పొడుగు సుందరి దీక్షా సేథ్‌కి ఏం చేసినా సక్సెస్ మాత్రం దొరకడంలేదు. ఏవో ఒకటీ అరా సక్సెస్‌లు కెరీర్లో వున్నా, అవేవీ హీరోయిన్గా ఆమె రేంజ్‌ని పెంచలేదన్నది ఆమెకూ తెలుసు. ‘నేను నటించిన కొన్ని సినిమాలు విజయవంతమైనా ఆ విజయాల్ని నేను క్యాష్ చేసుకోలేకపోయాను.. కష్టపడి నటించడం వరకూ నాలో ఏ లోపమూ లేదనే అనుకుంటున్నా.. అదృష్టమొక్కటే కలిసిరావడంలేదు..’ అని వాపోతోందామె.
ఆమె ఎవరో కాదు, దీక్షా సేథ్. తెలుగులో ‘వేదం’ ఈమెకి తొలి సినిమా. ఆ తర్వాత ‘మిరపకాయ్’, ‘వాంటెడ్’, ‘నిప్పు’, ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాల్లో నటించినా సక్సెస్ ఆమెకు అందని ద్రాక్షగానే మారింది. చేసినవాటిల్లో ‘మిరపకాయ్’ ఒక్కటే ఆమెకు హిట్ సినిమా తెలుగులో. ఇక హిందీలోనూ ఆమె పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు.
మొన్నామధ్య ఓ సినిమాలో నటించిన దీక్షా సేథ్, ఆ సినిమా తనకు బాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చిపెడ్తుందని భావించిందిగానీ, ఆ సినిమా విడుదలయ్యాక ఆమె గురించి పట్టించుకునేవారే లేరు. దాంతో, ‘బికినీకైనా లిప్ కిస్కైనా నేను రెడీ..’ అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా మీడియాలో చోటు దక్కించుకుంది.
‘ఇలా దేనికైనా రెడీ.. అనడం ఎన్నోసారమ్మా దీక్షమ్మా..’ అని బాలీవుడ్ సినీ జనం అనుకుంటున్నారిప్పుడామె గురించి. మోడల్‌గా ఆమె టూ పీస్ బికినీలో ఎప్పుడో కన్పించేసింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆమె బికినీలో చూపించేదేంటి.? అన్నవారూ లేకపోలేదు. ఆమె తాపత్రయం ఆమెది. దేనికైనా రెడీ.. అంటోన్న దీక్షకి ఆమె కోరుకునే బంపర్ ఛాన్స్ ఎవరిస్తారో వేచి చూడాలి.