సౌతాఫ్రికా స్పెషాలిటీనే అది.!

ప్రపంచ క్రికెట్‌కి ఫీల్డింగ్‌ పాఠాలు చెప్పిన జట్టు అది. మైదానంలో మెరుపులా కదలడమెలాగో సౌతాఫ్రికా ఆటగాళ్ళను చూసి నేర్చుకోవాల్సిందే. వేరే ఏ జట్టులోనూ లేనంతమంది ఆల్‌రౌండర్స్‌ సౌతాఫ్రికా జట్టులో వుంటారు. షాన్‌ పోలాక్‌, కలిస్‌..…

ప్రపంచ క్రికెట్‌కి ఫీల్డింగ్‌ పాఠాలు చెప్పిన జట్టు అది. మైదానంలో మెరుపులా కదలడమెలాగో సౌతాఫ్రికా ఆటగాళ్ళను చూసి నేర్చుకోవాల్సిందే. వేరే ఏ జట్టులోనూ లేనంతమంది ఆల్‌రౌండర్స్‌ సౌతాఫ్రికా జట్టులో వుంటారు. షాన్‌ పోలాక్‌, కలిస్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే, సౌతాఫ్రికా ప్రపంచ క్రికెట్‌లో ఆల్‌రౌండర్ల పరంగా అద్భుతమైన జట్టు అనే చెప్పాలి.

ఏ తరానికి ఆ తరం గొప్ప.. అన్న చందాన సౌతాఫ్రికా జట్టులో మెరుపులాంటి ఫీల్డర్లు వస్తుంటారు. జాంటీ రోడ్స్‌ నుంచి డివిలయర్స్‌ దాకా ఒకరు తక్కువ.. ఒకరు ఎక్కువ అని చెప్పడానికి వీల్లేదు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌ అంటే.. సిక్సర్లు, బౌండరీల మీద ఆధారపడొచ్చేమోగానీ, సింగిల్స్‌, డబుల్స్‌ అంటే అంత చిన్న విషయం కానే కాదు.

మైదానంలో పరుగులు తీయడం అత్యంత కష్టం సౌతాఫ్రికాతో ఏ టీమ్‌కి అయినాసరే. టీమిండియా కూడా ఇప్పుడే అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. పరుగులు రావడమే గగనమైపోయింది. అడపా దడపా బౌండరీలు తగులుతున్నా, అవేవీ భారత స్కోర్‌ బోర్డ్‌ వేగాన్ని పెంచడంలేదు. రెండు పరుగులు రావాల్సిన చోట ఒకటి, మూడు పరుగులు రావాల్సిన చోట నాలుగు.. ఇలా సాగుతోంది సౌతాఫ్రితో టీమిండియా తలపడ్తున్న మ్యాచ్‌.

ఓపెనర్‌ రోహిత్‌ శర్మ డకౌట్‌ కాగా, మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. శిఖర్‌ ధావన్‌ అర్థ సెంచరీ చేయగా, కోహ్లీ కూడా బాధ్యతాయుతంగానే ఆడుతున్నాడు. పరుగుల వేగం మందగించినా, ఇంకో వికెట్‌ పడకుండా ఆడటమూ ముఖ్యమే. 21 ఓవర్లలో టీమిండియా 87 పరుగులు చేయగలిగింది. మొత్తంగా ఓ 25 పరుగులైనా అద్భుత ఫీల్డింగ్‌తో సౌతాఫ్రికా ఆపేసి వుండొచ్చు. దటీస్‌ సౌతాఫ్రికా.