టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు

ఇప్పుడు కేదారుతో స్నేహాలు ఉన్న వారంతా సైలెంట్‌గా ఉన్నారు. తెర వెనుక ఎవరి సాయం వారు చేస్తున్నారు తప్ప, పైకి ఎవ్వరూ మాట్లాడడం లేదు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్‌మెంట్‌తో టాలీవుడ్‌లో మళ్లీ మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. నిర్మాత కేదార్ దుబాయ్‌లో మరణించారు. ఆయన మరణం మీద అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసు నిందితులు అంతా వన్ బై వన్ ఎందుకు మరణిస్తున్నారు? ఎలా మరణిస్తున్నారు? దీనిపై విచారణ కోరతారా? అంటూ రేవంత్ రెడ్డి అనడం తేనె తుట్టను కదిలించినట్లు అయింది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు చిరకాలంగా విచారణలో ఉంది. తరువాత తరువాత అక్కడక్కడ మరి కొన్ని సార్లు సినిమా జనాలు పట్టుబడిన వైనం కూడా ఉంది. కానీ ఇవన్నీ విచారణలోనే ఉన్నాయి.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. కేసులు బయటకు తీసి, అవి ఏ పొజిషన్‌లో ఉన్నాయి అనేవి అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. కేదారి మరణం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది. అందులోనూ దుబాయ్‌లో మరణించడం, ఇప్పటి వరకు మృతదేహం ఇక్కడకు రాకపోవడం అన్నది పలు వార్తలకు దారి తీస్తోంది.

కేదార్ టాలీవుడ్‌లో చాలా మందికి అత్యంత సన్నిహితుడు. ఓ స్థాయికి చేరినవాడు. అక్కడి నుంచి కిందకు జారినవాడు. అయినా అతని స్నేహాలు మాత్రం బలమైనవి. డబ్బుతో సంబంధం లేనివి.

ఇప్పుడు కేదారుతో స్నేహాలు ఉన్న వారంతా సైలెంట్‌గా ఉన్నారు. తెర వెనుక ఎవరి సాయం వారు చేస్తున్నారు తప్ప, పైకి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఇప్పుడు డ్రగ్స్ కేసు, కేదార్ మరణం కనుక పొలిటికల్ టర్న్ తీసుకుంటే మళ్లీ వార్తల్లో హడావుడి మొదలవుతుంది.

10 Replies to “టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు”

  1. మోడి తో భేటీ అయ్యాక ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఏం జరిగిందో తెలిసే ఉంటుంది.

Comments are closed.