మన దగ్గర నిర్మాత అంటే క్యాషియరే..అంతే తప్ప టీజర్ తయారీలో, ట్రయిలర్ తయారీలో తల దూర్చేదో, ముందుగా చూసి ఓకె చేసేదో వుండదు. డైరక్టర్ తయారు చేయించడం..హీరో ఓకె చేయడం..అంతే. కానీ కార్పొరేట్ సంస్థ అయిన ఈరోస్ వ్యవహారం అలా కాదట. ప్రతీదీ వాళ్లకు చూపించాలి..వాళ్లు ఓకె చేయాలి.
డిక్టేటర్ సినిమా టీజర్ ను బాలయ్య అభిమానుల కోసం దసరాకు విడుదల చేయలేకపోవడానికి ఇదే కారణమని తెలుస్తోంది.ఈ సినిమాను ఈరోస్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దసరా ముందు రోజు అర్థరాత్రి వరకు పాపం, దర్శకుడు శ్రీవాసు టీజర్ విడుదల కోసం కిందా మీదా పడ్డారు. కానీ విడుదల కాలేదు.
టీజర్ ను ఒకటి రెండు సార్లు మార్పించడం, ఆపై ఈరోస్ అఫిషియల్స్ కు పంపడం వంటి కార్యక్రమాలు జరిగాయని వినికిడి. మరి అక్కడి నుంచి అప్రూవ్ కాలేదో? మరేమయిందో? మొత్తానికి టీజర్ రాలేదు.
శుక్రవారం విడుదలకు మార్గం సుగమం అయింది. మరి కొన్ని గంటల్లో టీజర్ అభిమానుల ముందుకు వస్తుంది. ఈలోగా మరీ అభిమానులు నిరుత్సాహ పడకూడదని ఓ పోస్టర్ మాత్రం డిజైన్ చేసి విడుదలచేసారు.