‘గంట’మోగిస్తున్న కొత్త హీరో

టాలీవుడ్ లో ఎక్కడో అదృష్టం నక్కతోక తొక్కితే తప్ప, ఎటువంటి బ్యాకప్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా హీరో కావడం అన్నది అసాధ్యం. పొరపాటున అలా అయినా కూడా సస్టైన్ కావడం ఇంకా అసాధ్యం..పంపిణీదారులు,…

టాలీవుడ్ లో ఎక్కడో అదృష్టం నక్కతోక తొక్కితే తప్ప, ఎటువంటి బ్యాకప్ లేకుండా, గాడ్ ఫాదర్ లేకుండా హీరో కావడం అన్నది అసాధ్యం. పొరపాటున అలా అయినా కూడా సస్టైన్ కావడం ఇంకా అసాధ్యం..పంపిణీదారులు, నిర్మాతలు, స్టూడియో ఓనర్లు, హీరొలు ఇలాంటి లెవెల్ బ్యాకప్ వుంటేనే హీరోగా పుట్టి, రాణించడానికి ఎక్కువ చాన్స్ వుంటుంది. అందుకే కాస్త మంచి ఫిజిక్ వుండి, డబ్బున్న పిల్లలు అంతా టాలీవుడ్ లోకి ఎప్పుడు దూకేద్దామా అని చూస్తుంటారు. ఇప్పుడు ఆ జాబితాలో మరొ పేరు అన్నింటికన్నా ముందుకు చేరి కూర్చుంది. అదే గంటా రవితేజ.

ఇంటిపేరు వినగానే అనుమానం వచ్చేవుంటుంది. నిజమే. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లి, అక్కడి నుంచి కాంగ్రెస్ మీదుగా తెలుగుదేశంలోకి చేరిన మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడే ఈ రవితేజ. పార్టీ ఏది అధికారంలోవున్నా పదవి పదిలంగా వుంచుకున్న తండ్రికి ఏకైక వారసుడు. పైగా మరో మంత్రికి కాబోయే అల్లుడు అని వినికిడి. మరి డబ్బుకు లోటేముంది. సినిమా చాన్స్ లతో అవసరమేముంది. తన సినిమాలు తానే తీసుకోగలడు. లేదా మన డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీయండి బాబూ అంటే టాలీవుడ్ లో బినామీ ప్రొడ్యూసర్లకు కొదవేముంది?

అందుకే ఇప్పుడు ఈ జూనియర్ రవితేజ విదేశాల్లో ఏక్టింగ్ నేర్చుకుని, వైజాగ్ లంకపల్లి సత్యానంద్ దగ్గర మాటలు, నటన నేర్చుకుని టాలీవుడ్ లో దూకేసేందుకు రెడీ అవుతున్నాడు. మాంచి ఫ్యామిలీ సబ్జెక్ఠ్ కావాలట కుర్రాడికి. సత్తా వున్న డైరక్టర్లు, సబ్జెక్ట్ వున్న కథకులు ఛలో వైజాగ్ ఎంవీపీ కాలనీ.

అయినా టాలీవుడ్ కు ఈ మాత్రం రేంజ్ వున్న హీరోల అవసరం చాలా వుంది. అసలే సినిమా రంగంస్లంప్ లో వుండి జనాలకు పని లేదు. ఇలాంటి బడాబాబులు వస్తే కాస్త పది మందికి పనయినా దొరుకుతుంది.