బయోపిక్ సెన్సార్.. ఏమిటీ మాయ?

సాధారణంగా తెలుగు పెద్ద సినిమాల సెన్సారు విడుదలకు నాలుగయిదు రోజులు ముందుగా కానీ జరగదు. దీనికి రెండు కారణాలు. ఒకటి సినిమాను డైరక్టర్లు లాస్ట్ మినిట్ వరకు చెక్కుతూ వుండడం. రెండు ముందుగా సెన్సారు…

సాధారణంగా తెలుగు పెద్ద సినిమాల సెన్సారు విడుదలకు నాలుగయిదు రోజులు ముందుగా కానీ జరగదు. దీనికి రెండు కారణాలు. ఒకటి సినిమాను డైరక్టర్లు లాస్ట్ మినిట్ వరకు చెక్కుతూ వుండడం. రెండు ముందుగా సెన్సారు అయిపోయింది అంటే సినిమా ఎలా వచ్చింది అన్న టాక్ మీద రకరకాల గ్యాసిప్ లు పుట్టుకురావడం. ఇలా గ్యాసిప్ లు వస్తే, సినిమాను కొన్నవాళ్లు, లాస్ట్ మినిట్ లో పేమెంట్ లు తగ్గించడాలు, ఎగ్గొట్టడాలు లాంటి వ్యవహారాలు వుంటాయి.

ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ సెన్సారు మీద జనాల్లో విపరీతమైన ఆసక్తి వుంది. వాస్తవానికి సెన్సారు మొన్నటికి మొన్న జరగాల్సి వుంది. ప్రసాద్ ల్యాబ్ లో పిఎక్స్ డి లోడింగ్ కూడా జరిగింది. కానీ లాస్ట్ మినిట్ లో వాయిదా పడినట్లు గ్యాసిప్ లు వినిపించాయి. దీనికి యూనిట్ కు చెందిన జనాల వైపు నుంచి ఆఫ్ ది రికార్డుగా మూడురకాలు వెర్షన్లు వినిపించాయి.

ఒకటి – సెన్సారు ఆఫీసర్ సెలవులో వున్నారని, తరువాత చూస్తారని.
రెండు – ఘడియలు బాగాలేవు కనుక, బాలయ్య సెన్సారు వద్దన్నారని, మూడవ తేదీన చేయమని కోరారని.

మూడు – ఫైనల్ వెర్షన్ లోడ్ చేయలేదు. పొలిటికల్ బ్యాక్ గ్రవుండ్ వున్న వ్యక్తి బయోపిక్ కనుక, ఫుల్ అండ్ ఫైనల్ వెర్షన్ లోడ్ చేస్తేనే చూస్తామని సెన్సారు అధికారి అన్నారని. (సాధారణంగా సినిమాల సెన్సారు కోసం ఆర్ ఆర్ లేని కాపీ, ఫైనల్ కానీ కాపీ కూడా లోడ్ చేసి, కామ్ గా సెన్సారు చేయించేయడం ఇండస్ట్రీలో మామూలే).

ఇదిలావుంటే ఇప్పుడు లేటెస్ట్ గా మరో గ్యాసిప్ వినిపిస్తోంది. అనుకున్న షెడ్యూలు ప్రకారం సెన్సారు జరిగిపోయిందని. క్లీన్ యు వితవుట్ కట్స్ వచ్చాయని తెలుస్తోంది. అయితే యూనిట్ ఈ విషయాన్ని ఇంత రహస్యంగా ఎందుకు వుంచింది అన్నది ప్రశ్న?

బయోపిక్ ఎలా వచ్చింది? సెన్సారు టాక్ ఏమిటి? అన్న దానిపై ఇక రకరకాల వ్యాఖ్యానాలు, గ్యాసిప్ లు బయలుదేరతాయి అనే ఆలోచనతోనే సెన్సారు వ్యవహారం దాచి పెట్టారా? లేక, అసలు నిజంగానే సెన్సారు జరగలేదా? డైరక్టర్ క్రిష్ కే తెలియాలి.

న్యూ ఇయర్ స్పెషల్ చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

మోడీ ఎదుగుదలను RSS కట్ చేస్తోందా?