‘సచిన్ టెండూల్కర్ గొప్ప ఆటగాడే.. కాదనలేం.. అయినా అతను భారతీయుడు.. అందుకే అతని గురించి ఓవరాక్షన్ ఆపండి..’ అంటూ మీడియాకి తాలిబన్లు హుకూం జారీ చేశారు. పాకిస్తాన్ మీడియా సచిన్ టెండూల్కర్ రిటైర్‌మెంట్‌పై పెద్దయెత్తున కథనాల్ని ప్రసారం చేస్తోండడం తాలిబన్లకు నచ్చడంలేదు మరి.
ఒక్క పాకిస్తానే కాదు.. మొత్తం ప్రపంచమంతా గత నెల రోజులనుంచీ సచిన్ గురించే మాట్లాడుకుంటోంది. సచిన్‌ని ఓ భారతీయుడిగా మాత్రమే ఎవరూ చూడటంలేదు. అతన్ని క్రికెట్ దేవుడిగా క్రికెట్ అభిమానులు పూజిస్తున్నారు. భారత్‌తో క్రికెట్ పరంగా బద్ధ వైరం వున్న పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ సచిన్‌కి పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఎక్కడిదాకానో ఎందుకు, పాకిస్తాన్ జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా సంచలనాలు సృష్టించిన మేటి బౌలర్లు సచిన్‌కి వీరాభిమానులు. ఆస్ట్రేలియాలో బ్రెట్‌లీ తదితరులు సచిన్‌తో ఆడటం తమకు దక్కిన గౌరవంగా చెప్పుకున్నారు.
మైదానంలో వైరం సంగతెలా వున్నా, సచిన్‌తో వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. దటీజ్ సచిన్. అలాంటి సచిన్‌ని పాకిస్తాన్‌లో అయినా, ఆఫ్ఘనిస్తాన్‌లో అయినా, బంగ్లాదేశ్‌లో అయినా, ఇంకెక్కడైనా అభిమానించేవారు ఎందుకు వుండరు.? వారిని కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వం.
తాలిబనిజం అంటేనే మూర్ఖత్వం.. అనే అభిప్రాయం అందరిలోనూ వుంది కాబట్టి, సచిన్ విషయంలో తాలిబన్లు ఇంతకన్నా భిన్నంగా స్పందించలేరు. ఇదిలా వుంటే, సచిన్‌ని సౌత్ ఏషియాలో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది యునిసెఫ్. అదీ సచిన్ అంటే.