ఈడెన్ తొలి సెషన్ లో భారత్ బోల్తా!

సొంత గడ్డపై ఆడుతున్న 250 వ టెస్టు మ్యాచ్ తొలి సెషన్ లో భారత్ బ్యాట్స్ మన్ బోల్తా పడ్డారు. కివీస్ పేస్ అటాక్ కు భారత్ టాప్ ఆర్డర్ తల వంచింది. 27…

సొంత గడ్డపై ఆడుతున్న 250 వ టెస్టు మ్యాచ్ తొలి సెషన్ లో భారత్ బ్యాట్స్ మన్ బోల్తా పడ్డారు. కివీస్ పేస్ అటాక్ కు భారత్ టాప్ ఆర్డర్ తల వంచింది. 27 ఓవర్లకే ఇండియా మూడు వికెట్లు నష్టపోయి ఇబ్బందుల్లో పడింది. లంచ్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా.

ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. పది బంతులాడిన ధావన్ హెన్రీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. తర్వాత పదకొండో ఓవర్ లో విజయ్ వెనుదిరిగాడు. తొమ్మిది పరుగులకు ఇతడు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ కొహ్లీ, పూజారాలు కలిసి మరో పది ఓవర్ల పాటు ఆచితూచి ఆడారు. కానీ కొహ్లీ మరోసారి విఫలమయ్యాడు. తొమ్మిది పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 21వ ఓవర్ లోనే కొహ్లీ వికెట్ కోల్పాయాకా రహనే, పూజారాలు జత కలిశారు. లంచ్ వరకూ మరో వికెట్ పడకుండా వీరు జాగ్రత్త పడ్డారు.

కివీ  బౌలర్లలో హెన్రీ రెండు వికెట్లు తీసుకోగా, బోల్ట్ కు ఒక వికెట్ పడింది. తొలిటెస్టులో రాణించిన పూజారా, రహనేలు క్రీజ్ లో ఉండటం విశ్వాసాన్ని కలిగించే అంశం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ను ఎంచుకుంది. కేఎల్ రాహుల్ బదులు జట్టులోకి వచ్చిన గంభీర్ కు ఫైనల్ 11 లో స్థానం దక్కలేదు. అతడి బదులుగా ధావన్ ను ఎంచుకున్నాడు కొహ్లీ.