టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్- ఫోర్ట్ వర్త్ నగరం తెలుగు సంగీత, సాహత్య, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. డాలస్ అంటే అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారందరికీ “రాజధాని” గా పలువురు అభివర్ణించిన సందర్భాలు ఎన్నో. ఇక్కడ నివసించే తెలుగువారికి కమ్మనైన అమ్మ భాషంటే ప్రాణం. తెలుగు కళలంటే ఇంకా మక్కువ ఎక్కువ. అందుకే భాషకు పట్టాభిషేకం, సాహిత్యానికి అగ్ర తాంబూలం, కళలకు మంగళ హారతులు మన తెలుగు వారు నిత్యం అందిస్తూనే ఉన్నారు.
తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు 1986 లో అధికారికంగా స్థాపించబడిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అంటే “టాంటెక్స్”, స్థానిక సంస్థ తెలుగువారికి అండగా ఉంటూ అన్నీ జాతీయ సంస్థలకు ధీటుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది. బీజాక్షరాలు నాటి సంస్థకు గట్టి పునాది వేసి తెలుగు వారి అవసరాలను తీర్చే కార్యక్రమాలను నిర్వహించడంలో టాంటెక్స్ నాయకత్వం సఫలీ కృతం అయ్యిందనే చెప్పుకోవాలి.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, 2015 సంవత్సారానికి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 2015-అధ్యక్షుడిగా డా.ఊరిమిండి నరసింహారెడ్డి పదవి బాధ్యతలు స్వీకరిస్తూ “ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘంలో దాదాపు 25 సంవత్సరాల క్రితం ఒక సభ్యుడిగా సంస్థలో ప్రవేశించి, సేవకుడిగా, పోషకుడిగా, బోధకుడిగా, పాలకుడిగా, సేవలందించి ఇంతటి అత్యున్నత సంస్థకు నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను” అని మరియు ఆ పదవికి పూర్తి న్యాయం చేస్తానని వారి పరిచయ ప్రసంగంలో పేర్కొన్నారు.
తెలుగు భాషా పరిరక్షణ, భావి తరాలకు మన భాష మరియు సంస్కృతి ఔన్నత్యం కోసం ప్రత్యేక కృషి చేస్తానని ఆయన తెలియ చేసారు. వినూత్నకార్యక్రమాలతో డల్లాస్ తెలుగు ప్రజలకి చేరువ అవతామని తెలిపారు. సాంస్కృతిక అవసరాలతో పాటు మారుతున్న మన సభ్యుల అవసరాలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను రూపుదిద్దుకోవడం ఎంతైనా అవసరం.
అధికారిక కార్యనిర్వాహక బృందం
అధ్యక్షుడు : డా.ఊరిమిండి నరసింహారెడ్డి
ఉత్తరాధ్యక్షుడు: జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం
ఉపాధ్యక్షుడు : ఉప్పలపాటి కృష్ణా రెడ్డి
కార్యదర్శి : ఆదిభట్ల మహేష్ ఆదిత్య
సంయుక్త కార్యదర్శి : వీర్నపు చిన్నసత్యం
కోశాధికారి: శీలం కృష్ణవేణి
సంయుక్త కోశాధికారి: పావులూరి వేణుమాధవ్
తక్షణ పూర్వాధ్యక్షులు: కాకర్ల విజయ మోహన్ ,
అజయ్ గోవాడ, చంద్రశేఖర్ కాజ, జ్యోతి వనం, కృష్ణారెడ్డి కోడూరు, లక్ష్మి పాలేటి, నీరజ పడిగెల, ప్రవీణ్ బిల్లా, రఘు గజ్జల, శారద సింగిరెడ్డి, శశికాంత్ కనపర్తి, శ్రీలక్ష్మి మందిగ, సునీల్ దేవిరెడ్డి, వెంకట్ దండ.
పాలకమండలి బృందం
అజయ్ రెడ్డి (అధిపతి), సుగన్ చాగర్లమూడి (ఉపాధిపతి),
రామకృష్ణా రెడ్డి రొడ్డ, రమణ పుట్లూర్, శ్యామల రుమాళ్ళ, శ్రీనివాస్ బావిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గుర్రం
తమ పదవీ బాధ్యతలు స్వీకరించిన డా.ఊరిమిండి నరసింహారెడ్డి “ 2015వ సంవత్సరములో మన సభ్యుల విజ్ఞానం, వినోదం తో పాటు పెరుగుతున్న సభ్యుల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపు దిద్దడానికి నూతనోత్సాహంతో మీముందుకు వస్తున్నాము. చేపట్టబోవు ప్రధాన కార్యక్రమాలను క్లుప్తంగా ఇక్కడ అందిస్తున్నాము.
- కార్యక్రమాల నాణ్యత పెంచడం, తద్వారా సంస్థ కార్యక్రమాలపై సభ్యుల ఆసక్తి పెంచడం
- అత్యవసర పరిస్థితులలో ఆదుకునేందుకు అవసరమైన ప్రాధమిక విజ్ఞాన సదుపాయాలు సమకూర్చడం
- గణనీయంగా పెరుగుతున్న స్థానిక కళాకారులకు అవసరమైన వేదికలు కల్పించడం
- నూతన సాంకేతిక ఉపకరణాల ద్వారా సంస్థ కార్యక్రమాల సమాచారాన్ని తక్షణమే అందించడం
- యువత వ్యక్తిత్వ వికాస పురోభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను ప్రవేశపెట్టడం
- వయసు మీరిన పెద్దల జీవన సరళికి అవసరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం
- సంస్థ పరిధిలో ఉన్న తెలుగు వారి మధ్య సఖ్యత పెంచడం
- స్థానిక విశ్వవిద్యాలయాలలో ప్రవేశిస్తున్న తెలుగు విద్యార్థులకు సంస్థపై అవగాహన పెంచి, భాగస్వామ్యం కల్పించడం
- నూతనంగా స్థిరపడుతున్న అసంఖ్యాక తెలుగు కుటుంబాల సభ్యత్వంతో సంస్థ సంఖ్యాబలం హెచ్చించడం
- మనమంతా ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న టాంటెక్స్ స్వంత భవనం కోసం కావలసిన ఆమోదం పొందడం
2014 సవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా ఇటీవలే పదవీ విరమణ చేసిన తక్షణ పుర్వాధ్యక్షుడు కాకర్ల విజయ మోహన్ మాట్లాడుతూ “ గత సంవత్సరంలో భాషా సంస్కృతులతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలతో మన సంస్థ సభ్యుల అవసరాలకు అనుగుణంగా పురోభివృద్ది సాధించింది అనడంలో ఆశ్చర్యం లేదు. డా.ఊరిమిండి నరసింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను”.
మరిన్ని వివరాలకు www.tantex.org సందర్శించండి.