార్ష‌ణ‌ల్లో నిజంగానే నియంత్ర‌ణ‌ల్లో ఉంటుందా అంటే మాత్రం.. ఉంద‌ని అనేసుకోవ‌డం సుల‌భం! ఉండ‌నేది వాస్త‌వం! వాస్త‌వాల‌ను అంగీక‌రించ‌క మ‌నుగ‌డ సాగించ‌డ‌మే సంఘం పెట్టిన క‌ట్టుబాట్ల‌లో ఒక‌టి కాబ‌ట్టి.. మ‌నిషి అలాంటి వాస్త‌వాల‌ను మ‌న‌సులోనే తొక్కిపెట్టి.. పైకి జీవించేస్తూ ఉంటాడు!

ప్ర‌తి మ‌నిషీ జీవితంలో చాలా సార్లు ప్రేమ‌లో ప‌డ‌తాడ‌ని శాస్త్రీయ‌మైన అధ్య‌య‌నాలు కూడా చెబుతూ ఉంటాయి. జీవితంలో వివిధ ద‌శ‌ల్లో మ‌నిషి అనేక మంది ప‌ట్ల ఇష్టాన్ని పెంచుకుంటాడు. వారిలో ఒక్కోరితో ఒక్కో ర‌క‌మైన బంధాన్ని కోరుకుంటాడ‌నేది చాలా మంది ఒప్పుకునే వాస్త‌వం. అయితే మ‌నిషి ఒక‌రినే పెళ్లి చేసుకుని.. వారికే క‌ట్టుబ‌డి ఉండాల‌నేది సంఘం పెట్టిన నియమం. దాన్ని మ‌నిషి పాటిస్తాడు కూడా చాలా వ‌ర‌కూ. అయితే మ‌న‌సు మాత్రం వేరే! మనసులో మ‌నిషికి అనేక ప్రేమ‌క‌థ‌లు ఒక‌రేసారి సాగుతూ ఉంటాయి. వీటిని బ‌య‌ట‌కు తీసుకొచ్చే వారిని స‌మాజం భిన్నంగా చూస్తుంది. అయితే వారి ఆర్థిక శ‌క్తిని బ‌ట్టి వారిని ట్రీట్ చేసే విధానం మారుతూ ఉంటుంది.

స‌మాజ పోక‌డ‌ల‌ను గ‌మ‌నిస్తే.. దాదాపు నాలుగు ద‌శాబ్దాల కింద‌టి వ‌ర‌కూ కూడా ఆర్థిక శ‌క్తి ఉన్న స్థితిమంతుడు రెండు పెళ్లిళ్లు చేసుకున్నా అప్పుడు ఆమోదించేది! భార‌తీయ స‌మాజంలో కూడా బ‌హుభార్య‌త్వం చాలా స‌హ‌జం. ఆర్థికంగా స్థితిమంతులే గాక‌.. అప్ప‌టి సామాజిక ప‌రిస్థితుల్లో బ‌హుభార్య‌త్వం చాలా స‌హ‌జం అన్న‌ట్టుగా సాగేది. అయితే అంత‌కు ముందు ఎన్నో యేళ్ల నుంచి స్త్రీకి మాత్రం అలాంటి అవ‌కాశాలు ఉండేవి కావ‌ని కూడా చ‌రిత్ర చెబుతూ ఉంది.

ఆది నుంచి పురుష స్వామ్య వ్య‌వ‌స్థ కావ‌డంతో.. పురుషాధిక్యం మేర‌కు బ‌హుభార్య‌త్వం స‌హజంగా సాగింది. అయితే ఎక్కువ‌మంది భార్య‌ల‌ను పోషించే శ‌క్తి మ‌గాడికి క్ర‌మంగా త‌గ్గింది. దీంతో ఇప్పుడు సొసైటీలో బ‌హుభార్య‌త్వం లేదు. ఒక‌వేళ ఆర్థికంగా శ‌క్తి ఉన్నా.. భార్య‌కు విడాకులు ఇచ్చి భ‌ర‌ణాలు చెల్లించి రెండో పెళ్లి చేసుకోవ‌చ్చు కానీ.. ఒకే కొంప‌లో రెండు కాపురాల‌ను పెట్టే శ‌క్తి ఉన్న మ‌గాడు ప్ర‌స్తుత స‌మాజంలో క‌న‌ప‌డ‌డు. సామాజిక ప‌రిస్థితులు అలా మారాయి.

