‘లెజెండ్’, ‘లయన్’ టైటిల్స్ తర్వాత బాలకృష్ణ తదుపరి చిత్రానికి కూడా అలాంటి పవర్ఫుల్ ఇంగ్లీష్ టైటిల్‌నే పెట్టాలని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. శ్రీవాస్ డైరెక్షన్లో బాలకృష్ణ నటించనున్న 99వ చిత్రానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్ కన్సిడర్ చేస్తున్నట్టు సమాచారం.
‘లౌక్యం’ చిత్రంతో భారీ హిట్ సాధించిన శ్రీవాస్ మళ్లీ అదే టీమ్‌తో బాలకృష్ణ కోసం ఒక ఎంటర్టైనర్ని రెడీ చేస్తున్నాడు. బాలకృష్ణ ఇటీవల చేస్తున్న సినిమాలకి పూర్తి భిన్నంగా ఈ చిత్రంలో కామెడీ ఎక్కువ ఉంటుందట.
మాస్‌ని మెప్పించే అంశాలకి తోడు, అన్ని వర్గాలని అలరించే కామెడీ కూడా తగ్గకుండా బాలకృష్ణని న్యూ డైమెన్షన్లో చూపించబోతున్నారని టాక్ ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. మరో హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది.