కొత్త వైరస్ వచ్చింది. మూడో వేవ్ వార్తలు వినిపిస్తన్నాయి. మళ్లీ సినిమాలు ఓటిటికి అంటూ గ్యాసిప్ లు సోషల్ మీడియాలో అలుముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా భీమ్లా నాయక్ మీదే వార్తలు అలుముకుంటున్నాయి.
ఇది కావాలని కొందరు యాంటీ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న వార్తలు అని యూనిట్ వర్గాల బోగట్టా. భీమ్లా నాయక్ ఓటిటికి ఇవ్వడం పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఇప్పట్లో తీసుకునేది లేదని కూడా యూనిట్ వర్గాలు తెలిపాయి.
పుష్ప సినిమా విడుదలయ్యే వరకు వేచి వుండే ధోరణిలో భీమ్లా యూనిట్ వుంది. పుష్ప సినిమా వేళకు ఏ అంక్షలు లేకపోతే, ఫ్యామిలీలు ధైర్యంగా థియేటర్ కు వస్తే భీమ్లా నాయక్ కూడా థియేటర్లలోకే వస్తుంది. లేదూ పరిస్థితులు వికటిస్తే అప్పుడు ఓటిటి ఆలోచన చేస్తారు.
సంక్రాంతికి భీమ్లా నాయక్ ను రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. భీమ్లా నాయక్ వస్తే అటు ఆర్ఆర్ఆర్ కు ఇటు రాధేశ్యామ్ కు ఇద్దరికీ ఇబ్బందే. కానీ భీమ్లా నాయక్ మొండిగా ముందుకె వెళ్తోంది.
రాజమౌళి, దిల్ రాజు లాంటి వారు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో యాంటీ ఫ్యాన్స్ ఈ ఓటిటి వార్తలు ప్రచారంలోకి తెస్తున్నారని బోగట్టా.
అయితే 110 కోట్ల ఖర్చుతో తయారైన భీమ్లా నాయక్ ఓటిటి వెళ్లాలంటే కనీసం ఆ మేరకు అన్నా బేరం రావాలి. ఆపైన శాటిలైట్, హిందీ డబ్బింగ్ అన్నది లాభంగా మిగులుతుంది.