Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజు కు మహేష్ ఫిదా

దిల్ రాజు కు మహేష్ ఫిదా

హీరోల మనసు దోచుకోవడంలో హీరోయిన్ల కన్నా ముందు వుంటున్నారు నిర్మాత దిల్ రాజు. ఏ హీరో సంగతి ఎలావున్నా, మహేష్ బాబు మాత్రం ఇప్పుడు దిల్ రాజు అంటే బాగా ఫిదా అయిపోయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరే నిర్మాత అయినా మహర్షి సినిమా ఇంత స్మూత్ గా రిలీజ్ జరిగి వుండేది కాదని టాక్. సినిమా డేట్ లు వాయిదా పడినా, అన్ని విధాలా ఫెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసి, ఆయన చేతిలో వున్న అన్ని సినిమాలను ముందుగా, వెల్ ప్లాన్డ్ గా విడుదల చేయించేసారు. చిత్రలహరి, జెర్సీ, మజిలీ అన్నీ అయిపోయిన తరువాత పీక్ సమ్మర్ లో మహర్షి డేట్ సెట్ చేసారు.

మరే నిర్మాత అయినా ఇది సాధ్యంకాదు. దిల్ రాజు చేతిలోనే అన్నిసినిమాలు వున్నాయి కనుక వీలయింది. అదే సమయంలో నైజాంలో ఫస్ట టైమ్ మల్టీ ఫ్లెక్స్ ల రేట్లు పెంచుకొనేలా చేయగలిగిన ఘనత దిల్ రాజు ఖాతాలోనే పడుతుందని ఇండస్ట్రీ టాక్. ఇలా చేయడం మిగిలిన వారికి సాధ్యంకాని పని అంటున్నారు. ఇందువల్ల టోటల్ కలెక్షన్ లో 25శాతం అదనంగా వచ్చిందని లెక్కలు చెబుతున్నారు.

అన్నింటికి మించి, ముగ్గురు నిర్మాతలు, అదనపు బడ్జెట్ కావడం, డిస్కషన్లు, తకరారులు వున్నా, అన్నింటిని స్మూత్ గా సెటిల్ చేయడం దిల్ రాజు వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. లేకపోయివుంటే వేరేగా వుండేదని టాక్. మహర్షి సినిమాను అన్ని ఏరియాలు ఇలా అనుకున్న రేట్లకు ఇవ్వడం దిల్ రాజు వల్లే సాధ్యమైంది. ఆయన రెగ్యులర్ బయ్యర్లు, ఆయన వరుసగా తీసే సినిమాలను చూసి, చెప్పిన రేటుకే తీసుకోవడం సాధ్యమైంది.

ఇలా అన్నివిధాలా దిల్ రాజు వ్యవహారాలను దగ్గర నుంచి చూసిన మహేష్ బాబు ఇక ఆయనను వదలరని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి అనిల్ సుంకర-అనిల్ రావిపూడి ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకున్నారు. ఇది కొన్నాళ్ల కిందటి సంగతి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా దిల్ రాజు వుండాల్సిందే అని మహేష్ బాబే కాదు, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

దిల్ రాజు దగ్గర వంశీ పైడిపల్లి తరువాత సినిమా డేట్ లు కూడా వున్నాయి. అందువల్ల ఇక మహేష్-దిల్ రాజు జోడీ ఇలా కొనసాగుతుందనే అనుకోవాలి. 

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?