చెట్టుపేరు చెప్పేస్తున్న బోలేనాధ్

కార్తికేయ సినిమా కు నిర్మాత బి శ్రీనివాస్. బ్యానర్ మాగ్నస్ సినీ ప్రైమీ ప్రయివేట్ లిమిటెడ్. అయితే ఈ సినిమాతో బదరాయణ సంబంధం వుంది అది ఆ సినిమా సమర్పకుడు చిర్రావూరి రాజేష్ వర్మ…

కార్తికేయ సినిమా కు నిర్మాత బి శ్రీనివాస్. బ్యానర్ మాగ్నస్ సినీ ప్రైమీ ప్రయివేట్ లిమిటెడ్. అయితే ఈ సినిమాతో బదరాయణ సంబంధం వుంది అది ఆ సినిమా సమర్పకుడు చిర్రావూరి రాజేష్ వర్మ ఈ సినిమాకు నిర్మాత కావడం. అందుకే ఇప్పుడు, మా సంస్థ నుంచి వచ్చిన కార్తికేయ అని అనేస్తున్నారు. 

ఆయన బ్యానర్ పేరు ఆర్.సి.సి ఎంటర్‌టైన్‌మెంట్స్. కానీ తప్పదు ఏదో ఒకటి చెప్పకుంటే మార్కెట్ కావడం కష్టం కదా? ఆయన నిర్మిస్తున్న ‘భమ్ బోలేనాథ్’ లో నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ కథానాయకులు. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకుడు. పూజ, ప్రాచీ కథానాయికలు. 

ఈ నెల 23న  ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ . పూర్తి వినోదాత్మక చిత్రమిది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా  ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంది. ముగ్గురు వ్యక్తుల జీవితాలు, మూడు కథలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అందరికి నచ్చుతుందనే విశ్వాసముంది’ అని అన్నారు.

 నిర్మాత మాట్లాడుతూ ‘ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశలో వున్నాయి. సెన్సారు పూర్తిచేసి ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.