ఆ టీచర్‌గాడు కనిపిస్తే పల్లు రాలగొడ్తా..

చదువు చెప్పే టీచర్లు ఎంతో ఆదర్శంగా ఉండాలి. కంచే చేను మేసిన విధంగా ప్రవర్తిస్తే సమర్ధనీయం కాదని చెబుతుంది హిందీ హీరోయిన్‌ రాణీముఖర్జీ. ఈమె స్కూల్‌ టైంలో ఉండగా సైన్స్‌ టీచరొకాయన ఆమె పట్ల…

చదువు చెప్పే టీచర్లు ఎంతో ఆదర్శంగా ఉండాలి. కంచే చేను మేసిన విధంగా ప్రవర్తిస్తే సమర్ధనీయం కాదని చెబుతుంది హిందీ హీరోయిన్‌ రాణీముఖర్జీ. ఈమె స్కూల్‌ టైంలో ఉండగా సైన్స్‌ టీచరొకాయన ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించే వాడట. అప్పటికి ఎంతో అమాయకంగా ఉండే వయసు. ముంబయ్‌ కదా. స్కూలు డ్రెస్‌ కూడా సెక్సీగా స్కర్ట్‌, చొక్కాతో టై కట్టుకుని ఉండేదట. శనివారం మాత్రం సొంత  డ్రెస్సుల్లో రావచ్చట. 

అలాంటప్పుడు ఇంకా లేటెస్ట్‌ ఫ్యాషన్‌ డ్రెస్సులతో వెళ్లే రాణీ ముఖర్జీపై ఆ టీచర్‌ కన్ను పడిరదట. ఊరికే భుజాల మీద చేతులు వేసి ఇంకా తాకకూడని చోట్ల కూడా టచ్‌ చేసేవాడట. అది చైల్డ్‌ అబ్యూస్‌ అని తెలియని వయసట. ఇబ్బందిగా ఉన్నా నవ్వుతూ టీచర్ని గౌరవించే రాణీ ముఖర్జీతో రకరకాల రీతుల్లో ప్రవర్తించే వాడట. ఎయిత్‌ నుంచి నైన్త్‌ కొచ్చే టైం.. అమ్మాయిలందిలోనూ రాణీ ఒక్కతే లడ్డూలా కనిపించేదట. 

వాడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్న టైంలో లక్కీగా అతనికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యి వెళ్లిపోయాడట. ఆ తర్వాత తన స్కూల్‌, కాలేజీ టైంలో అలాంటి సంఘటనలు ఎదురు కాలేదంటుంది. అమ్మాయిల విషయంలో మగ టీచర్స్‌ ఇలా ప్రవర్తించడం తరనూ వార్తల్లో వచ్చినప్పుడల్లా తనకు ఆ విషయం గుర్తుకొస్తుందట. 13 ఏళ్ల నుండే అందంతో ఇబ్బందులెదుర్కున్న రాణీని ఓదార్చాల్సిందే మరి.