ఎంతైనా సీనియర్ సీనియరే.. మైదానంలో అతను కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లు చేయగలిగిందేమీ వుండదు. అతనే మహేల జయవర్దనే. జట్టు కష్టాల్లో వున్న సమయంలో బ్యాటింగ్‌కి దిగిన జయవర్ధనే తన అనుభవాన్నంతా ఉపయోగించాల్సి వస్తోంది ‘పసికూన’ ఆప్ఘనిస్తాన్ బౌలింగ్ ఎటాక్‌ని తట్టుకోవడానికి. కెప్టెన్ మాథ్యూస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు జయవర్ధనే.
సరిగ్గా సెంచరీ కొట్టి జయవర్ధనే ఔటయ్యాడు. అంతకు ముందే మాథ్యూస్ కూడా ఔట్ అవడంతో ఒక్కసారిగా మ్యాచ్, మళ్ళీ ఆప్ఘనిస్తాన్ చేతుల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది శ్రీలంక. విజయానికి ఇంకా 42 పరుగుల దూరంలో వుంది శ్రీలంక. అదే సమయంలో నాలుగు వికెట్లు తీయగలిగితే ఆఫ్గనిస్తాన్ సంచలన విజయాన్ని సొతంచేసుకుంటుంది.
ఈ పరిస్థితుల్లో మ్యాచ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. జయవర్ధనే క్రీజ్‌లో వున్నంతవరకూ లంక అభిమానులు స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు. అతను ఔట్ అయ్యాక అభిమానులు ఒక్కసారిగా సైలెంటయిపోయారు. ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్ళు మాత్రం సంబరాల్లో మునిగితేలుతున్నారు.