గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ రీమిక్స్?

రెండేళ్లుగా వార్తల్లో మాత్రమే వుంటూ వస్తున్న గబ్బర్ సింగ్ 2 సినిమా జనవరి నుంచి సెట్ పైకి వెళ్తుందని ఇప్పటికి వున్న సమాచారం. దర్శకుడిగా బాబి (రవీంద్ర)ను పెట్టుకున్న తరువాత, ఆయన స్క్రిప్ట్ పని…

రెండేళ్లుగా వార్తల్లో మాత్రమే వుంటూ వస్తున్న గబ్బర్ సింగ్ 2 సినిమా జనవరి నుంచి సెట్ పైకి వెళ్తుందని ఇప్పటికి వున్న సమాచారం. దర్శకుడిగా బాబి (రవీంద్ర)ను పెట్టుకున్న తరువాత, ఆయన స్క్రిప్ట్ పని మీదేవున్నాడు. గతంలో చేసిన స్క్రిప్ట్ ను ఏ మేరకు మారుస్తున్నారో తెలియదు. 

పవన్ స్క్రిప్ట్ కాబట్టి మార్పులేవీ వుండకపోవచ్చు. డైలాగ్ వెర్షన్ మారుతుంది. పాటల విషయంలో పని త్వరలో ప్రారంభమవుతుందట. పార్ట్ వన్ కు టూ కు పెద్దగా సంబంధం లేకపోయినా, టైటిల్ సాంగ్ మాత్రం మళ్లీ ఈ సినిమాలో కూడా వినిపించాలని డిసైడ్ అయ్యారని వినికిడి. 

అయితే ఆ పాట ట్యూన్ మరీ భయంకరంగా పాపులర్ అయిపోయింది కాబట్టి, మరో మాంచి ట్యూన్ తో రీమిక్స్ చేద్దామని దేవీ ప్లాన్ చేస్తున్నాడట. అంటే మరో మాంచి గబ్బర్ పాట వస్తుందన్నమాట.