లంక గెలిచింది

అద్భుతాలేం జరగలేదు.. సంచలనాలకు తావివ్వలేదు.. కాస్త భయపెట్టినా, చివర్లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతులెత్తేసింది. దాంతో, లంక కష్టంగానే అయినా విజయం సాధించింది. ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక, ఓటమి కోరల్లో చిక్కుకుని, బయటపడటం విశేషమే. Advertisement…

అద్భుతాలేం జరగలేదు.. సంచలనాలకు తావివ్వలేదు.. కాస్త భయపెట్టినా, చివర్లో ఆఫ్ఘనిస్తాన్‌ చేతులెత్తేసింది. దాంతో, లంక కష్టంగానే అయినా విజయం సాధించింది. ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక, ఓటమి కోరల్లో చిక్కుకుని, బయటపడటం విశేషమే.

కీలక సమయంలో సత్తా చూపిన జయవర్ధనేకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ లభించింది. చివర్లో పెరీరా మెరుపు వేగంతో, శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. 233 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆరు వికెట్లను కోల్పోయింది. 51 పరుగులకు నాలుగు వికెట్లు తీసిన ఆప్ఘనిస్తాన్‌ పోరాట పటిమను ఎవరైనా అభినందించాల్సిందే.

ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే ఓ మ్యాచ్‌ ఓడిన శ్రీలంక, ఆప్ఘనిస్తాన్‌తో గెలిచి, లీగ్‌ దశను దాటేందుకు తగినంత శక్తిని కూడగట్టుకుంది. ఓడినా లంకకు షాకిచ్చిన ఆఫ్గనిస్తాన్‌, తదుపరి మ్యాచ్‌లలో అయినా ఓడిరచే పవర్‌ పంచ్‌ ఇస్తుందేమో వేచి చూడాలి.