ఇది బ్రెయిన్ వయాగ్రా

టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎన్నో రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ మెదడును నియంత్రించే ఔషధం మాత్రం రాలేదు. తెలివితేటలు పెంచే మందు మాత్రం కనిబెట్టలేకపోయారు. ఇప్పుడు ఆ దిశగా కూడా అభివృద్ధి సాధించారు…

టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎన్నో రకాల మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ మెదడును నియంత్రించే ఔషధం మాత్రం రాలేదు. తెలివితేటలు పెంచే మందు మాత్రం కనిబెట్టలేకపోయారు. ఇప్పుడు ఆ దిశగా కూడా అభివృద్ధి సాధించారు అమెరికా శాస్త్రవేత్తలు. దీనికి బ్రెయిన్ ప్లస్ ఐక్యూ అనే పేరుపెట్టారు.

వయాగ్రా ఎలాగైతే సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుందో.. ఈ బ్రెయిన్ ప్లస్ ఐక్యూ మందు కూడా మెదడును ఉత్తేజపరుస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. అందుకే దీన్ని కొంతమంది “బ్రెయిన్ వయాగ్రా”గా కూడా పిలుస్తున్నారు. ఇకపై తెలివితేటలు ఎవడి సొత్తు కాదు.. అందరూ సమానమే అంటోంది బ్రెయిన్ ప్లస్ మందును తయారుచేసిన కంపెనీ.

ఎన్ జడ్ టీ-48 పేరుతో త్వరలోనే ఈ మందును మార్కెట్లోకి తీసుకొస్తామని చెబుతోంది సదరు కంపెనీ. విద్యార్థులు, క్రీడాకారులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కు ఇది ఎంతగానే ఉపయోగపడుతుందని అంటోంది. బహుశా.. ఈ మందును వాడితే వందకు వంద మార్కులు వచ్చేస్తాయేమో.

అయితే ఈ మందును మార్కెట్లోకి తీసుకొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇతర ఫార్మా కంపెనీలు వాదిస్తున్నాయి. 18నుంచి 35ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తుల్లో మెదడు చురుగ్గా ఉంటుందని, వాళ్లు ఈ మందును తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వాదిస్తోంది. మరీ ముఖ్యంగా క్విజ్ కార్యక్రమాలు, ప్రవేశ పరీక్షలు, క్రీడల్లో ఈ మందు వాడకం ఎక్కువైతే అది మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నాయి.

ఆశ్చర్యకరంగా ఈ మందుకు ఇంకా అనుమతి రాకముందే కొన్ని సైట్లలో అమ్మకాలు షురూ చేశారు. అయితే ఆన్ లైన్ సైట్లలో అమ్ముతున్న ఐక్యూ మందుకు, తమ మెడిసిన్ కు సంబంధం లేదని సదరు కంపెనీ వాదిస్తోంది.