ఎక్స్ క్లూజివ్-హను- ప్రభాస్ డిజిటల్ 150 కోట్లు

సరైన ప్రాజెక్ట్ అయితే కొబ్బరికాయ కొట్టనక్కరలేదు. జ‌స్ట్ ప్లానింగ్ లో వుండగానే డిజిటల్ ప్లాట్ ఫారమ్ లు ఎగరేసుకుని వెళ్లిపోతాయి.

సరైన ప్రాజెక్ట్ అయితే కొబ్బరికాయ కొట్టనక్కరలేదు. జ‌స్ట్ ప్లానింగ్ లో వుండగానే డిజిటల్ ప్లాట్ ఫారమ్ లు ఎగరేసుకుని వెళ్లిపోతాయి. అలాగే పెద్ద సంస్థలు అంటే ఓటీటీ ప్లాట్ ఫారమ్ లతో ఒక కంటిన్యూ జ‌ర్నీ వుంటుంది. అందువల్ల డిజిటల్ అమ్మకాలు అస్సలు సమస్య కానే కాదు.

మైత్రీ సంస్థ ఓ ప్రెస్టీజియస్ సినిమాను ప్లాన్ చేసింది. హను రాఘవపూడి దర్శకుడు, ప్రభాస్ హీరో, భారీ పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా ఓటీటీ అంటే డిజిటల్ హక్కులు అప్పుడే విక్రయించేసినట్లు తెలుస్తోంది.

హను- ప్రభాస్ కాంబో సౌత్ ఇండియా డిజిటల్ హక్కులు 150 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. నాన్ థియేటర్ హక్కుల్లో మేజ‌ర్ షేర్ ఈ డిజిటల్ హక్కులే. ఇవి కాకుండా శాటిలైట్లు, అడియో, హిందీ ఇలా ఇంకా వుంటాయి. అన్నీ కలిపి మరో 150 కోట్లకు పైగా వస్తాయి. అంటే ఒక్క నాన్ థియేటర్ హక్కులే 300 కోట్లకు పైగా వచ్చే అవకాశం క్లియర్ గా వుంది.

సినిమా విడుదలకు ముందు థియేటర్ బిజినెస్ కూడా ఎలాగూ బీభత్సంగా వుంటుంది. సినిమా నిర్మాణ వ్యయం కూడా అదే రేంజ్‌లో వుంటుంది. పీరియాడిక్ డ్రామా కావడం, సెట్ లు, సిజి పనులు ఎక్కువ వుంటాయి. రెమ్యూనిరేషన్లు కూడా అదే రేంజ్‌ లో వుంటాయి. ఏమైనా మైత్రీ సంస్థకు భారీ లాభాలు తప్పవు.

5 Replies to “ఎక్స్ క్లూజివ్-హను- ప్రభాస్ డిజిటల్ 150 కోట్లు”

Comments are closed.