లక్ అంటే.. సన్ రైజర్స్ జట్టుదే!

ఇంతవరకూ ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ కూడా కేవలం ఆరు మ్యాచ్ లలో విజయంతో ఏ జట్టూ కూడా ప్లే ఆఫ్స్ లేదా సెమిస్ స్థాయికి రాలేదు! కనీసం ఒక్కో సీజన్ కు ఏడు మ్యాచ్…

ఇంతవరకూ ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ కూడా కేవలం ఆరు మ్యాచ్ లలో విజయంతో ఏ జట్టూ కూడా ప్లే ఆఫ్స్ లేదా సెమిస్ స్థాయికి రాలేదు! కనీసం ఒక్కో సీజన్ కు ఏడు మ్యాచ్ లు నెగ్గనిదే ఇంత వరకూ ఏ జట్టు కూడా టాప్ ఫోర్ దశకు రాలేదు. తొలిసారి కేవలం ఆరు మ్యాచ్ లలో విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు ఎంపిక అయ్యింది!

మిగతా జట్లు అంతంతమాత్రం ప్రదర్శన చేయడంతో ఈ జట్టు వాటి కన్నా మెరుగైన రన్ రేట్ తో ప్లే ఆఫ్స్ కు ఎంపిక అయ్యింది. పాయింట్ల పట్టికలో కనీసం ఆరు మ్యాచ్ లు నెగ్గిన ఇతర జట్లు ఉన్నప్పటికీ.. మెరుగైన రన్ రేట్ మాత్రమే సన్ రైజర్స్ ను ఒడ్డుకు చేర్చింది!

నిన్నటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ నెగ్గి ఉంటే.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఏమీ ఉండేవేకావు. కనీసం మెరుగైన రన్ రేట్ ను ఆ జట్టు సాధించి ఉన్నా SRHకు అవకాశాలు ఉండేవి కావు. అదృష్టం ఉన్న వాడిని చెడబెట్టేవాడు ఉండడు అన్నట్టుగా సన్ జట్టు  ప్లే ఆఫ్స్ కు ఎంపిక అయ్యింది.

ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ జట్టు గమనం పడుతూ, లేస్తూ సాగింది. చేజేతురాలా మ్యాచ్ లను ఓడిపోవడాన్ని అలవాటుగా సాగించింది. ఏవో కొన్ని మ్యాచ్ లు విజయం సాధించడంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ దశకు వచ్చింది. అయితే ఆ జట్టుకు ఇప్పుడు కీలకమైన వార్నర్ దూరం అయ్యాడు.

ప్రపంచకప్ కు సమాయత్తంతో భాగంగా వార్నర్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఇక విలియమ్సన్ ఉన్నా ఈసారి అట్టర్ ఫ్లాప్.  రషీద్ ఖాన్ మెరుపులు కూడా గతంలాలేవు. ఉన్నంతలో మనీష్ పాండే ఫామ్ లోకి రావడం సన్ జట్టుకు ఊరట. ఫ్లే ఆఫ్స్ లో ఫిబ్రవరి ఎనిమిదిన ఎలిమినేటర్ మ్యాచ్ ను ఆడబోతోంది సన్ జట్టు. ఆ మ్యాచ్ లో గెలిస్తే సంచలనమే అవుతుంది. సన్ ఫామ్ ను బట్టి చూస్తే అదేం అంత తేలికగా కనిపించడం లేదు! 

వైయస్‌ను నెత్తిన పెట్టుకునేలా చేసిన పథకాలను బాబు కాలరాసారు