జాతీయ అవార్డుల కోసం తెలుగు సినిమాలు భారీగా పోటీపడ్డాయి. ఏకంగా 20 సినిమాలు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. అందులో అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. అందులో ఒకట్రెండు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలవొచ్చేమో అని పరిశ్రమ వర్గాలు ఆశించాయి.
అయితే పెద్ద సినిమాల్ని జ్యూరీ బృందం నిర్ద్వంద్వంగా పక్కన పెట్టేసింది. అగ్ర కథానాయకులు నటించిన సినిమాల్ని చూసిన జ్యూరీ `ఇవేం సినిమాలు, వీటిని ఎందుకు అవార్డులకి పంపారు` అని వ్యాఖ్యానించాయట. టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సొంతం చేసుకొన్న సినిమాని చూసి కూడా వాళ్లు ఆ మాట అన్నారట. `కథానాయకుడి క్రేజ్పైన అక్కడ ఇంతగా ఆడుండొచ్చు కానీ… సినిమా మాత్రం నైన్టీస్ ఫ్లేవర్‌తో ఉంద`ని వ్యాఖ్యానించారట.
ఆ అభిప్రాయంవల్లే తుది ఐదు సినిమాల జాబితాలోకి ఆ సినిమాని అస్సలు తీసుకోలేదట. ఇంకో భారీ సినిమా విషయంలో కూడా ఇదే రకమన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. దీంతో ఎవరూ ఊహించని రీతిలో `నా బంగారు తల్లి`కి అవార్డులు లభించాయి.