కూట‌మి దుర్మార్గ పాల‌న‌కు ఇవిగో నిద‌ర్శ‌నాలు

కూట‌మి స‌ర్కార్ పాల‌న దుర్మార్గంగా వుంద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తే ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే కూట‌మి స‌ర్కార్ తీవ్ర వ్య‌తిరేక‌త తెచ్చుకుంద‌నే ప్ర‌చారం వెల్లువెత్తుతోంది. ఈ ప్ర‌చారంలో నిజం ఉందా?…

కూట‌మి స‌ర్కార్ పాల‌న దుర్మార్గంగా వుంద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తే ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే కూట‌మి స‌ర్కార్ తీవ్ర వ్య‌తిరేక‌త తెచ్చుకుంద‌నే ప్ర‌చారం వెల్లువెత్తుతోంది. ఈ ప్ర‌చారంలో నిజం ఉందా? అంటే… ఔన‌నే స‌మాధానం సొంత పార్టీ నేత‌ల నుంచే వ‌స్తోంది. ఇందుకు తాజాగా ఇద్ద‌రు టీడీపీ నేత‌ల ఆవేద‌న‌లే నిద‌ర్శ‌నం.

ముందుగా క‌డ‌ప‌కు వెళ్దాం. ఇటీవ‌ల క‌డ‌ప‌లో టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడు శివ‌కొండారెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. సొంత వాళ్లే త‌న‌పై దాడి చేశార‌ని, నిందితుల్ని క‌ఠినంగా శిక్షించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. క‌డ‌ప రిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జి అయిన కొండారెడ్డి తాజాగా…. ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. ఆ వీడియోలో ఏముందంటే…

“చంద్ర‌బాబును మ‌రోసారి సీఎంగా చూసేందుకు ల‌క్ష‌ల రూపాయిలు ఖ‌ర్చు చేశాను. టీడీపీ కోసం రూ.90 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశా. కానీ నాకు బ‌హుమ‌తిగా తొమ్మిది కుట్లు ప‌డేట్టు కొట్టారు. క‌డ‌ప‌లో విష సంస్కృతి వ‌చ్చింది. వైసీపీ, ఇత‌ర రాజ‌కీయ పార్టీల వ‌ల్ల నాకు ఎలాంటి ప్ర‌మాదం లేదు. సొంత పార్టీ నాయ‌కుల‌తో నాకు ప్ర‌మాదం పొంచి వుంది. క‌డ‌ప‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు భ‌య‌భ్రాంతుల‌తో బ‌తుకుతున్నారు. దుష్ట శ‌క్తుల నుంచి నాకు ప్రాణ‌హాని వుంది. నాకు చంద్ర‌బాబు, లోకేశ్ ర‌క్ష‌ణ క‌ల్పించాలి. పార్టీ నిబంధ‌న‌ల మేర‌కు కొన్ని విష‌యాలు నేను బ‌య‌ట పెట్ట‌లేకపోతున్నా. నాపై దాడికి సంబంధించి పోలీసులు చెప్పిందంతా క‌ట్టుక‌థ‌. అందులో ఎలాంటి వాస్త‌వం లేదు. ఈ రోజు క‌డ‌ప‌లో స్వేచ్ఛ‌గా వ్యాపారం చేసుకునే ప‌రిస్థితి లేదు” అని శివ‌కొండారెడ్డి వాపోతూ ఒక వీడియోను విడుద‌ల చేశారు.

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌కు వెళితే, ఇలాంటి ప‌రిస్థితే. త‌న‌ను ఆళ్ల‌గ‌డ్డ నుంచి వెళ్లిపోవాల‌ని డీఎస్పీ ఒత్తిడి చేస్తున్నారంటూ, ద‌య‌చేసి త‌న‌కు న్యాయం చేయాల‌ని టీడీపీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. సొంత పార్టీకి చెందిన నాయ‌కుడికి, సొంత వూళ్లో ఉండే ప‌రిస్థితి లేక‌పోవ‌డం కంటే దుర్మార్గం ఏముంటుంది?

టీడీపీ నేత‌ల‌కే, ఆ పార్టీ పాల‌న‌లో ర‌క్ష‌ణ లేక‌పోతే, ఇక ఇత‌రుల ప‌రిస్థితి ఏంటి? అనే ప్రశ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఇప్ప‌టికైనా క్షేత్ర‌స్థాయిలో ఎలాంటి ప‌రిస్థితులున్నాయో పాల‌కులు గుర్తెరిగి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

13 Replies to “కూట‌మి దుర్మార్గ పాల‌న‌కు ఇవిగో నిద‌ర్శ‌నాలు”

  1. వాటికి ప్రజలకి ప్రభుత్వానికి సంబంధం లేదు… అవి పూర్తిగా వాళ్ళ సొంత ప్రాబ్లెమ్

      1. అంతే కదా.. దోచుకున్న సొమ్ము కోసం అన్నాచెల్లెళ్లు రోడ్డు మీద పడితే.. మన సాక్షి లో మాత్రం.. బాబు వదిలింది కుట్ర బాణం అని రాసుకొన్నారు..

Comments are closed.