లవ్‌లెటర్‌ 2 రామయ్య : నీ పాట్లు పరమాత్ముడికెరుక!

డియర్‌ రావయ్యా…  Advertisement బాగుండావా… ఏం బాగుంటావులే… ఇప్పుడు నువ్వే పెద్ద సిక్కుల్లో పడినావే… మేవంతా నీ పిలకాయలవేగదా… నీకు ఎవురూ ఎక్కువకాదుగదా… అందరినీ సల్లంగా జూసుకునే దరమపెబువు నువ్వు… అట్టాంటి నీకోసం మేం…

డియర్‌ రావయ్యా… 

బాగుండావా… ఏం బాగుంటావులే… ఇప్పుడు నువ్వే పెద్ద సిక్కుల్లో పడినావే… మేవంతా నీ పిలకాయలవేగదా… నీకు ఎవురూ ఎక్కువకాదుగదా… అందరినీ సల్లంగా జూసుకునే దరమపెబువు నువ్వు… అట్టాంటి నీకోసం మేం కొట్టుకుంటావుంటే నీకు మాత్తరం బాదేయదా సామీ… కానీ ఏంజేసేది… వోళ్లు నువ్వు మాకే రావాలంటావుండారు. కానీ నువ్వు మాగ్గావాల్సిందే అని యీళ్లు గూడా యాగీ సేస్తన్నారు. నాయిన అంటే బిడ్డలందరికీ నాయినగానే ఉండాలిగదా… అట్టాగాకుండా మా ఒక్కరికే నాయినంటే మంచిదేనాసావీ…?

సరే ఈ మాటలకేంగానీ… అసలు నీ ఇట్టవేందో మాకుదెలియాల నాయనా… నువ్వు ఎవురి దగ్గిరికొస్తావు… యీళ్ల దగ్గరికొస్తావా… లేదా ఆళ్లతోనే ఉంటావా…? ఏ ఇసయం తేలాల. నువ్వు ఆళ్లతో ఎళితే మరి యీళ్లగ్గూడా నువ్వుగావాలిగదా… ఏటా నీ పెళ్లికి ఏడేడనుండో వస్తాండాముగదా… మరి నువ్వు ఆళ్లపరవైపోతే ఇంక యీళ్లు ఇప్పుడిమాదిరిగా నీ పెళ్లికొచ్చి… కళ్లారా పెళ్లిజూసి అచ్చింతలు ఏసి దణ్నం బెట్టుకొని పోగలరా నాయినా…? ఇప్పుడే ‘మా ప్రాంతం వొదిలేసి ఎళ్లిపోవాలంటూ’ ఆళ్లు అక్కడుంటేటోళ్లని దబాయిస్తావుండారే… ఇంక నువ్వుగూడా ఆళ్ల జట్టులోకి చేరిపోతే ఇంక యీళ్లని నీ మొకవైనా జూడనిస్తారా… మా తనివిదీరా నిన్ను పూజజేసుకోనిస్తారా…?

ఇట్టాగాదుగానీ… అసలు నీ ఇట్టవేందో జెప్పు? నువ్వు ఎవురికాడుంటావు? ఎవురికాడుంటావో జెప్పు. నువ్వుగనుక మాకాడికొస్తానంటే… ఈ ముక్క నువ్వు మాకుదెలిసేటట్టుగాజెప్పినావంటే సాలు… ఆ పెకారంగా జేద్దాం. ఎట్టాగైనా అనుమయ్యకు పురమాయించు. ఆయన తలుసుకుంటే నీ దయతో ఏటైనా జేసేస్తాడు. నువ్వు వొస్తానంటే ఆయన నీ గుడినిదెచ్చి నువ్వు తలిచినచోట బెట్టేయ్యడా…? నువ్వుజెప్పుసావీ… ఎవురుకాడుంటావని. ఇప్పుడు జెనానిది గాదుగానీ ఇష్టం… నీకే వొదిలేస్తావుండా… నువ్వు ఏంజెపితే అదే చేసేదానికిజూస్తా… సరేనా… తొందరగా ఏదోఒకటి జెప్పుసావీ… వుంటాను… నీ బదులుకోసం జూస్తావుంటా…!

ప్రేమతో

కపిలముని

[email protected]