అయితే సామాజిక ప‌రిస్థితులు మారినా మ‌గాడి తీరు మార‌ద‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. అయితే క‌ట్టుబాట్లు క్ర‌మ‌క్ర‌మంగా మ‌నిషి తీరును మారుస్తాయి. దీంతో ప‌క్క‌చూపుల‌ను చూడ‌టం త‌ప్పు అనే భీతి వ‌ల్ల కొంద‌రు ఆగిపోతారు. కొంద‌రు ఆ భీతిని జ‌యించి మార్గాల‌ను చూసుకుంటూ ఉంటారు!

అయితే మ‌న‌స‌నేది మ‌గాడికే కాదు, స్త్రీకి కూడా ఉంటుంది. అయితే ఆమెను సామాజిక క‌ట్టుబాట్లు మ‌రింత‌గా ప్ర‌భావితం చేశాయి. శ‌తాబ్దాల నుంచి వ‌స్తున్న క‌ట్టుబాట్లు, సంప్ర‌దాయాల న‌వీన త‌రాల‌ను కూడా ప్ర‌భావితం చేస్తూ వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం రోజులు మారిపోయాయి. స్త్రీ కోరుకుంటే ఇప్పుడు అవ‌కాశాలు పెరిగాయి. కాలేజీ రోజుల్లో త‌మ ప్రేమ‌క‌థ‌ల‌ను క‌లిగి ఉండ‌టం .. వాటిని తర్వాతి కాలంలో త‌న‌కు ప‌రిచ‌యం అయ్యే స్నేహితుల‌కు చెప్పే అర్హ‌త‌లు కేవ‌లం మ‌గాడికే కాదు, అలాంటి అనుభ‌వాలు స్త్రీకి కూడా ఉంటున్న రోజులివి.

అయితే మ‌గాడు త‌న మ‌గ‌త‌నం కోసం చెప్పుకుంటాడు, ఆడ‌ది త‌న ఆడ‌త‌నం కాపాడుకోవ‌డానికి దాచుకుంటుంది అంతే తేడా! పెళ్లి, కుటుంబం, సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు.. ఇవ‌న్నీ పైకి క‌నిపించేవి. అయితే మ‌న‌స‌నేది వీట‌న్నింటికీ అతీత‌మైన‌ది. మాన‌సికంగా అయినా క‌ట్టుబాట్ల‌కు భిన్న‌మైన ఆలోచ‌నలు ఉండ‌నే ఉంటాయి మ‌నిషికి. అది అత‌డిలోని జంతుప్ర‌వృతి. అది మాన‌వ మ‌నుగ‌డ ఉన్నంత కాల‌మూ కొన‌సాగుతుంది కూడా!

మ‌నసారా ప్రేమించే భార్య ఉన్నా, పిల్ల‌లున్నా.. మ‌గాడికి మ‌రో స్త్రీ మీద ఆక‌ర్ష‌ణ పోదు. ఆ దృష్టితో చూడ‌ట‌మూ ఆప‌డు! ఇలాంటి క‌ట్టుబాట్ల మ‌ధ్య‌నే ఉన్నా త‌న జీవితంలో కోల్పోయిన వాటి గురించి స్త్రీ బాధా పోదు!

8 Replies to “ఒక‌రి మీదే మ‌న‌సు ఉండటం సాధ్య‌మేనా?”

  1. నువ్వూ అంతేగా G A… మొన్నటి దాకా నీ గుండెల్లో Y C P ఉండేది…ఇప్పుడు నువ్వు కూడా పక్క చూపులు చూస్తున్నట్లు అనిపిస్తుంది

  2. ఆడది అర్థ గంట తన శరీరం మీద ఆలోచన నీ విడిచి పెట్టి ,

    ఈ దేహం తనది కాదనుకుంటే ..

    మగవాడి మగతనం . విలువ రెండూ చచ్చినట్టే ..

    ఇక మగాడు బతికున్న చచ్చినట్టే..

    చచ్చిన శవం తో ఆడది సంసారం చేయదు.

    చచ్చే ముందు అసలే కుదరదు.

  3. ఆడది అర్థ గంట తన శరీరం మీద ఆలోచన నీ విడిచి పెట్టి ,

    ఈ దేహం తనది కాదనుకుంటే ..

    మగవాడి మగతనం . విలువ రెండూ చ చ్చినట్టే ..

    ఇక మగాడు బతికున్న చ చ్చినట్టే..

    చ చ్చి న శ వం తో ఆడది సంసారం చేయదు.

    చ చ్చే ముందు అసలే కుదరదు.

Comments are closed.