మైత్రీ మీద బన్నీ గుస్సా?

మైత్రీ డిస్ట్రిబ్యూటర్ల మీద హీరో అల్లు అర్జున్ సీరియస్ అయ్యారా? ఇష్టం వచ్చినట్లు షో లు ఒకేసారి వదలడం మీద హీరో ఆగ్రహించినట్లు తెలుస్తోంది. నిజానికి బన్నీ ఆలోచన వేరుగా వుందని తెలుస్తోంది. ఎర్లీ…

మైత్రీ డిస్ట్రిబ్యూటర్ల మీద హీరో అల్లు అర్జున్ సీరియస్ అయ్యారా? ఇష్టం వచ్చినట్లు షో లు ఒకేసారి వదలడం మీద హీరో ఆగ్రహించినట్లు తెలుస్తోంది. నిజానికి బన్నీ ఆలోచన వేరుగా వుందని తెలుస్తోంది. ఎర్లీ మార్నింగ్ నుంచి కొన్ని షో లు ముందుగా ఓపెన్ చేసి, లాస్ట్ లో మిడ్ నైట్ షో లు, ఎర్లీ ప్రీమియర్లు ఓపెన్ చేయాలన్నది హీరో ఆలోచనగా తెలుస్తోంది. అంతే కాదు.. టికెట్ రేట్లు భారీగా పెంచడం మీద కూడా బన్నీ కాస్త అసంతృప్తి తో వున్నట్లు తెలుస్తోంది.

కానీ హైదరాబాద్ లో ఎర్లీ ప్రీమియర్లు మినహా మిగిలినవి అన్నీ ఒకేసారి ఓపెన్ చేసేసారు. ఇది చూస్తూనే బన్నీ నిర్మాతలు, పంపిణీ దారుల మీద కాస్త చికాకు పడినట్లు తెలుస్తోంది. దాంతో ఎర్లీ ప్రీమియర్ల నుంచి మార్నింగ్ ఆరు గంటల టైమ్ వరకు వున్న షో లు ఇంకా ఒపెన్ చేయలేదు. షో బై షో ఓపెన్ చేసుకుంటూ వెళ్తే ఫుల్స్ క్లారిటీగా కనిపిస్తాయి. ఇప్పుడు టోటల్ గా రెడ్ కనిపిస్తోంది బుక్ మై షో లో. కానీ టికెట్ లు అన్నీ బ్లాక్ చేసినవి ఎక్కువ అని టాక్ వుంది.

ఎక్కువ మంది 9.30 స్పెషల్ ప్రీమియర్ కన్నా, అది పూర్తయిన తరువాత వచ్చే షో మీద ఆసక్తి ఎక్కువగా వుంది. ఎందుకంటే రెండు షో ల రేట్లకు మధ్య ఏడు వందలు తేడా వుంది. సినిమా టాక్ మీద ఆధారపడి వుంటుంది బాక్సాఫీస్ ఫుల్స్ అన్నది. 1.30 షో లు వద్దు అని బన్నీ చెప్పి ఆపించేవేసినట్లు తెలుస్తోంది.

9 Replies to “మైత్రీ మీద బన్నీ గుస్సా?”

    1. ఈ మధ్య ఈ అగ్రహాలు వినలేక చస్తున్నాం . MLA లు మామూళ్ల కోసం కొట్లాట ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు. కాకినాడ బియ్యం అక్రమ ఎగుమతుల ఫై సీరియస్ ఐన బాబు . ఉత్తర ఆంధ్ర

      కంపెనీ దెగ్గర మామూళ్లు వసూళ్లు చేస్తున్న సీనియర్ MLA ని వార్నింగ్ ఇచ్చిన బాబు.

      JC అది కి అమరావతి పిలిచి మందలించిన బాబు .

Comments are closed.