రంగస్థలం: ఫైట్లు కూడా కొత్తగా ఉంటాయట

1985 నాటి కథ. సన్నివేశాలు, లొకేషన్లు మాత్రమే కాదు.. దాదాపు అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ మన చుట్టూ ఉండే పరిసరాలతో పాటు భాష, అలవాట్లు, టెక్నాలజీ.. ఇలా…

1985 నాటి కథ. సన్నివేశాలు, లొకేషన్లు మాత్రమే కాదు.. దాదాపు అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ మన చుట్టూ ఉండే పరిసరాలతో పాటు భాష, అలవాట్లు, టెక్నాలజీ.. ఇలా ఎన్నో మారిపోయాయి.

అందుకే రంగస్థలం సినిమాలో ఫైట్స్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్స్ కంపోజ్ చేయడం కోసం రామ్-లక్ష్మణ్ చాలా కష్టపడుతున్నారట.

ప్రస్తుతం మనం చూస్తున్న గాల్లో ఎగరడాలు, కొడితే గింగిరీలు తిరిగి ఎక్కడో పడిపోవడాలు లాంటి రోప్-టెక్నిక్స్ వాడడం లేదట. అత్యంత సహజంగా ఈ ఫైట్స్  చిత్రీకరిస్తున్నారట.

రామ్ చరణపై ఇప్పటికే ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ పూర్తయింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత చరణ్-సమంత మధ్య మరో సాంగ్ పిక్చరైజ్ చేస్తారట. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆన్-లొకేషన్ స్టిల్స్ చాలా బయటకొచ్చాయి. చరణ్ లుక్ ఎలా ఉండబోతోందనే విషయంపై దాదాపు ఓ ఐడియాకు వచ్చేశారు ఆడియన్స్. కాకపోతే చెర్రీ ఇందులో వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నాడనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.